Intinti Gruhalakshmi 17 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 818 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి తన చిన్నప్పటి మెమోరీస్ అన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటుంది. సామ్రాట్ కు చెబుతుంది. ఇంతలో తన సంతకలో వాక్ మెన్ కనిపిస్తుంది. పాత వాక్ మెన్ ను కూడా దాచుకున్నారా అని అడుగుతాడు. దీంతో ఇది ఇందులో ఉందా. చిన్నప్పుడు ఇందులో క్యాసెట్ పెట్టి మా అమ్మ పాటను రికార్డ్ చేశాను. అంతా బాగానే ఉంది కానీ.. ఇది ఓపెన్ కాలేదు. టేప్ చుట్టుకుపోయింది. బలవంతంగా ఓపెన్ చేస్తే టేప్ తెగిపోతుందని తెలిసి అలాగే దాన్ని ఉంచేశాను అంటుంది తులసి. దీంతో మళ్లీ ఇప్పుడు పాడి రికార్డు చేయండి అంటాడు సామ్రాట్. దీంతో అప్పుడు పాడింది వేరు.. ఇప్పుడు పాడింది వేరు అంటుంది తులసి. సరే.. అది నేను చూసుకుంటాను లెండి అంటాడు సామ్రాట్.
మరోవైపు లాస్య మాటలకు చాలా బాధపడుతుంది అంకిత. తనకు ఏం చేయాలో అర్థం కాదు. నందు కూడా తననే తప్పు పట్టడంతో ఏడుస్తూ కూర్చొంటుంది. ఇంతలో అక్కడికి పరందామయ్య, అనసూయ వస్తారు. బాధపడుతున్నావా అమ్మ అంటాడు పరందామయ్య. చూశారా.. తాతయ్య లాస్య ఆంటి ప్రవర్తన అంటుంది. దీంతో అంతా చూశాం అంటారు. నేను చేసే మంచిపని కూడా తనవైపు తిప్పుకొని మామయ్య ముందు నన్ను చులకన చేసింది అంటుంది. ఇంతలో అభి వాళ్ల మాటలు విని అక్కడికి వస్తాడు. మనిషి ఎలాంటి వాళ్లు అయినా మంచి మాటలు చెప్పినప్పుడు వింటే మంచిదే కదా అంటాడు అభి. అంత కష్టపడి చదివింది ఉచితంగా ట్రీట్ మెంట్ చేయడానికా.. అంటాడు అభి.
అసలు నా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేయొద్దు అనడానికి ఆమె ఎవరు అని అంటుంది అంకిత. దీంతో ఆమె ఎవరో ఈ ఇంట్లో అందరికీ తెలుసు అమ్మ. అయినా మనం ఏం చేయలేం అంటాడు పరందామయ్య.
దీంతో తాతయ్యకు అర్థం అయినంత కూడా నీకు అర్థం కావడం లేదు అంటాడు అభి. దీంతో చీ.. అంత చీప్ గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్తుంది అంకిత. మరోవైపు తనకు కావాల్సిన అన్ని వస్తువులను తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తారు తులసి, సామ్రాట్.
ఆ ఇంటి నుంచి బయటికి వస్తుంది కానీ.. ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవాలనిపించదు. ప్రశాంతంగా కొన్నేళ్లు బతికినా చాలు అంటుంది తులసి. ఈ మనసు చాలా చంచలమైంది అంటాడు సామ్రాట్. ఎప్పుడు ఏం కోరుకుంటుందో దానికే తెలియదు అంటాడు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే.. ఆ ప్రశాంతత విలువ మనసుకు తెలియదు అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఒక పని చేద్దాం.. మీ ఇంటి ముందు నిలబడి ఫోటోలు దిగండి. వాటిని అప్పుడప్పుడు చూసుకోవచ్చు అని చెబుతాడు. తర్వాత ఫోటోలు తీస్తాడు సామ్రాట్.
కట్ చేస్తే పేపర్ చదువుతూనే పరందామయ్య.. నిద్రపోతూ ఉంటాడు. పరందామయ్యను చూసి షాక్ అవుతుంది అనసూయ. శృతిని పిలుస్తుంది. చూడు అంటుంది. మెల్లగా పేపర్ తీసేస్తుంది అనసూయ.
దీంతో గబుక్కున లేస్తాడు పరందామయ్య. ఈ నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. అందుకే నాకు ఒక కప్పు టీ ఇవ్వండి అంటాడు. దీంతో శృతి నేను తీసుకొస్తా అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ పాలప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ తీయబోగా.. ఫ్రిడ్జ్ కు లాక్ వేసి ఉంటుంది.
ఇప్పుడు పాల ప్యాకెట్ కోసం కూడా అమ్మ గారిని వెళ్లి అడగాలన్నమాట. ఏం చేస్తాం.. తాతయ్య గారి కోసం తప్పదు కదా అని అనుకుంటుంది. దీంతో లాస్య దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ తాళం కావాలి అని అడుగుతుంది.
ఎందుకు అంటే.. పాల ప్యాకెట్ కావాలి అంటుంది. ఎందుకు అంటే తాతయ్యకు టీ కావాలట అంటుంది. ఇప్పటికే రెండు సార్లు కోటా అయిపోయింది కదా అంటుంది లాస్య. దీంతో తాతయ్యకు నిద్ర వస్తోందట అంటుంది శృతి.
తాతయ్య అయినా.. ఇంకెవరైనా సరే.. లెక్క లెక్కే అంటుంది లాస్య. దీంతో ఏం చేయాలి అని అనుకుంటుంది శృతి. మరోవైపు కారులో తులసి, సామ్రాట్ వెళ్తుంటారు. ఇంతలో తన కారు ముందు ముగ్గురు మహిళలు నిలబడతారు.
దీంతో కారుకు అడ్డంగా నిలబడ్డారు ఏంటి అని అడుగుతారు. దీంతో ముందు మీరు కిందికి దిగండి అంటారు. దీంతో వీళ్లు చందాలు అడుగుతారా అని అనుకుంటారు. మేము చందాలు అడిగే బ్యాచ్ కాదు అంటారు.
దీంతో కారు దిగుతారు ఇద్దరూ. ఏమండి.. కారు దిగాం కదా.. విషయం ఏంటో చెప్పండి అంటాడు సామ్రాట్. దీంతో మీకు ఈ సీన్ లో డైలాగులు లేవు. పక్కకు జరగండి అంటుంది ఒకావిడ. పొద్దున నుంచి కారులో మా రోడ్లన్నీ తెగ తిరుగుతున్నారు.. ఏంటి విషయాలు అని అడుగుతారు.
దీంతో ఇది మా పుట్టిన ఊరు అంటుంది తులసి. దీంతో పుట్టి పెరిగిన ఊరు గుర్తుంది కానీ.. తన స్నేహితులు మాత్రం గుర్తులేరే అని అనుకుంటారు. మరి ఏం చేద్దాం అంటే.. తీసుకెళ్లి చిన్న చెరువులో ముంచేద్దాం అంటారు.
అప్పుడు తన చిన్ననాటి ఫ్రెండ్స్ అని గుర్తుకొస్తుంది తులసికి. ముగ్గురూ కలిసి చాలా సేపు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉండిపో. చెప్పుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి అంటారు.
దీంతో ఇప్పుడు కాదు.. మళ్లీ నెల రోజుల తర్వాత వస్తా. అప్పుడు అమ్మను కూడా తీసుకొస్తా అంటుంది. ఆ తర్వాత సామ్రాట్ ను చూసి తులసి భర్త సామ్రాట్ అని అనుకుంటారు. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు మీ భర్త అంటారు.
పిల్లలు ఎంత మంది అని అడుగుతారు. దీంతో ఏం చెప్పాలో తెలియదు. ఆలస్యం అయింది. ఇంకోసారి వస్తాం అని చెప్పి కారు ఎక్కుతారు. వాళ్లు అనుకున్నది నేను కాదు అని చెప్పినప్పుడు నా భర్త గురించి విడాకుల గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటుంది.
అందుకే నా కథ చెప్పి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు అంటుంది తులసి. ఆ తర్వాత తులసి.. పరందామయ్య, అనసూయకు ఫోన్ చేస్తే.. లాస్య గురించి అన్ని విషయాలు చెబుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.