Home » Entertainment » Intinti Gruhalakshmi 17 Jan 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : లాస్య, వసంత మధ్య గొడవ.. వసంతను ఇంట్లో నుంచి పంపించిన తులసి.. ఇంట్లో చిచ్చులేపిన లాస్య.. శృతి, ప్రేమ్ పై నందు సీరియస్

Authored By
Varun G
The Telugu News | Published on: January 17, 2022, 10:00 am
Advertisement

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 531 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్యతో తనను వీళ్లు టార్చర్ పెడుతున్నారని చెబుతుంది వసంత. నేను ఇప్పుడే పని వదిలేసి వెళ్తాను. నేను పేదదాన్నే కావచ్చు.. కానీ.. ఇలా మాటలు పడలేను అంటుంది వసంత. నన్ను మీ అత్తగారు, ఆవిడ మాజీ కోడలు నన్ను టార్చర్ పెడుతున్నారు అంటూ చెబుతుంది వసంత. ఏంటి తులసి.. పనిమనిషిని కూడా వదలవా? నా పనిమనిషిని విసిగించి తరిమేయాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో ప్రతి వాళ్లు నన్ను శత్రువుగా చూస్తున్నారు. నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు అంటుంది తులసి. నేను కాదు.. నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు అని చెబుతుంది లాస్య.

Advertisement

intinti gruhalakshmi 17 jan 2022 full episode

ఏ సమస్య అయినా దానికి మూలకారణం మాత్రం తులసి. చాలా తెలివి అయిన దానిలా గొప్పగా కనిపించాలని నటిస్తావు. నందుకు దగ్గరవ్వాలని చూస్తున్నావు అంటూ లాస్య.. తులసిపై సీరియస్ అవుతుంది. ఈ ఇంట్లో రాములమ్మకు ఎంత గౌరవం ఇస్తామో.. వసంతకు కూడా అంతే గౌరవం ఇస్తాం అంటుంది తులసి. అత్తయ్య నీతో ఏం తప్పు మాట్లాడిందో చెప్పు అని అడుగుతుంది తులసి. దీంతో చెప్పలేకపోతుంది వసంత. తెల్లారినా నట్టింట్లో పడుకుంటే లేపడం తప్పా. వాషింగ్ పౌడర్ వృధా చేయొద్దు అని చెప్పడం తప్పా అంటుంది తులసి. అత్తయ్య మీరు ముందు తులసిని లోపలికి తీసుకెళ్లండి అంటుంది లాస్య. ముందు నువ్వు నీ పనిమనిషిని లోపలికి తీసుకెళ్లు.. అంటుంది అనసూయ.

Advertisement

నా ముఖం నీకు నచ్చదు. నేను ఈ ఇంట్లో ఉండటం నీకు నచ్చదు. నందుతో నేను ఉండటం నీకు నచ్చదు.. అంటుంది లాస్య. ఇక చాలు లాస్య ఆపు అంటాడు నందు. నీకు పనిమనిషిని తీసుకొచ్చినప్పుడే నేను చెప్పాను. పరాయి మనిషిని ఈ ఇంట్లో ఉంచుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం ఉండదు అని చెప్పాను కదా.

తనను నువ్వే తీసుకొచ్చావు. తన ప్రవర్తన కూడా నీదే బాధ్యత. తన పిచ్చి వేషాలన్నీ రోజంతా మా వాళ్లు భరించాల్సి ఉంటుంది. ఇందులో తప్పు  వసంతదో.. అమ్మదో.. తులసిదో కాదు.. నీది అంటాడు నందు. దీంతో లాస్య షాక్ అవుతుంది. మీ వాళ్లకు శత్రువును అయ్యాను. నీకు కూడా శత్రువును అయ్యానా నందు అంటుంది లాస్య.

Advertisement

అంతేలే నేను ఒంటరి దాన్ని. నాకు ఎవరూ లేరు కదా అంటుంది లాస్య. దీంతో వసంత నువ్వు లోపలికి వెళ్లు అంటాడు నందు. చూడు లాస్య.. బయటి వాళ్ల ముందు ఇలా ఇంటి విషయాల్లో గొడవ పడటం పద్ధతా. మా అమ్మానాన్నలకు నువ్వు విలువ ఇవ్వడం లేదు. దీంతో తను కూడా ఇవ్వడం లేదు అంటాడు నందు.

నువ్వు అందరితో గొడవ పడటం చూసి తను కూడా పడుతోంది. తను వినకపోయినా పర్వాలేదు కానీ.. ఒక పరాయిమనిషి ఈ ఇంట్లో ఉంటుంటే.. ఆ మనిషి బాధ్యత ఎవరైనా ఒకరు తీసుకోవాలి కదా. మేము తీసుకోలేకపోతున్నాం.. నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : అత్తయ్యతో అమర్యాదగా ప్రవర్తిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తా.. అని లాస్యకు తులసి వార్నింగ్

అత్తయ్యతో అమర్యాదగా ప్రవర్తిస్తే నేను ఊరుకోను. మెడ పట్టి బయట గెంటేస్తా అంటుంది తులసి. పనిమనిషి అయినా పనిమనిషిని పెట్టుకున్న వాళ్లు అయినా సరే.. గెంటేయడం నాకు పెద్ద పని కాదు అంటూ లాస్యకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది తులసి.

ఈ ఇంట్లో బయట వాళ్లు ఉన్నది నువ్వే తులసి.. అంటుంది లాస్య. గొడవలు పెట్టుకోవడానికి నువ్వు చాలు.. ఇంకెవరూ అవసరం లేదు.. అంటుంది. అందరితో పాటు నేను కూడా పనిమనిషిగా మారాలా… అదేనా మీ కోరిక అని అడుగుతుంది లాస్య.

Advertisement

అవును.. అదే మా కోరిక. ఈ ఇంట్లో మగాడు కూరగాయలు తీసుకొస్తే అతడు పనోడు అవుతాడా? నీ భర్తకు నువ్వు వండి పెడితే నువ్వు పనిమనిషివి అవుతావా? ఈరోజు నుంచి నువ్వే నాకు వండి పెట్టాలి. టీ, కాఫీ, అన్నీ నువ్వే చేయాలి. తులసే కాదు.. నేను కూడా ఆ పనిమనిషిని తీసేయాలనుకుంటున్నాను అంటాడు నందు.

ఆ తర్వాత వసంత వచ్చి మీరేంది తీసేది.. నేనే వెళ్లిపోతాను అంటుంది వసంత. నా జీతం నాకు ఇచ్చేయండి అంటుంది. రెండు రోజులు చేసి నెల రోజుల జీతం అడుగుతున్నావా అంటుంది లాస్య. ఆ తర్వాత వసంత కూడా లాస్యతో లొల్లి పెట్టుకుంటుంది.

నందు.. తన నెల జీతం ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు నందు. దీంతో అందరికీ థాంక్స్ చెప్పి వసంత ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందు వచ్చి అమ్మ.. జరిగిన దానికి నన్ను క్షమించు అంటాడు నందు. పర్వాలేదురా.. ఇందులో నీ తప్పు ఏమున్నదని అంటుంది అనసూయ.

వసంత ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు బ్యాగ్ సర్దుకోవడానికి వెళ్తుంది. తులసి వచ్చి తనకు కొన్ని మంచి మాటలు చెబుతుంది. అయిపోయిందేదో అయిపోయింది. ఇక ముందు నువ్వు ఏ ఇంట్లో పని చేస్తావో అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించు.. అప్పుడు నిన్ను అందరూ వారెవ్వా వసంత అంటారు అంటుంది తులసి.

Advertisement

ఇంకెప్పుడూ పనికి పిలవరని తెలుసు. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నన్ను పిలవండి.. అని చెప్పి ఇచ్చిన జీతం కా వెనక్కి ఇచ్చేస్తుంది వసంత. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను.. నీకు లడ్డూలు ఇష్టం అని.. తీసుకో అని చెప్పి లడ్డులు ఇస్తుంది తులసి.

ఆ తర్వాత వసంత ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లాస్య, తులసి మధ్య మళ్లీ గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు.. అని చెప్పి వసంత ఇచ్చిన డబ్బులను తిరిగి లాస్యకు ఇచ్చేసి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి