Intinti Gruhalakshmi 17 Nov Today Episode : తులసిపై ప్రేమ పెంచుకున్న నందు.. పెళ్లి చేసుకుంటావా లేదా అని నందును నిలదీసిన లాస్య

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్, 2021, బుధవారం ఎపిసోడ్ 479 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయ తన తప్పును తెలుసుకుంది. తులసిని ఇన్నేళ్లూ ద్వేషించుకున్నందుకు చాలా బాధపడుతుంది. తులసి పాటల పోటీలో గెలుచుకున్న మెడల్ ను తను దాచుకుంటుంది. ఆ మెడల్, ఫోటోను చూసి తనతో మాట్లాడుతుంది అనసూయ. అత్తగా నువ్వు నన్ను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నావు. నీ మంచి మనసు ముందు నేను ఓడిపోయాను తులసి. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉంటే నీకు క్షమాపణ చెప్పాలని ఉంది.. అని అనుకుంటుంది అనసూయ.

intinti gruhalakshmi 17 november 2021 full episode

వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది అనసూయ. అత్తయ్య.. మీరేలా ఫోన్ చేసింది. నమ్మలేకపోతున్నాను అంటుంది. పోగొట్టుకున్నదేదో దొరికినంత ఆనందంగా ఉంది. ఎలా ఉన్నారు. కాలునొప్పి తగ్గిందా అంటుంది తులసి. దీంతో అనసూయకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. నోటి మాట రాదు. మేము రేపు పొద్దున బయలుదేరుతున్నాం. వచ్చేస్తాం అంటుంది తులసి. ఇంతలో తులసికి తలనొప్పి వస్తుంది. మీ అబ్బాయి బయటికి వెళ్లారు.. అంటుంది. నేను ఫోన్ చేసింది నందు కోసం కాదమ్మా.. నీకోసమే తులసి అంటుంది. దీంతో తులసికి సంతోషం వేస్తుంది. నాకు కళ్లు తిరుగుతున్నాయి అంటుంది. కిందపడి స్పృహ తప్పిపోతుంది.

అనసూయ ఏడ్వడం చూసి.. ఏమైంది అని అందరూ అక్కడికి వస్తారు.. దీంతో తులసి కళ్లు తిరిగి పడిపోయిందని చెబుతుంది అనసూయ. నాకేం అర్థం కావడం లేదు. నాకేదో భయంగా ఉంది అంటుంది. ఇవన్నీ లాస్య వింటుంది. అమ్మా తులసి.. నేను మారిపోయానని నీకు క్షమాపణ చెప్పుకుందామనుకున్నా. ఇంతలో నీకు ఎంత కష్టం వచ్చింది తల్లీ.. అంటుంది.

ఈ వయసులో కళ్లు తిరిగిపడిపోవడం ఏంటి లాస్య అంటుంది భాగ్య. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో నందు డోర్ తీసి లోపలికి వస్తాడు. చూస్తే తులసి కళ్లు తిరిగి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే డాక్టర్ ను పిలిపిస్తాడు నందు. డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా. మీరు ఈవిడకు ఏమవుతారు అని అడుగుతుంది డాక్టర్.

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : తులసికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్.. నేను తన భర్తను అని చెప్పిన నందు

నేను తన భర్తను అని అంటాడు. తనకు ఓవర్ స్ట్రెస్ వచ్చినట్టుంది. రేపు ఒకసారి ఆసుపత్రికి తీసుకురండి. చెకప్ చేద్దాం అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. మరోవైపు లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. ప్రేమ్, అభి, శృతి.. అందరూ టెన్షన్ పడుతుంటారు. ప్రేమ్ ఎవరికో ఫోన్ చేస్తుంటాడు కానీ అస్సలు కలవదు.

నందుకు ఫోన్ చేసినా.. నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి నాన్నా ఫోన్ లిఫ్ట్ చేయవు. అసలు అమ్మకు ఎలా ఉంది అంటే.. డాక్టర్ వచ్చి వెళ్లారు. ఏం ప్రాబ్లమ్ లేదు కదా అంటాడు. అభి కూడా మాట్లాడుతాడు. లేవగానే నేను తులసితో ఫోన్ చేయిస్తాను అని చెప్పి కట్ చేస్తాడు నందు.

నందు, తులసి గురించి తెగ టెన్షన్ పడుతుంది లాస్య. భాగ్య వచ్చి.. వాళ్లు రాగానే నీ పెళ్లి గురించి మాట్లాడుతావా అంటుంది భాగ్య. ఈరోజే వస్తారనుకున్నా కానీ.. తులసి వల్ల రాలేకపోయారు అంటుంది. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తావు. తులసితోనే ఉంటా అంటే నువ్వు వేరే దారి చూసుకుంటావా అంటుంది భాగ్య. దీంతో భాగ్య చెంప చెళ్లుమనిపిస్తుంది.

నందు, తులసి.. తెల్లారే ఇంటికి రాగానే.. నా విషయం వెంటనే తేల్చు అంటూ అందరి ముందే కడిగేస్తుంది లాస్య. నా పరిస్థితి ఏంటి.. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? అని ప్రశ్నిస్తుంది. దీంతో నందుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

55 minutes ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

2 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

3 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

4 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

5 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

6 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

7 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

8 hours ago