Intinti Gruhalakshmi 18 April Today Episode : గాయత్రి ఇచ్చిన కీస్ తీసుకున్న అభి.. ఈ విషయం తెలిసి అంకిత షాకింగ్ నిర్ణయం.. తులసికి మరో షాక్

Intinti Gruhalakshmi 18 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 609 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు మీ అమ్మ దగ్గర ఉండక్కర్లేదు.. నా దగ్గర ఉండక్కర్లేదు. హ్యాపీగా చిలకాగోరింకల్లా ఆ ఫ్లాట్ లో ఉండండి. నేను మీకు దూరంగా ఉంటాను. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. అంతే కాదు అభి.. మీ ఇద్దరి కోసం నేను చాలా ప్లాన్ చేశాను. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తాను. సొంతంగా హాస్పిటల్ కూడా కట్టిస్తాను. నన్ను నమ్ము అభి అంటుంది గాయత్రి. నాకు తెలుసు.. అంకిత ఈ ప్రపోజల్ కు ఒప్పుకోదు. తను అడ్డు పడుతుంది అంటుంది గాయత్రి. దీంతో అంకితకు ఇష్టం లేని పని నేను చేయను అంటాడు అభి.

intinti gruhalakshmi 18 april 2022 full episode

నాకు నా బిడ్డ మీద ఎంత ప్రేమో.. నీకు నీ తల్లి మీద అంత ప్రేమ. కానీ.. ఈ బంధాలు నీకు ప్రేమను పంచిస్తాయేమో కానీ.. ఎదగడానికి ఉపయోగపడవు అంటుంది. ఆలోచించు.. ఈ కీస్ నీ దగ్గర ఉంటే.. నేను చెప్పిన విషయం గురించి నువ్వు ఓ క్లారిటీ తెచ్చుకోవచ్చు. నీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి అంటుంది గాయత్రి. నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయం అంకితకు చెప్పకు అడ్డుపడుతుంది అంటుంది గాయత్రి. మామ్ మాట దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నాకు ఎందుకు ఈ అగ్ని పరీక్ష. నన్ను దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు అభి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి ఆంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి.

ఇంతలో అభి ఇంటికి వస్తాడు. జేబులో నుంచి కర్చీఫ్ తీస్తుండగా గాయత్రి ఇచ్చిన కీస్ కిందపడతాయి. ఆ కీస్ ను చూస్తుంది అంకిత. నాకు చెప్పకుండా మా అమ్మను ఎందుకు కలిశావు అభి అంటుంది అంకిత. దీంతో తనే కలవమన్నారు అంటాడు అభి.

ఆంటి నీకు చెప్పకుండా రమ్మన్నారు అంటాడు అభి. నా మనసులో ఏం ఉందో కూడా నీకు తెలుసు. అయినా కూడా నువ్వు వెళ్లావంటే ఏమనుకోవాలి అంటుంది అంకిత. ఇంటికొచ్చి భయపెట్టింది.. బెదిరించింది.. కుదరకపోయేసరికి.. నిన్ను పిలిచిందా అని అడుగుతుంది.

ఇద్దరూ కాసేపు గొడవ పెట్టుకుంటారు. వీళ్ల గొడవను తులసి దూరం నుంచి వింటుంది. మా అమ్మ మాట వినొద్దు అని అభికి సలహా ఇస్తుంది అంకిత. కానీ.. అభి వినడు. నీ ఉద్దేశం ఏంటి.. ఇంట్లో నుంచి వెళ్లిపోదామనా అంటుంది అంకిత. దీంతో మా అమ్మ నాకు ఒక్కసారి కాదు… రెండు సార్లు జన్మనిచ్చింది.. అంటాడు.

Intinti Gruhalakshmi 18 April Today Episode : లిరిక్స్ రాసేందుకు ఇంటి బయట కూర్చున్న ప్రేమ్

ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకో. నేను మాత్రం ఆంటీని వదిలి ఎక్కడికీ వెళ్లేది లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత. మరోవైపు లిరిక్స్ రాసేందుకు ఇంటి బయట కూర్చొని తెగ ఆలోచిస్తుంటాడు ప్రేమ్. కానీ.. తనకు లిరిక్స్ తట్టవు.

ఇంతంలో శృతి అక్కడికి వెళ్తుంది. ఏం రాస్తున్నావు అని అడుగుతుంది. లవ్ లెటర్ రాస్తున్నా అని అంటాడు ప్రేమ్. దీంతో నాకోసమా అంటుంది. కాదు.. నీకు ఎవరు రాస్తారు. పెళ్లానికి ఎవ్వరు లవ్ లెటర్ రాస్తారు. మా ఆఫీసులో ఒక అమ్మాయి నచ్చింది. తనకోసమే రాస్తున్నా అంటాడు.

దీంతో తనకు కోపం వస్తుంది. ఆ తర్వాత అసలు విషయం చెబుతాడు ప్రేమ్. కాన్సెప్ట్ చేప్పడంతో శృతి పెళ్లి కూతురు.. అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెబుతుంది శృతి. అంత భయంలోనూ ధైర్యం కోసం అమ్మాయి ఆ అపరిచితుడి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది అంటుంది శృతి.

దీంతో ప్రేమ్ కు పాట ఎలా రాయాలో అర్థం అవుతుంది. దీంతో చకచకా రాసేస్తాడు. ఆ తర్వాత తులసి ఒంటరిగా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది. ఏమైంది మామ్ అంటుంది. అమ్మ ప్రేమ బిడ్డకు పాలు ఇచ్చి పెంచడం వరకే అంటుంది తులసి.

నడక నేర్పించి సరైన దారి చూపించేవరకే అంటుంది తులసి. తల్లిబిడ్డల బంధానికి అర్థం లేదా మామ్ అంటుంది దివ్య. ఆ తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

2 hours ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

3 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

5 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

7 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

9 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

11 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

12 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

13 hours ago