
intinti gruhalakshmi 18 february 2022 full episode
Intinti Gruhalakshmi 18 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 559 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీసోళ్లను చూసి షాక్ అయి ఓ ఆటోలో దూరుతాడు అభి. దీంతో ఆటో డ్రైవర్ తనను ఆటో దిగమంటాడు. కాసేపు ఉండండి అని బతిమిలాడుతాడు. ఇంతలో పోలీస్ జీప్ వెళ్లిపోతుంది. దీంతో ఆటో దిగుతాడు. పోలీసులను చూసి భయపడి ఆటో ఎక్కావా. ఏం చేశావు.. రేప్ చేశావా.. మర్డరా.. చూస్తే గొప్పింటి పిల్లోడిలా ఉన్నావు అంటాడు. అన్న.. ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తావా అని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో ఇవ్వను అంటాడు. డబ్బులు ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని తులసికి ఫోన్ చేస్తాడు. తులసితో మాట్లాడుతాడు. నేను ఏ తప్పు చేయలేదంటాడు.
intinti gruhalakshmi 18 february 2022 full episode
ఇంటికి రావాలని ఉంది.. నిన్ను చూడాలని ఉంది. నీ మాటలు విననందుకు నన్ను క్షమించు మామ్ అంటాడు అభి. అవన్నీ సరే.. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడుగుతుంది తులసి. తను ఎక్కడున్నాడో చెప్పబోతాడు. ఇంతలో పోలీస్ వ్యాన్ వస్తుంటుంది. దీంతో ఫోన్ కట్ చేసి ఆటో డ్రైవర్ కు ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోతాడు అభి. మరోవైపు.. అభి గురించి నందు ఆలోచిస్తూ ఉంటాడు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. ఈ ఇంట్లో వాళ్లకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదు నందు అంటుంది లాస్య. తులసి వల్లే కదా అభి ఇలా తయారయ్యాడన్నావు అప్పుడే మరిచిపోయావా అంటుంది లాస్య. ఏంటి నోరు జారాను అంటావా.. అంటుంది. అభి తప్పు చేశాడు అంటాడు నందు. అవును మర్డర్ చేయడం ఏంటి అంటుంది లాస్య. ప్రతిసారి మర్డర్ అని అనకు లాస్య. వాడి ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు అంటాడు నందు. కానీ.. చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా. వాడు చస్తే మర్డర్ అనే అంటారు అంటుంది లాస్య.
మనం అభిని కాపాడుకోవాలంటే.. అభి ఫ్రెండ్ చావకుండా కాపాడుకోవాలి అంటాడు అభి. వచ్చే శాలరీ మొత్తం తీసుకెళ్లి తులసి చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు అభి ఫ్రెండ్ ను ఎలా కాపాడుతావు అంటుంది లాస్య. ఓవైపు శశికళ అప్పు.. మరో వైపు అభి సమస్య.. రెండూ రెండే.. ఏం జరుగుతుందో.. ఎలా బయటపడతామో అని అనుకుంటాడు నందు.
మరోవైపు అభి.. రోడ్డు మీద పిచ్చోడిలా పరిగెడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో వాళ్లు అందరూ తలో దిక్కున కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే ఉదయం అవుతుంది. తులసి ఇంటి బయటే నిద్రపోతూ ఉంటుంది. శృతి లేచి తులసిని చూసి షాక్ అవుతుంది.
తన దగ్గరికి వెళ్లి ఆంటి.. అంటుంది. అభి..అభి వచ్చాడా.. మాట్లాడారా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆంటి.. అభి రాలేదు అంటుంది శృతి. నిద్రపోయాను కానీ.. రాత్రంతా వాడే కలలోకి వచ్చాడు. వాడి మాటలే గుర్తొస్తున్నాయి. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తిన్నాడో లేదో అంటుంది తులసి.
ఈ అమ్మ మాట విని ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఏం చేయాలో.. వాడిని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు.. అంటుంది తులసి. ఒకపని చేస్తా.. రాత్రి ఫోన్ చేసిన నెంబర్ కు ఫోన్ చేస్తా అని వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తుంది తులసి.
రాత్రి ఈ ఫోన్ నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు అని అడుగుతుంది. రాత్రంతా నా ఆటోలోనే పడుకున్నాడు. ఇప్పుడే వెళ్లిపోయాడు అని చెబుతాడు. అశోక్ నగర్ ప్రాంతంలో వెతికితే దొరకొచ్చు అంటాడు ఆటోడ్రైవర్. దీంతో అభిని వెతకడానికి వెళ్తుంది తులసి.
మరోవైపు అభి కేసును ఎస్ఐ చాలెంజింగ్ గా తీసుకుంటాడు. అభిని పట్టుకునేందుకు వెతకడం ప్రారంభిస్తాడు. మరోవైపు అభి, లాస్య.. ఇద్దరూ ఆఫీసులకు వెళ్తుంటే.. ఏరా నందు.. వాడు నీ కొడుకు కాదా.. అభి గురించి పట్టించుకోవా అని అంటాడు పరందామయ్య.
దీంతో నాకు అభిని కాపాడాలని ఉంది. అందుకే.. పోలీసులు అరెస్ట్ చేస్తే.. నా కొడుకును కాపాడటానికి తెలిసిన వారితో కూడా మాట్లాడాను.. అని చెప్పి బయటికి వస్తాడు అభి. దీంతో లాస్యకు నచ్చదు. నందు ఏంటో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు అని అనుకుంటుంది లాస్య.
మరోవైపు అభిని వెతుకుతూ ఉంటుంది తులసి. ఇంతలో తనకు అభి కనిపిస్తాడు. అభి అని పిలుస్తుంది. వెంటనే అభి వెళ్లి తనను హత్తుకుంటాడు. అయ్యో అభి ఏంటి నాన్నా ఇది అంటుంది. ఇంతలోనే పోలీసులు అక్కడికి వస్తాడు. దీంతో తన తల్లిని నెట్టేసి అభి అక్కడి నుంచి పరిగెత్తబోతుంటాడు.
పారిపో.. నువ్వు వచ్చేదాకా నీ అమ్మ లాకప్ లోనే ఉంటది అంటాడు పోలీస్. నువ్వు ఒక్కదానివే వచ్చావు నీ మొగుడు ఏడి అని అడుగుతాడు పోలీస్. దీంతో నాకు భర్త లేడు అంటుంది తులసి. మొగుడు లేడంటున్నావు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. కనీసం ఎవడికి పుట్టాడో అదైనా తెలుసా అని తులసిని ప్రశ్నిస్తాడు పోలీస్.
దీంతో అభికి కోపం వస్తుంది. వెళ్లి ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. నా ఈగోనే టచ్ చేశావు. నీ సమాధికి నువ్వే పునాది రాయి వేసుకున్నావు అని అభిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.