Karthika Deepam 18 Oct Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం కాదు. కార్తీక దీపం 18 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పేరుకు ఇంట్లో అందరూ ఉన్నారు కానీ.. ఇంట్లో గొడవలు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. ఓవైపు పిల్లలు, మరోవైపు పెద్దలు.. అసలు కార్తీక్ ఇంట్లో ప్రశాంతతే కరువయింది. జైలులో ఉండి కూడా మోనిత.. కార్తీక్ ఫ్యామిలీని వదలడం లేదు. ఇప్పటికే ప్రియమణి.. తన అస్త్రాన్ని హిమ మీద ప్రయోగించింది. అది సక్సెస్ అయింది. శౌర్య మీద ప్రయోగించేందుకు వెళ్లినా.. శౌర్య మాటలకు ప్రియమణే తగ్గాల్సి వచ్చింది.
ఇంట్లో ఎప్పుడూ మోనిత గురించే చర్చ. అసలు ప్రియమణిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అంటూ కార్తీక్ కూడా దీపను నిలదీస్తాడు. పిల్లలు కూడా అదే మాట అంటారు. మరోవైపు కార్తీక్.. హిమతో మాట్లాడేందుకు తెగ ప్రయత్నిస్తాడు. కానీ.. హిమ మాత్రం తనతో మాట్లాడదు. జ్వరం వచ్చినా కూడా తను మాత్రం అస్సలు తగ్గదు. కార్తీక్ మాట్లాడుతుండగానే.. శౌర్యతో కలిసి బయటికి వెళ్తుంది. నాకు నీతో మాట్లాడాలని లేదు అని ఖరాఖండిగా చెప్పేసి వెళ్లిపోతుంది హిమ.
మరోవైపు ఈ సమస్యలన్నింటికీ కారణం అయిన మోనితను కలిసేందుకు సౌందర్య.. జైలుకు వెళ్తుంది. అక్కడ జైలులో మోనితను కలిసేసరికి.. మోనిత షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య గారు మీరు వచ్చారు అంటూ హేళన చేయబోతుంది. నువ్వు ఏ పిలుపుతో పిలిచినా నాకు అవసరం లేదు. అసలు నేను పట్టించుకోను అని చెబుతుంది సౌందర్య. ఏంటి సడెన్ గా లేడీ హిట్లర్ వచ్చింది.. అని అనుకుంటుంది మోనిత.
లోపల భయపడుతూనే బయటికి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నావు. భయం నీ కళ్లలోనే కనిపిస్తుంది అంటుంది సౌందర్య. నీకంటూ ఓ స్థాయి లేదు. నువ్వే నీ స్థానాన్ని దిగజార్చుకున్నావు. పవిత్రమైన స్త్రీ గర్భాన్ని అతి నీచంగా ఉపయోగించుకొని మమ్మల్ని దెబ్బకొట్టావు. అసలు నీ మొహాన్నే మళ్లీ జీవితంలో చూడొద్దని అనుకున్నా.. అనగానే అరె నేనే కూడా అదే అనుకున్నాను ఆంటి.. ఒక బుల్లి మనవడిని కని మీ చేతుల్లో పెట్టేదాక అస్సలు మిమ్మల్ని చూడొద్దు అనుకున్నాను అంటుంది మోనిత.
ఇక్కడి నుంచే నా కార్యాచరణ మొదలు పెడుతున్నాను. నా పేపర్ ఇంటర్వ్యూ చూశారు కదా అని మోనిత అనేసరికి నువ్వు ఒక్క న్యూస్ పేపర్ మాత్రమే వాడుకున్నావు కానీ.. నేను అన్నీ వాడుకుంటాను. పేపర్, టీవీ, న్యూస్ చానెల్.. ఇలా అన్ని మీడియాలు వాడుకొని నీ భరతం పడతాను అని చెబుతుంది సౌందర్య. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అని సౌందర్య చెప్పేసరికి.. మోనిత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.