
intinti gruhalakshmi 20 december 2021 full episode
Intinti Gruhalakshmi 20 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 డిసెంబర్ 2021, సోమవారం 507 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ అబ్బాయి లాస్యను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాడేమో అనిపిస్తుంది. మీరు అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఆపుకోవాలని మీ అబ్బాయికి చెప్పండి అని అనసూయతో అంటుంది తులసి. అవును అవును.. కరెక్ట్ నువ్వు చెప్పింది.. నేను చూసుకుంటాను అంటుంది అనసూయ. ఇంతలో అనసూయకు మంచి ఐడియా వస్తుంది. లాస్యతో పెళ్లిని ఆపించి.. నీతో పెళ్లి జరిపించేందుకు నాకు మంచి ఐడియా వచ్చింది అని అనుకుంటుంది అనసూయ. అప్పుడు గోరింటాకు నేనే నీకు నా చేతులతో పెడుతా అని అనుకుంటుంది అనసూయ.
intinti gruhalakshmi 20 december 2021 full episode
మరోవైపు లాస్య.. నందుకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. నీకోసం వెడ్డింగ్ డ్రెస్ కొన్నా అంటుంది. అప్పుడే దివ్య వస్తుంది. రా దివ్య.. మీ నాన్న కోసం వెడ్డింగ్ డ్రెస్ తీసుకున్నాను. ఎలా ఉంది అని అడుగుతుంది. నువ్వే మీ నాన్నకు ఈ పెళ్లి డ్రెస్ ను సెట్ చేయాలి అంటుంది. దీంతో దివ్యకు చాలా కోపం వస్తుంది. ఇంతలో లాస్య.. పెళ్లి చీర, నగలను చెక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అంకిత వస్తుంది. రా అంకిత నీకు నిండు నూరేళ్లు. ఇప్పుడే నీకు కాల్ చేద్దామనుకున్నాను. నాకు ఈ శారీ బాగుంటుందా? నగలు బాగుంటాయా? అని అడుగుతుంది. దీంతో నీకు అప్పుడే ఏ శారీకి ఏ నగలు బాగుంటాయో అన్నీ డౌన్ లోడ్ చేసి పంపించాను ఆంటి అంటుంది. సరే.. పెళ్లి పనుల విషయం ఎంత వరకు వచ్చింది. నువ్వు పెళ్లికి వస్తున్నావు కదా అంటే.. నేను పెళ్లికి రావడం లేదు ఆంటి. నేనే కాదు.. మేము ఎవ్వరం తులసి ఆంటిని వదిలేసి రాము అంటుంది అంకిత. దీంతో షాక్ అవుతుంది లాస్య. అందరూ నన్ను వదిలేసి పెళ్లికి రావడం లేదా? మరి.. నా పెళ్లి చేసేదెవరు అని లాస్య అనుకుంటుంది. ఇంతలో భాగ్య వస్తుంది. నేను ఉన్నాను లాస్య అంటుంది. పిలవకపోయినా నువ్వు వచ్చినందుకు సంతోషం అంటుంది లాస్య.
మరోవైపు లాస్య పెళ్లి విషయమై మాట్లాడటానికి అనసూయ.. నందు దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా నువ్వు ముఖం మాడ్చుకొని ఉన్నావు. ఏం జరిగింది. నీ ముఖంలో పెళ్లి కొడుకు కలే లేదు. నవ్వే లేదు. అసలు.. నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా అని అడుగుతుంది అనసూయ.
నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమే అయితే.. ఏమాత్రం ఆలోచించకుండా.. లాస్య మెడలో తాళి కట్టు. లేదు నీ మనసులో కొంచెం అయినా ఆందోళన, అనుమానం ఉంది అంటే.. బాగా ఆలోచించు.. నీకు ఇప్పటికీ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంది అని అంటుంది అనసూయ.
మరోవైపు పెళ్లిమండపం సిద్ధం అవుతుంది. పెళ్లిమండపం మీద కూర్చొని అద్వైత కృష్ణ ఫ్లూట్ వాయిస్తుంటాడు. అది విని అందరూ బయటికి వస్తారు. లాస్య.. నీ పెళ్లి మండపం రెడీ అంటాడు కృష్ణ. దీంతో లాస్యకు చాలా సంతోషం వేస్తుంది. తులసి కూడా సంతోషిస్తుంది. కానీ.. మిగితా వాళ్లు అందరూ మూతి తిప్పుకుంటారు.
చెప్పు లాస్య.. నీ స్వప్ప లోకం ఎలా ఉంది అని అడుగుతాడు. వావ్ కృష్ణ.. సూపర్ గా ఉంది అంటుంది. టైమ్ తక్కువగా ఉండటంతో బెటర్ గా డిజైన్ చేయించాను అంటాడు కృష్ణ. నీ ఎగ్జయిట్ మెంట్ చూస్తుంటే నా కష్టం ఫలించింది అని అనుకుంటున్నా అంటాడు క్రిష్.
పెళ్లి మండపం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది అంటుంది భాగ్య. ఈమె ఎవరు అని అడుగుతాడు కృష్ణ. దీంతో తను నా తోటికోడలు అంటుంది తులసి. అందరి మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు డాక్టర్. ముఖ్యంగా తులసి గురించి ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు అని అంటుంది లాస్య. దీంతో ఎంతైనా నా పేషెంట్ కదా.. ఆమాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా అంటాడు కృష్ణ.
అయినా పెళ్లి రేపు కదా.. ఇప్పుడే ఎందుకు పెళ్లి మండపం వేయించారు అని అడుగుతుంది భాగ్య. పెళ్లి రేపే కానీ.. మా జాతకాల్లో ఏదో దోషం ఉందట. అందుకే పెళ్లిమండపంలో ఈరోజు దీపం వెలిగించాలని పంతులు గారు చెప్పారు అంటుంది లాస్య.
అత్తయ్య మండపంలో దీపం వెలిగిద్దాం రండి.. అంటుంది లాస్య. దీంతో అనసూయ అస్సలు రాదు. భాగ్య కూడా ఏదో అంటే భాగ్య మీద కూడా అరుస్తుంది అనసూయ. ఇంకా మనం ఇక్కడెందుకు వెళ్దాం పదండి అంటుంది అనసూయ. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. నందు మాత్రం ఉంటాడు. ఇంతలో నందు కూడా నేనూ వెళ్లి వస్తాను అంటాడు.
దీంతో లాస్య షాక్ అవుతుంది. మరోవైపు లాస్య, నందు పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. లాస్య మంగళ స్నానానికి రెడీ అవుతుంది. అందరు కుటుంబ సభ్యులను పిలుస్తుంది. ఇంతలో తులసి అక్కడ నుంచి వెళ్తుంటుంది. ఆంటి.. లాస్యకు మంగళస్నానం చేయిస్తున్నాం రండి అంటుంది.
నాకు లోపల వేరే పనులేవీ లేవు కానీ.. లాస్యకు మంగళస్నానం చేయించే ఆసక్తి నాకు లేదు అంటుంది తులసి. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. లాస్య ఒక్కతే తనకు తానే పసుపు రాసుకొని మంగళస్నానం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.