intinti gruhalakshmi 21 january 2022 full episode
Intinti Gruhalakshmi 21 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 535 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ పిల్లలను పెంచిన విధానం ఇదేనా. నీ పిల్లలను నా మీదికి ఉసికొల్పుతున్నావా అని తులసిపై సీరియస్ అవుతాడు నందు. ఒరేయ్ నందు.. ఎందుకురా అలా నిందలు వేస్తున్నావు అని అంటుంది. ఎవరు ఏమన్నారో చూశావు కదా. ప్రతి ఒక్కరికి లాస్యను ఎగతాళి చేయడం తమాషా అయిపోయింది అంటాడు నందు. నిజంగానే నేను అలా అనుకోవాలనుకుంటే లాస్య ఇప్పటి వరకు ఇక్కడ ఉండేదే కాదు. ఈ ఇంట్లో ఉండేదే కాదు. లాస్యను శత్రువుగా చిత్రీకరించడం వల్ల నాకొచ్చే లాభం ఏంటి. నేను మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి ఇంకొకరిని తక్కువ చూపించి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు పట్టలేదు. అలాంటి అవసరమే నాకు ఉంటే.. ఈరోజు ఈగతి నాకు పట్టేదే కాదు.. అంటుంది తులసి.
intinti gruhalakshmi 21 january 2022 full episode
కానీ.. తన మాటలను నందు పట్టించుకకోడు. నువ్వు ఒక భార్యగా గెలిచి ఉండొచ్చు.. ఒక కోడలుగా గెలిచి ఉండొచ్చు కానీ ఒక తల్లిగా నువ్వు ఓడిపోయావు. ఈ విషయం నీకూ తెలుసు. నువ్వు ఒప్పుకో అంటాడు నందు. కానీ.. నేను ఒప్పుకోను. తల్లిగా నేను నా పిల్లలకు 100 శాతం అందిస్తున్నాను. గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటున్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఇన్నాళ్లుగా నా జీవితంలో తల్లిగా మాత్రమే పరిపూర్ణమైన తృప్తిని పొందుతున్నాను.. అంటుంది తులసి. ప్రేమగా జోల పాట పాడినంత మాత్రాన నువ్వు తల్లివైపోవు. వాళ్లు అడిగింది కొనిచ్చినంత మాత్రాన.. నువ్వు తల్లివైపోవు. తల్లి బాధ్యత అంటే పిల్లలు దారితప్పకుండా చూసి మంచి వాళ్లుగా తీర్చిదిద్దడం అంటాడు నందు.
తల్లిగా నువ్వు నిలదీసేంత తప్పు తులసి ఏం చేసిందిరా అని నిలదీస్తుంది అనసూయ. దీంతో నీ పెద్ద కొడుకు అభి.. తులసికి తెలియకుండా ఎంత అప్పు చేశాడో తెలుసా? చివరకు తన పెళ్లాం మెడలోని నగలు కూడా తాకట్టు పెట్టాడు. చెప్పు తులసి.. నేను వేసింది నిందా నిజమా.. ఆ విషయం తెలిసి కూడా ఇంతవరకు వాడిని నువ్వు నిలదీయలేదు. కనీసం ఆ విషయం తండ్రిని అయిన నాకు చెప్పలేదు. ఇదేనా పిల్లలను పెంచడం అంటే.. అని నిలదీస్తాడు నందు.
ఇక నీ రెండో కొడుకు ప్రేమ్.. తండ్రికే మాటకు మాట సమాధానం చెప్పేంత గొప్పగా పెంచావు. వీడికి నీ వెనుకే తిరుగుతూ నీ భజన చేయడం తప్ప.. లైఫ్ లో ఏం చేయాలి అని ఆలోచించాడా అంటాడు నందు. మీరు అన్యాయం చేశారని నేను అమ్మకు అన్యాయం చేయలేను అంటాడు ప్రేమ్.
మీ అమ్మకు ఓపిక ఉన్నంత కాలం మీ అమ్మ చుట్టూ తిరుగుతావు. ఆ తర్వాత నీ బతుకు ఏంట్రా.. ఎదగాలి కదా. ఇదేనా తల్లిగా నువ్వు ప్రేమ్ లో కోరుకునేది. వాడి భవిష్యత్తు ఏంటో చూసుకోవద్దా.. అంటుంది. మరోవైపు దివ్య చదువు విషయం గురించి కూడా చెబుతాడు నందు.
ఇప్పుడు చూశావు కదా. మాట అన్నందుకు నా మీద ఎలా విరుచుకుపడుతున్నారో.. నీ గారాబం వల్లే ఇలా పిల్లలు పనికిరాకుండా అయ్యారు. ఇప్పుడు చెప్పు తులసి.. తల్లిగా నువ్వు ఓడిపోయావా లేదా.. ఒప్పుకో తులసి.. ఒప్పుకో అని బలవంత పెడతాడు నందు.
దీంతో.. తులసికి ఏం చేయాలో అర్థం కాదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. పొరపాటు చేస్తున్నారు నాన్న. లాస్య దృష్టిలో గొప్పగా కనిపించాలని అమ్మను తక్కువ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మీరే బాధపడతారు. పశ్చాతాపపడతారు.. అని అంటాడు ప్రేమ్.
నా పిల్లలు బాగుపడటం.. నా మీద ఆధారపడకుండా వాళ్ల బతుకు వాళ్లు బతకడం ముఖ్యం. నా గారాబంతో వాళ్లను చెడగొట్టుకోకూడదు. దేవుడు నాకు ఎక్కువ టైమ్ ఇవ్వలేదు. ఏం చేయాలనుకున్నా వెంటనే చేయాలి అని అనుకుంటుంది తులసి.
ఆ తర్వాత పరందామయ్య వచ్చి.. నందును నిలదీస్తాడు. లాస్యను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టి చేతగాక తులసి మీద నిందలు వేసి పారిపోయావు అంటాడు పరందామయ్య. పిల్లల మీద నీ పరువు తీయకూడదని తులసి నీ గురించి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది తులసి అంటాడు.
తల్లిగా తులసి ఓడిపోయింది అంటే.. తండ్రిగా నువ్వు ఓడిపోయినట్టేరా. పిల్లల ముందే నువ్వు ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇలాంటి తండ్రిని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలిరా అంటాడు పరందామయ్య. కేవలం లాస్యను సంతోషపెట్టి నీ అధికారం చూపించుకోవడానికి మాట్లాడటం కాదు… అంటాడు పరందామయ్య.
నీ పెద్ద కొడుకు కేసులో ఇరుక్కున్నప్పుడు ఆరాటపడి కాపాడుకుంది ఎవరు.. నువ్వా తులసా. నీ రెండో కొడుకు ప్రేమను గెలిపించింది ఎవరు. నీ కూతురును ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు ఈ కొడుకు ఏమయ్యాడు. ఎక్కడికి పోయాడు. ఇప్పుడు చెప్పు పిల్లల పట్ల బాధ్యత లేనిది ఎవరికి.. నీకా.. తులసికా అని నిలదీస్తాడు పరందామయ్య.
దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తులసి హాల్ లోకి వస్తుంది. అనసూయ, పరందామయ్య, శృతి, అంకిత ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏదో విషయంపై తులసి చిరాకు పడుతుంది. పండుగ గురించి నన్నే ఎందుకు అడుగుతున్నారు.. అంటూ చిరాకు పడుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు…
Chapati In TEA : కొందరికి టీలో కొన్ని వస్తువులని ముంచుకొని తినడం అలవాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…
Eating Raw Onion In Summers : మండే వాతావరణం ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి, శరీరాన్ని ప్రశాంతంగా,…
This website uses cookies.