Intinti Gruhalakshmi 21 Oct Today Episode : రాజ్యలక్ష్మికి షాకిచ్చిన దివ్య.. హనీని ఎత్తుకెళ్లేందుకు రౌడీలను పంపించిన లాస్య.. హనీని కిడ్నాప్ చేస్తారా? తులసి ఏం చేస్తుంది?

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 అక్టోబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1081 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ.. పరందామయ్య, అనసూయ ఇద్దరికీ ఒక కథ చెబుతుంది. ముగ్గురూ సరదాగా నవ్వుతూ ఉంటారు. వాళ్లను చూసిన తులసి.. ఎంత కష్టం అయినా నీ ముఖం మీద ఉండే చిరునవ్వు చెరగకుండా చూసుకుంటాను అని మనసులో అనుకుంటుంది తులసి. ఇంతలో నందు వస్తాడు. ఏం చూస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు. నీ మనసు ఎక్కడుంది అని ప్రశ్నిస్తాడు నందు. దీంతో ఇంతలో పరందామయ్య వచ్చి.. ఏంట్రా నందు. లోపలికి అడుగు పెట్టిందో లేదో ఏంట్రా నీ ప్రశ్నలు అంటాడు పరందామయ్య. సేఫ్టీ కోసం అంటూ ఇంటి చుట్టు సీసీ కెమెరాలు పెట్టించింది. మన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు తులసి గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేంటి అమ్మ అంటాడు నందు. తులసి నేను విజయవాడకు వెళ్తున్నాను అంటాడు నందు. దీంతో ఎందుకు అని అడుగుతుంది. నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు నీ గొంతులో ఆరాటం చూశాను. అలాంటి ఆరాటమే నీ పట్ల మాకు కూడా ఉంటుంది. కేఫీకి సంబంధించిన అర్జెంట్ మీటింగ్ కోసం ఈరోజు విజయవాడకు వెళ్లాలని నీకూ తెలుసు కదా.. మరిచిపోయావా? ఇలాంటి మీటింగ్ కు వెళ్లే ఒక్క రోజు ముందే నాకు జాగ్రత్తలు చెప్పేదానివి. కొద్ది రోజులుగా నీ మనసు నీలో లేదు. అది చెప్పడానికి ఇదే రుజువు అంటాడు నందు.

Advertisement

ఏదో హడావుడిలో పడి విజయవాడ మీటింగ్ సంగతి మరిచిపోయాను అంటుంది తులసి. మీరు జాగ్రత్తగా ఉండండి చాలు అంటుంది తులసి. దీంతో వాడికి నువ్వు జాగ్రత్తలు చెబుతున్నావేంటమ్మా అంటుంది అనసూయ. నువ్వు కాస్త వాడికి ఎదురు రా అమ్మ అంటే.. మీరే ఎదురు రండి అంటుంది తులసి. మరోవైపు విక్రమ్ గదిలో ఉండగా అతడి బెడ్ రూమ్ కు వెళ్లిన జాను.. ఏంటి గదిలో నుంచి బయటికి రావడం లేదు ఏమైంది అని అడుగుతుంది. దీంతో విక్రమ్ కి కోపం వస్తుంది. బావా మరదల్ల మధ్య సరసాలు ఉండాలి కానీ.. అలకలు ఏంటి అసహ్యంగా. ఈ టీషర్ట్ ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది జాను. ఇది వేసుకుంటే ఎంత ముద్దొస్తావో తెలుసా? వేసుకుంటావా? నన్ను వేయమంటావా? నిన్నే బావ అడిగేది అని అడుగుతుంది జాను. దూరంగా ఉండి మాట్లాడలేవా? అంటాడు విక్రమ్. ఏంటి బావ ఎలా మాట్లాడుతున్నావు అని అంటుంది జాను. దీంతో కాస్త జాగ్రత్తగా మాట్లాడు అంటాడు విక్రమ్. దీంతో ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు. మీ ఆవిడ చెప్పిందా అంటే.. దివ్య గురించి ఇంకోసారి ఇలా మాట్లాడితే అస్సలు బాగోదు అంటాడు విక్రమ్.

Advertisement

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : జానును కొప్పడ్డ విక్రమ్

నా జాతకంలో రెండో పెళ్లి వాడినే చేసుకుంటా అని రాసిపెట్టి ఉంది. అందుకే నీ వెంట పడుతున్నాను. కన్ఫమ్ గా నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెబుతుంది జాను. ఆ తర్వాత అంత స్వార్థం పనికిరాదు. బావ నీకొక్కడికేనా. మాకు కూడా కావాలి అంటుంది జాను. దీంతో అక్కడి నుంచి కోపంగా దివ్య వెళ్లిపోతుంది.

మరోవైపు హనీని పక్కనే పడుకో పెట్టుకొని పడుకుంటుంది తులసి. ఆంటీ పగటి పూట వచ్చే కలలు నిజం అవుతాయా అని అడుగుతుంది హనీ. దీంతో ఏం కల అంటే.. నేను పడుకొని ఉంటే ఎవరో దొంగలు వచ్చి నన్ను ఎత్తుకెళ్లినట్టుగా వచ్చింది అని అంటుంది. అలా ఏం కాదు. అవేం నిజం కాదు అంటే.. తాతయ్య నిజం అవుతాయి అని అన్నాడు కదా అంటుంది హనీ. దీంతో అలా ఏం కాదు నువ్వు పడుకో అంటుంది.

ఇంతలో లాస్య ఫోన్ చేస్తుంది. తులసి.. ఫ్లాష్ లో నాకు సూపర్ ఐడియా వచ్చింది అంటుంది. ఇంత వరకు నీ ఫ్యామిలీలో వాళ్లను, వీళ్లను అటాక్ చేస్తూ టైమ్ వేస్ట్ చేశాను అనిపిస్తోంది. నా టార్గెట్ హనీ కదా. డైరెక్ట్ గా హనీనే అటాక్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది లాస్య. నిన్నే అడిగేది మాట్లాడవేంటి.. ఎలా ఉంది ఐడియా అంటుంది లాస్య. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుకు అంటుంది తులసి.

నందు కూడా ఊర్లో లేడు కదా. ఈ రోజు నైట్ ముహూర్తం బాగుంది. మంచిదట. ఈరోజు ఏ పని చేసినా ఖచ్చితంగా జరుగుతుందట. ఈ రాత్రికి హనీని ఎత్తుకురావడానికి రౌడీలను పంపుతున్నాను. బుద్ధిగా వాళ్లకు మర్యాదలు చేసి హనీని అప్పగిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కాదూ.. కూడదు అని అన్నావనుకో ఆ రౌడీలు ఏం చేయడానికైనా వెనకాడరు. నువ్వు ఆ రౌడీలను ఆపలేవు. హైరానా పడకు. సరేనా అంటూ ఫోన్ పెట్టేస్తుంది లాస్య.

మరోవైపు రాజ్యలక్ష్మితో దివ్య మాట్లాడుతుంది. నిన్ను కోడలు పోస్ట్ నుంచి తీసేసి.. ఆ ప్లేస్ లో జానును  పెట్టబోతున్నాను. నీకు భయంగా లేదా అంటే భయం లేదు. నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు తరమలేకపోయారు. మా జాను మానవ బాంబు లాంటిది. ఏదైనా అనుకుంది అంటే సాధించి తీరుతుంది అంటుంది రాజ్యలక్ష్మి. మీ స్వార్థం కోసం అమాయకురాలని బలి చేస్తున్నారు. సొంత తమ్ముడికే అన్యాయం చేస్తున్నారు. అయ్యో అనిపించడం లేదా? అంటుంది దివ్య.

దీంతో జానును కోడలుగా చేసుకోవడం అన్యాయం చేయడం ఎలా అవుతుంది అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దీంతో ఈ ఆస్తి మొత్తాన్ని మీ కడుపున పుట్టిన సంజయ్ పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేయడం కదా మీ టార్గెట్. అలాంటప్పుడు జానును కోడలుగా చేసుకొని ఏం ఉద్దరిద్దామని అని అడుగుతుంది దివ్య. విక్రమ్ తో పాటు బికారిని చేస్తారా? కేవలం నా మీద కోపంతో ఆస్తిని కాజేయడానికి.. నేను ఎక్కడ అడ్డం వస్తానో అని నా ప్లేస్ లో జానును తీసుకొస్తున్నాను అంతే కదా అంటే.. నిన్ను, జానును ఒకే విధంగా ఎందుకు చూస్తాను. జాను నా మేనకోడలు అంటుంది రాజ్యలక్ష్మి.

నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. మొదటి రోజు నుంచి కూడా ఇష్టం లేదు. తప్పనిసరై భరిస్తున్నాను. విక్రమ్ ముందు బయటపడకూడదు కాబట్టి భరిస్తున్నాను. నా ఓపిక అయిపోయింది. ఇక నిన్ను ఏ మాత్రం భరించలేను. తట్టాబుట్టా సర్దుకునే రోజు దగ్గర పడింది అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో మీరే తట్టాబుట్టా సర్దుకునేలా చేస్తాను. మీరే నన్ను ఏం చేయలేకపోయారు. జాను ఏం చేస్తుంది. అనవసరంగా జాను మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. జానుకు మంచి సంబంధం చూడండి. ఇప్పటి నుంచే పిలవాల్సిన గెస్టుల లిస్టును రెడీ చేసుకోండి. మిగితా పనులు మేం చూసుకుంటాం.. అని చెబుతుంది దివ్య.

మరోవైపు హనీ కలలో విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఎవరూ రావద్దు.. నన్ను వదిలిపెట్టండి అంటూ భయపడుతుంది. ఎక్కువ ఆలోచించే టైమ్ లేదు. ప్రమాదం వెంటపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హనీని రక్షించుకోవాలి అని అనుకుంటుంది తులసి. బయట ఎలాంటి గొడవ అయినా సరే.. హనీకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎవరూ కూడా హనీ జోలికి రాకూడదు అని అనుకుంటుంది తులసి.

దీంతో హనీ పడుకున్న రూమ్స్ అన్నీ క్లోజ్ చేస్తుంది తులసి. బెడ్ రూమ్ లో తనను పడుకోబెట్టి తాళం వేస్తుంది. ఏమైందమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అని పరందామయ్య, అనసూయ అడుగుతారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు నాకు కోఆపరేట్ చేయాలి. సడెన్ గా భూకంపం రాబోతుంది అని తెలిస్తే ఏం చేస్తారు అని అడుగుతుంది తులసి.

ఇంకాసేపట్లో మన ఇంటి మీద అటాక్ జరగబోతోంది అని చెబుతుంది తులసి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పు అంటే… ఇది నేను తేల్చుకోవాల్సిన విషయం. పోలీసులు ఇక్కడికి రాకూడదు అంటుంది తులసి. వెంటనే నందుకు కాల్ చేయండి అంటే వద్దు అంటుంది తులసి. ఇంతలో రౌడీలు వస్తారు. అక్కడే ఇంటి ముందు కూర్చొని ఉంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Trump Modi Putin : ట్రంప్ పై ఉచ్చు బిగించిన మోడీ + పుతిన్.. World Game మొత్తం రాత్రికి రాత్రి మారిపోయింది..!

Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…

1 hour ago

India : భారత్ ని ఎవ్వడూ భయపెట్టలేడు .. కావాల్సిన చమురు మొత్తం కాళ్ళ దగ్గరకే వచ్చింది..!

India  : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…

2 hours ago

Trisha – Vijay : 3 వారాల్లో ఎన్నికలు అనగా విజయ్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన త్రిష..!

Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…

3 hours ago

CM Revanth Reddy : సాల్యూట్ CM రేవంత్..!

CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…

5 hours ago

Mobile Recharge : మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త ఇకపై ఆ రీఛార్జ్ తిప్పలు తప్పినట్లే..!

Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…

6 hours ago

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో డీఏ పెంపు ప్రకటన? 3 నెలల బకాయిలు కూడా!

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…

7 hours ago

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…

9 hours ago

Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…

12 hours ago

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…

13 hours ago

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…

14 hours ago

Pineapple Juice : వేసవిలో ఒక్క గ్లాసు పైనాపిల్ రసం తాగితే మీ శరీరంలో జరిగే వింతలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…

14 hours ago

Potatoes : వేసవిలో పొటాటో తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…

15 hours ago