Intinti Gruhalakshmi 22 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2022, శనివారం ఎపిసోడ్ 770 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు మా ఫ్యామిలీ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు నందు. దీంతో సామ్రాట్ వెళ్లిపోబోతాడు. దీంతో ఆగండి అంటుంది తులసి. మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది తులసి. దీంతో నీకోసమే అంటాడు సామ్రాట్. మరి.. మీరెందుకు వెళ్లిపోతున్నారు. మీరు అలా వెళ్లిపోతే నన్ను అవమానించినట్టే అంటుంది తులసి. ఇది నా ఇల్లు. మీ పెత్తనం ఏంటంటూ నందును కడిగిపారేస్తుంది తులసి. దీంతో చూశావా.. ఆస్తి ఇచ్చి ఎంత పని చేశారో.. మీ ముందే ఎలా చేస్తుందో చూశారు కదా అంటాడు నందు. మరోవైపు ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు నందు వెళ్దాం పదా అంటుంది లాస్య.
దీంతో నందు వెళ్లిపోబోతుండగా అనసూయ ఆపుతుంది. నీకు ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇస్తాను. నందు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు.. రావద్దని అంటే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అంటుంది అనసూయ. దీంతో అత్తయ్య.. నేను మీ అబ్బాయిని ఇక్కడికి రావద్దని నేను అనను. ఆయన ఎప్పుడైనా రావచ్చు. కానీ.. నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది తులసి. సామ్రాట్ గారు నా ఫ్రెండ్. ఆయన కూడా ఎప్పుడైనా ఈ ఇంటికి వస్తారు. అంతే కాదు.. రేపు మేము ఆఫీసు పని మీద వరంగల్ వెళ్తున్నాం. ఇద్దరం ఒకే కారులో వెళ్తున్నాం.. అని చెబుతుంది తులసి. సామ్రాట్ గారు మా వాళ్లు అంతే. వాళ్ల గురించి పట్టించుకోకండి. రేపు మీరు చెప్పిన టైమ్ కు రెడీగా ఉంటాను అంటుంది. తులసిలో వచ్చిన తెగింపు చూసి పరందామయ్య చాలా సంతోషిస్తాడు. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అనుకుంటాడు.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. అనసూయ.. తులసి మాటలకు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పరందామయ్య వస్తాడు. నాతో మాట్లాడవా అంటాడు. ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటావు చెప్పు అంటాడు పరందామయ్య. ఎప్పుడు మనకు చివరి క్షణం అవుతుందో తెలియదు.
ఉన్నప్పుడు నాతో మాట్లాడకపోతే.. ఆ తర్వాత మాట్లాడటానికి నేను ఉంటానో తెలియదు అంటాడు పరందామయ్య. దీంతో నాది కోపం కాదు.. మీ మీద కాదు. తులసి మాట వినడం లేదని బాధ అంటుంది అనసూయ. బిడ్డ లాంటి తులసి బాగు కోసం నేను ఆరాటపడటం తప్పా అంటుంది అనసూయ.
ఆరాటం తనను బాధపెట్టేలా ప్రవర్తించడం తప్పు అంటాడు పరందామయ్య. నేను అడిగింది ఒక్కటే. ఆ సామ్రాట్ కు దూరంగా ఉండమని. ఈ ఒక్క విషయం తను వినలేదా అంటుంది అనసూయ. మరోవైపు తులసి బాధ కూడా అదే. అన్నీ అత్తయ్య చెప్పినట్టే వింటున్నాను కదా. ఈ ఒక్క విషయంలో ఎందుకు నా మాట వినదు అని అనుకుంటుంది అంటాడు పరందామయ్య.
మరోవైపు తులసి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. సామాన్లు సర్దుకుంటుంది. ఇంతలో తులసికి సామ్రాట్ ఫోన్ చేసి సారీ తులసి గారు అంటాడు. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారీ నా వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటాడు సామ్రాట్. దీంతో ఈ ఇంట్లో సమస్యలకు కారణం మీరు కాదు నేను అంటుంది.
ఇలాంటివి అలవాటు చేసుకున్నాను.. మీరు కూడా అలవాటు చేసుకోండి అంటుంది. తర్వాత రేపు మనం వరంగల్ వెళ్లబోయే మీటింగ్ కు సంబంధించిన ఫైల్స్ గురించి చెబుదామని ఫోన్ చేశాను అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ దగ్గరికి బాబాయి వస్తాయి.
ఈరోజు నీకు నిద్రపడుతుందా అంటాడు. వెటకారమా అంటాడు. దీంతో రేపు వరంగల్ వెళ్లాలి కదా.. అంటాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా.. వాళ్ల కంపెనీలో ఏదో ఓపెనింగ్స్ ఉన్నాయట. రమ్మన్నాడు అని నందు.. లాస్యతో అంటాడు.
ఇప్పుడు కాదు కానీ.. రేపు వెళ్లు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాం పదా అంటుంది. దీంతో ఎందుకు నిన్ననే వెళ్లాం కదా. మళ్లీ ఇప్పుడు ఎందుకు అంటాడు నందు. నిన్న మీ అమ్మ నీకు సపోర్ట్ చేసింది. అంటే అత్తయ్య గారు మనవైపు ఉన్నారు.. అంటుంది లాస్య.
మరోవైపు తులసి రెడీ అవుతుంది. అనసూయకు చాలా కోపం వస్తుంటుంది. ఇంతలో అక్కడికి నందు, లాస్య వస్తారు. వీళ్లు మళ్లీ వచ్చారేంటి అని అనుకుంటుంది తులసి. మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ కారులో వరంగల్ వెళ్తారు. వచ్చేటప్పుడు జోరుగా వాన కురుస్తుంది.
వానలో ఎలా డ్రైవ్ చేయాలో సామ్రాట్ కు అర్థం కాదు. మరోవైపు ఇంట్లో తులసి కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.