Home » Entertainment » Intinti Gruhalakshmi 23 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 23 Dec Today Episode : పెళ్లి సమయానికి నందు మిస్సింగ్.. నందు కోసం కొట్టుకున్న లాస్య, తులసి.. ఇంతకీ నందు ఏమయ్యాడు?

Authored By
Varun G
The Telugu News | Published on: December 23, 2021, 12:20 pm
Advertisement

Intinti Gruhalakshmi 23 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 510 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకు ఎప్పుడూ నా గురించే ఆలోచనా.. నందు మాజీ భార్య గురించి కాదు.. ముందు నీ గురించి ఆలోచించుకో అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు నందు.. పెళ్లికొడుకుగా రెడీ అవుతాడు. కానీ.. దీర్ఘంగా దేనిగురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో నందుకు అర్థం కాదు. తులసే గుర్తుకు వస్తుంటుంది నందుకు. కానీ.. ఏదో ఒక నిర్ణయం అయితే పెళ్లికి ముందే తీసుకోవాలని అనుకుంటాడు నందు. తులసి కోసం వెయిట్ చేస్తాడు కృష్ణ. ఇంతలో తులసి వస్తుంది. సారీ అండి.. కొంచెం లేట్ అయింది అంటాడు. పర్లేదు.. నేనే మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే.. నందు, లాస్య పెళ్లి మండపం నేనే తయారు చేయించాను కదా అంటాడు అద్వైత కృష్ణ.

Advertisement

intinti gruhalakshmi 23 december 2021 full episode

మీకు నేను పేషెంట్ ను మాత్రమే. కానీ.. మీకు చాలామందితో అనుబంధం ఉంటుంది కదా అంటుంది. ఇవన్నీ చూసి మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు అంటాడు కృష్ణ. మా బంధం ఎప్పుడో తెగిపోయింది. లాస్య, నందు మధ్య ఎప్పుడో బంధం మొదలైంది. ఇది కేవలం ఒక కృతువు మాత్రమే. ఏది ఏమైనా.. మీకే నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నన్ను రిసార్ట్ నుంచి బయటికి పంపిస్తున్నందుకు అని చెబుతుంది తులసి. సరే.. ఇక మనం బయలుదేరుదామా అని అంటాడు కృష్ణ. అలాగే అంటుంది తులసి. అక్కడే ఉన్న కృష్ణుడి బొమ్మను చూసి దేవుడి దయవల్ల ఆయన ఈ పెళ్లికి వెనుకడుగు వేయకుండా ఉంటే చాలు.. అని అనుకుంటుంది తులసి. మరోవైపు లాస్య, నందు పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. పంతులు కూడా వస్తాడు. ఇంతలో పెళ్లి కూతురు లాస్య రెడీ అయి పెళ్లి మండపానికి వస్తుంది.

Advertisement

ఎలాఉన్నాను అని భాగ్యను అడుగుతుంది లాస్య. కుందనపు బొమ్మలా ఉన్నావు. పెళ్లికి కావాల్సిన సమాన్లు అన్నీ సిద్ధం. పెళ్లి కూతురు కూడా సిద్ధం. ఇక పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం అంటుంది భాగ్య, మరోవైపు ఇంట్లో వాళ్లు అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ముహూర్తానికి ఇంకో 10 నిమిషాలే సమయం ఉంది అంటాడు పంతులు. దీంతో నందు కోసం ఎదురు చూస్తుంటారు.

నేనే నందును పిలుచుకొస్తాను అని చెప్పి నందు అని గట్టిగా పిలుస్తుంది. నందు.. ముహూర్తం మించిపోతోంది.. తొందరగా రా అంటుంది లాస్య. కానీ.. నందు రాడు. అత్తయ్య.. నందును త్వరగా పంపించండి.. అంటే నేను పంపించాలా పళ్లు రాలిపోతాయి అని ఇంట్లో నుంచి అంటుంది అనసూయ.

Advertisement

Intinti Gruhalakshmi 23 Dec Today Episode : పెళ్లి ముహూర్తం సమయానికి కనిపించకుండా పోయిన నందు

ఇంతలో లాస్య.. నందు నందు అంటూ ఇంట్లోకి వెళ్తుంది. నందు అంటూ తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ.. నందు కనిపించడు. రూమ్ లో ఉండడు. డ్రెస్ వేసుకున్నాడు అని అనుకుంటుంది లాస్య. కానీ.. ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటుంది లాస్య.

నందు ఎక్కడికి వెళ్లాడు అత్తయ్య అని అడుగుతుంది. దీంతో నన్ను అడుగుతావేంటే మాకేం తెలుసు అంటుంది. నీకు కనిపించకపోతే.. ఫోన్ చేసుకో అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా.. నందు ఇంట్లో లేడు అంటే అర్థం కాదా.. అంటుంది అనసూయ. ఇంట్లోనే ఉన్నాడు నందు అంటుంది లాస్య.

నా కొడుకుకు, నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి అయ్యేదాకా ఇంట్లోకి అడుగు పెట్టావంటే అస్సలు మంచిగుండదు. వెళ్లు అంటూ ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది అనసూయ. దీంతో కోపంతో బయటికి వస్తుంది లాస్య. ఒక్కతే రావడం చూసి భాగ్య షాక్ అవుతుంది.

వెంటనే నందుకు ఫోన్ చేస్తుంది లాస్య. కానీ.. ఫోన్ ను లిఫ్ట్ చేయడు నందు. దీంతో లాస్యకు టెన్షన్ ఎక్కువవుతుంది. నందు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటుంది లాస్య. పోనీ.. తులసి దగ్గరికి వెళ్లి ఉంటాడా అని అనుకుంటుంది లాస్య. నీకో విషయం తెలుసా లాస్య. ఇక్కడ బావ గారు లేరు.. అక్కడ తులసి లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అని అంటుంది భాగ్య.

Advertisement

ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాస్య ఫోన్ ను నందు ఎత్తడు. దీంతో లాస్యకు మెంటల్ ఎక్కిపోతుంది. దివ్య బయటికి వచ్చి ఏం జరుగుతుందో చూస్తుంది. నిజమే నానమ్మ.. డాడీ ఈ రిసార్ట్ లో లేరు. డాడీకి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదట. తను టెన్షన్ పడుతుంది అని అంటుంది దివ్య.

నాన్న ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అంటాడు ప్రేమ్. డాడీ చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి.. ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అభి ఫోన్ చేస్తాడు. చాటుగా కిటికీ నుంచి చూస్తుంటుంది లాస్య. ఏమైంది.. నందు ఎక్కడికి వెళ్లాడో తెలిసిందా అని లాస్య మళ్లీ అడుగుతుంది. ప్లీజ్ నందు ఎక్కడున్నాడో చెప్పండి అని అడుగుతుంది.

నందు కనిపించకపోయే సరికి.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. దీంతో అందరికీ కోపం వస్తుంది. అరె నీకు తెలుగు అర్థం కాదా.. మాకు తెలియదు అంటే నీ గొడవేంటే అంటుంది అనసూయ. వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది లాస్య. నేను ఆసుపత్రికి వెళ్తున్నా అని చెబుతుంది తులసి.

నువ్వు ఇప్పుడే రాకపోతే.. నీ కుటుంబ సభ్యులందరి మీద పోలీస్ కేసు పెడతా అంటుంది. దీంతో తులసి వెంటనే అక్కడికి వెళ్లి.. పిలువు పోలీసులను అంటుంది. నీ నందు నీ వైపు లేడు. నా వైపు ఉన్నాడు అంటుంది. దీంతో షాక్ అవుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి