Home » Entertainment » Intinti Gruhalakshmi 24 May 2022 Today Episode
Entertainment

Intinti Gruhalakshmi 24 May Today Episode : తులసిని ఆదుకున్న సంజన.. జాక్ పాట్ కొట్టిన అభి, అంకిత.. 50 కోట్ల ఆస్తి సొంతం.. కానీ.. అంకిత షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: May 24, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 24 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 640 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య… అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. తులసి బోర్డును తీసుకెళ్లి అక్కడ తగిలిస్తుంది. ఆ తర్వాత పరందామయ్య ఒరేయ్ నందు.. తులసి సంగీత పాఠశాల పెట్టింది అని చెబుతాడు. ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే చెప్పు.. కమిషన్ ఇస్తాం అంటూ అనసూయ దెబ్బిపొడుస్తుంది. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు నందు, లాస్య. మరోవైపు అభితో అంకిత ఇంకా మాట్లాడదు. అభిని అస్సలు పట్టించుకోదు. నువ్వంటే నాకు ప్రేమ చచ్చిపోయింది. వైరాగ్యమే మిగిలింది అంటుంది అంకిత. నేను నీకు విలువ ఇస్తున్నాను అంకిత అంటాడు అభి. దీంతో నువ్వు విలువ ఇవ్వాల్సింది నాకు కాదు.. నా మనసుకు అంటుంది అంకిత. మరోవైపు తులసి.. అభికి ఫోన్ చేస్తుంది. అభి మాత్రం ఫోన్ చూసుకోడు. అంకిత వెళ్లి చూసి.. తులసి ఆంటి ఫోన్ చేస్తుందని చెబుతుంది అంకిత.

Advertisement

intinti gruhalakshmi 24 may 2022 today episode

నాకిప్పుడు మాట్లాడే మూడ్ లేదు.. నాకు చిరాకుగా ఉంది. తర్వాత మాట్లాడుతాను అంటాడు అభి. దీంతో అంకిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా అని అడుగుతుంది తులసి. ఆంటి నీతో మాట్లాడాలని ఆరాట పడుతుంది.. అవాయిడ్ చేయకు అంటుంది. దీంతో నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు అని చెప్పాను కదా. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేశావు అంటాడు అభి. దీంతో అంకితకు ఏం చెప్పాలో అర్థం కాదు. దీంతో ఇంతకుముందే హాస్పిటల్ నుంచి వచ్చాడు.. ప్రెష్ అప్ అవుతున్నాడు అని చెబుతుంది అంకిత. అవునా.. హాస్పిటల్ నుంచి అలసిపోయి ఉంటాడు. కంగారు ఏం లేదు.. ఓపిక ఉన్నప్పుడే వాడిని కాల్ చేయమని చెప్పు.. వాడిని ఇబ్బంది పెట్టకు. వాడు గుర్తొచ్చి.. వాడి గొంతు వినాలని ఫోన్ చేశాను అంతే.. అంటుంది తులసి. వాడి ఆరోగ్యం బాగానే ఉంది కదా. చూసుకోవడానికి ఈ అమ్మ పక్కన లేదు. కాస్త నువ్వే చూసుకోవాలి. పనిలో పడితే వాడి గురించి వాడే పట్టించుకోడు. అడిగానని చెప్పు. ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అంకిత.

Advertisement

అంతా వింటూ కూడా ఆంటీతో మాట్లాడాలనిపించడం లేదా అని అడుగుతుంది అంకిత. దీంతో ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో నేను అమ్మతో మాట్లాడలేను అంటాడు. ఇంతలో గాయత్రి వచ్చి అమ్మా అంకిత.. రేపు డాడీ యూఎస్ నుంచి వస్తున్నారు.. అని అంకితతో చెబుతుంది.

దీంతో అంకిత సంతోషిస్తుంది. కట్ చేస్తే తెల్లారుతుంది. తులసి సంజన ఇంటికి వెళ్లి సంగీతం నేర్పిస్తుంటుంది. ఇంతలో తనకు దివ్య ఫోన్ చేసి.. కాలేజీ ఫీజు ఎప్పుడు కడతారు అని అడుగుతున్నారు అని అంటుంది. దివ్య, తులసి మాట్లాడుకునే విషయాలను సంజన వింటుంది.

Advertisement

Intinti Gruhalakshmi 24 May Today Episode : తులసి టెన్షన్ పడటాన్ని గమనించిన సంజన

తర్వాత మళ్లీ మేడమ్ కూడా మాట్లాడుతుంది. మీకు ఇచ్చిన అడిషనల్ టైమ్ కూడా పూర్తయింది. కష్టం మేడమ్ అంటంది. ఒక్క రోజు టైమ్ ఇవ్వండి అంటుంది ప్రిన్సిపల్. దీంతో మీ మీద నమ్మకంతో చివరి అవకాశం ఇస్తున్నా. కట్టండి మేడమ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

తర్వాత.. సంజన.. తులసిని చూసి తను ఏదో టెన్షన్ లో ఉందని తెలుసుకొని ఏమైందని అడుగుతుంది. దీంతో అసలు విషయం చెబుతుంది తులసి. దీంతో వెంటనే 20 వేలు తెచ్చి ఇచ్చి ఫీజు కట్టండి అంటుంది. కానీ.. తులసి మొహమాటపడుతుంది.

దీంతో మా పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నారు కదా.. ఇది అడ్వాన్స్ గా ఉంచండి అంటుంది సంజన. దీంతో ఆ డబ్బు తీసుకొని థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే.. లాస్య.. లక్కీతో కలిసి గుడికి వస్తుంది. అంకిత తండ్రి కూడా యూఎస్ నుంచి డైరెక్టర్ గా గుడికి వస్తాడు.

లాస్య వచ్చిన గుడిలోనే ఉంటాడు. ఇంతలో అభి, అంకిత, గాయత్రి గుడికి రావడం చూస్తుంది లాస్య. ఏం జరుగుతోంది ఇక్కడ అని అనుకుంటుంది. ఇంతలో డాడీ అంటూ పరిగెత్తుకువెళ్లి తనను హత్తుకుంటుంది అంకిత. అదేంటి డాడ్.. గుడికి ఎందుకు రమ్మన్నారు అంటుంది.

Advertisement

మీ అందరికీ గుడ్ న్యూస్ అంటాడు. మన జీవితాలను మలుపు తిప్పే గుడ్ న్యూస్ అంటాడు. వారసత్వంగా మనకు రావాల్సిన ప్రాపర్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నాం కదా. ఆ కేసు ఇప్పుడు మనం కోర్టులో గెలిచాం. 50 కోట్ల ఆస్తి ఇప్పుడు నా బంగారు తల్లికి సొంతం కాబోతోంది అంటాడు.

వీళ్ల మాటలు అన్నీ లాస్య వింటుంది. లాస్య కంగ్రాట్స్ అంటాడు తన తండ్రి. నాకెందుకు కంగ్రాట్స్ డాడీ.. ఆస్తి కోసం కొట్లాడింది మీరు కదా.. కేసు గెలిచింది మీరు కదా అంటుంది. చూడు.. అంకిత కష్టపడింది నేనే అయినా.. సుఖపడాల్సింది మీరే. ఈ 50 కోట్లు మీ పేరు మీద రాయబోతున్నాను అంటాడు తన తండ్రి.

దీంతో నాకు ఈ ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు అంటుంది అంకిత. దీంతో మాకు మాత్రం ఎవరు ఉన్నారు అంటాడు. 50 కోట్లు అనేసరికి లాస్యకు మతిపోతుంది. అభి కూడా తెగ సంతోషిస్తాడు. కోర్టు ఆర్డర్స్ ను దేవుడి పాదాల దగ్గర పెట్టిన తర్వాత గాయత్రి.. అంకితకు ఇచ్చేస్తుంది.

అభి.. నువ్వు అంకిత కలిసి లైఫ్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంటాడు అంకిత తండ్రి. దీంతో సరే అంకుల్ అంటాడు అభి. వీళ్ల మాటలు అన్నీ వింటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిబాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి