intinti gruhalakshmi 24 november 2021 full episode
Intinti Gruhalakshmi 24 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 నవంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 485 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు బాబును దూరం ఉంచుతున్నందుకు లాస్య మీ మీద అరవాలి కానీ.. బాబును దగ్గర చేస్తున్న నా మీద కాదు.. అంటూ తులసి.. నందుపై ఫైర్ అవుతుంది. దీంతో మా మధ్య ఏవైనా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం. మామధ్యలో నువ్వు రాకు అంటూ తులసిపై నందు సీరియస్ అవుతాడు. దీంతో అలా బుద్ధి చెప్పు నందు అంటుంది లాస్య. వెంటనే అక్కడి నుంచి లాస్య.. లక్కీని తీసుకెళ్తుంది.
intinti gruhalakshmi 24 november 2021 full episode
అసలు.. నువ్వు ఏమనుకుంటున్నావురా. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ లక్కీని బాగా తిడుతుంది లాస్య. దీంతో లక్కీకి ఏం చేయాలో అర్థం కాదు. నీకు ఆకలి ఆకలి అన్నావు కదా.. తిను అంటూ టిఫిన్ తెచ్చి ఇస్తుంది లాస్య. నాకు వద్దు. నాకు టిఫిన్ వద్దు. నువ్వు నాకు నచ్చలేదు. నేను నీతో ఉండను. తులసి ఆంటితోనే ఉంటాను. ఆ తులసి ఆంటి అంటేనే నాకు ఇష్టం.. అంటాడు లక్కీ. నేను అస్సలు తినను అని ప్లేట్ ను కింద పడేస్తాడు లక్కీ. దీంతో లాస్య షాక్ అవుతుంది. నువ్వు తినిపిస్తే నేను తినను. తులసి ఆంటి తినిపిస్తేనే నేను తింటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు లక్కీ.
లాస్య శత్రువు అన్న విషయం మరిచిపోకు అమ్మా అంటాడు పరందామయ్య. తన బంధాలు ఎక్కడ దూరం అవుతాయోనన్న ఈర్ష్యే లాస్యలో నాకు కనిపిస్తోంది.. అంటుంది తులసి. కానీ.. లాస్యకు నీలోని మంచితనం కనిపించడం లేదమ్మా అంటాడు పరందామయ్య.
మరోవైపు నందును పిలుస్తాడు పరందామయ్య. నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంటాడు. నా కడుపున పుట్టిన బిడ్డతో నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. దారితప్పిన కొడుకును దారిన పెట్టాల్సింది పోయి.. నేను కూడా దారితప్పి ప్రవర్తించాల్సి వస్తోంది అంటాడు పరందామయ్య.
నేను దారి తప్పలేదు.. మీరు దారితప్పి ప్రవర్తించాల్సిన అవసరం లేదు అంటాడు నందు. అదే నా బాధ.. అంటాడు పరందామయ్య. లాస్యను తీసుకొని వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు పరందామయ్య. దీంతో ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు నందు.
ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఇంతకు మించి పరిష్కారం లేదు. నువ్వు సమస్యను ఎలా మెడలేసుకొని తిరగాలి అనుకుంటున్నావు తప్పితే.. ఆ సమస్యను ఎలా తప్పించుకోవాలని చూడటం లేదు అంటాడు పరందామయ్య. ఏదో ఒకటి చేయకపోతే.. మన మధ్య బంధాలు శాశ్వతంగా తెగిపోయేలా ఉన్నాయి. అందుకే.. మా కంటికి కనిపించకుండా లాస్యను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో.. అంటాడు పరందామయ్య.
దీంతో ఈ ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్లను అంటాడు నందు. అలా అయితే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. కళ్ల ముందు తులసి కనిపిస్తున్నంత కాలం నువ్వు తులసికి చేసిన అన్యాయం నీ మనసును తొలుస్తూనే ఉంటుంది. లాస్య ప్రతి రోజు అందరితో గొడవ పెట్టుకుంటోంది. ఈ నరకం మాకొద్దు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి లాస్యను పెళ్లి చేసుకో అంటాడు పరందామయ్య.
లాస్య కోసం ఈ ఇంటిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే.. లాస్యనైనా వదులుకుంటాను కానీ.. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని వదులుకోను.. అంటాడు నందు. లాస్య అంటే నాకు ఇష్టమే కానీ.. లాస్య కోసం మిమ్మల్ని వదులుకోలేను అంటాడు నందు. ఈ విషయాలన్నీ లాస్య విని షాక్ అవుతుంది.
నువ్వు ఎన్నిసార్లు అడిగినా.. లాస్యతో నేను ఉండాలి. నాతో మీరు ఉండాలి. నా జీవితంలో మీరు లేనప్పుడు లాస్య కూడా నాతో ఉండదు.. అంటాడు నందు. ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. ఇవన్నీ విని షాక్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.
మరోవైపు లక్కీ తులసి దగ్గరికి వచ్చి మళ్లీ కథలు చెప్పమంటాడు. అమ్మ నన్ను భయపెడుతోంది అంటాడు. తులసికి లక్కీ డాలర్ ను ఇస్తాడు. ఎవరి దగ్గర ఉంటే వాళ్లు హ్యాపీగా ఉంటారట. మీరు తీసుకోండి.. అంటాడు. ఇప్పుడు దీని అవసరం మీకే ఉంది. అందరూ మిమ్మల్నే ఏడిపిస్తున్నారు. అందుకే మీకు ఇస్తున్నాను అంటాడు లక్కీ.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.