Home » Entertainment » Intinti Gruhalakshmi 24 November 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : అనసూయను వదిలేసిన పరందామయ్య.. దీంతో ఆత్మహత్యకు యత్నించిన అనసూయ.. ఇంతలో నందుకు షాక్

Authored By
Varun G
The Telugu News | Updated on: November 24, 2022, 9:38 am
Advertisement

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 798 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. తులసి నా భర్తను నా నుంచి విడిపోయకు అని తులసిని బెదిరిస్తుంది అనసూయ. దీంతో డోర్ తీసిన పరందామయ్య.. నువ్వు తులసి గురించి ఇంకొక మాట మాట్లాడినా నా శవాన్ని కూడా చూసే అవకాశం నీకు ఉండదు అంటాడు పరందామయ్య. దీంతో అనసూయ బాధ పడుతుంది. నువ్వు నన్ను చాలా బాధపెట్టావు. నన్ను చంపేశావు అనసూయ. అనాల్సిన మాటలన్నీ అనేశావు అంటాడు పరందామయ్య.

Advertisement

intinti gruhalakshmi 24 november 2022 full episode

ఎంతోమంది చిన్న వయసులోనే మరణించడం చూస్తుంటాం.. కానీ అందమైన ఇల్లు, అందమైన కుటుంబం, చుట్టూ మనవళ్లు, మనవరాళ్లు ఇదంతా ఈ పెద్ద వయసులో దేవుడు ఇచ్చిన వరం అంటాడు పరందామయ్య. ఈ అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మనకు దొరికింది. మనం సంతోషంగా ఉంటూ నవ్వుకుంటూ ఉండొచ్చు. కానీ.. నీ దురుసుతనం వల్ల ఆ సంతోషం పోయింది. దేవుడు మనకు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అంటాడు పరందామయ్య.

Advertisement

మరోవైపు ముంబై వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ లోనే ఉన్న నందు.. అభికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. చివరకు లాస్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో ఏం జరుగుతోంది అని టెన్షన్ పడి వెంటనే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే నందు.. అభిని పిలుస్తాడు.

ఏంట్రా ఏమైంది.. నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. అని అడుగుతాడు. దీంతో అందరూ గుడికి వెళ్లారు అని అబద్ధం చెబుతాడు అభి. మరోవైపు మీరు చెప్పిన వాటన్నింటికీ నేను ఒప్పుకుంటాను. ముందు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం రండి అంటుంది అనసూయ.

Advertisement

దీంతో అమ్మా తులసి నేను వెళ్లను. ఆ ఇంటికి నేను వెళ్లను అంటాడు పరందామయ్య. నీ ఇంట్లోనే ఉంటాను అంటాడు. దీంతో మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పేది కూడా వినండి అంటుంది తులసి. దీంతో నువ్వు మధ్యలో రాకు అంటుంది అనసూయ. దీంతో నా కూతురును ఏం అనకు అనసూయ అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : నందును మేనేజ్ చేయలేకపోయిన అభి

డాడ్.. మీ ట్రిప్ ఎలా జరిగింది అని అడుగుతాడు అభి. దీంతో బాగానే జరిగింది అంటాడు నందు. గుడికి వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు. దీంతో వచ్చేస్తుంటారు. పైగా ఇప్పుడు ట్రాఫిక్ టైమ్ కదా అంటాడు అభి. ఇప్పుడు ట్రాఫిక్ ఏంటి.. నేను అదే రూట్ లో వచ్చాగా అంటాడు.

ఇంతలో అభి అంటూ బయటికి వస్తుంది అంకిత. నందును చూసి షాక్ అవుతుంది. వద్దు వద్దు రావద్దు అంటాడు. కానీ.. నందు చూస్తాడు. అంకుల్.. మీరు అంటుంది. అంకుల్ మీరు ఎప్పుడొచ్చారు అంటుంది. దీంతో నువ్వు అందరితో పాటు గుడికి వెళ్లలేదా అంటాడు.

దీంతో లేదు ఇంట్లోనే ఉన్నాను అంటుంది అంకిత. ఇంతలో అభి.. ఆఫీసు నుంచి అర్జెంట్ కాల్స్ వచ్చినట్టున్నాయి. నేను ఇప్పుడే వస్తాను అంటాడు. నేను ఇక నుంచి అయినా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని అనుకుంటున్నాను. నవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు పరందామయ్య.

Advertisement

50 ఏళ్లు నాతో తోడుగా నిలబడినందుకు ధన్యవాదాలు చెబుతాడు అనసూయకు. కలిసి మనిద్దరం ఎంతో మంచి లైఫ్ గడిపాం. సంతోషంగా ఉన్నాం. పొరపాటున నిన్ను హార్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు. ఇక నావల్ల కాదు. ఒప్పేసుకుంటున్నాను అంటాడు పరందామయ్య. తప్పు నాదే అంటాడు.

ఇక వెళ్లిరా అనసూయ వెళ్లు అంటాడు పరందామయ్య. మామయ్య.. నందు తిరిగి వచ్చాక ఏం చెప్పాలి అంటుంది లాస్య. వాళ్ల నాన్న చచ్చిపోయాడని చెప్పండి అంటాడు పరందామయ్య. నువ్వు ఇక వెళ్లిరా అనసూయ. చేతులెక్కి మొక్కుతాను. నువ్వు అడిగితే నీ కాళ్లు కూడా పట్టుకుంటా అంటాడు పరందామయ్య.

ఇక్కడ నన్ను ప్రశాంతంగా ఉండనీయు అంటాడు. ఇది నా ఆఖరి కోరిక అనుకో అంటాడు. దీంతో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి