Intinti Gruhalakshmi 25 May Today Episode : అభిని టార్గెట్ చేసిన లాస్య, నందు.. అభి ఇంటికి వెళ్లిన తులసికి షాక్.. అంకిత 50 కోట్ల ఆస్తిని ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi 25 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 మే 2022, బుధవారం ఎపిసోడ్ 641 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానమ్మ కిచెన్ లో ఈరోజు బెండకాయ బజ్జీలు చేశాను.. ఒకసారి మీరు తిని చూడండి అని అనసూయ.. పరందామయ్యతో అంటుంది. దీంతో పరందామయ్య దాన్ని తినడానికి భయపడతాడు. కానీ.. అనసూయ మాత్రం అతడిని వదలదు. నావల్ల కాదు.. వద్దు అంటాడు. కానీ.. చివరకు ఎలాగోలా పరందామయ్యకు తినిపిస్తుంది. ఇంతలో అక్కడికి దివ్య వస్తుంది. దివ్య నువ్వయినా ఈ బజ్జీ తిను.. అంటుంది. దీంతో నానమ్మ నన్ను విసిగించకండి.. అసలే చిరాకుగా ఉంది అంటుంది దివ్య. ఇంతలో తులసి వస్తుంది. నన్ను పట్టించుకోకుండా వదిలేశావు అంటుంది దివ్య.

intinti gruhalakshmi 25 may 2022 full episode

దీంతో అదా అంటుంది. నీకు అంత చిన్న విషయంలా అనిపించిందా అంటుంది దివ్య. దీంతో అనుకున్న సమయానికి డబ్బు రాలేదు. అందుకు ఫీజు కట్టడం ఆలస్యం అయింది. ఇంతకుముందే మీ కాలేజీకి వెళ్లి ఫీజు కట్టి వస్తున్నాను అని చెబుతుంది తులసి. ఇంకోసారి నీకు ఇలా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని చెబుతుంది తులసి. దీంతో నాకెందుకు ఎంబీబీఎస్ చదవడం అంటే ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టుగా ఉంది. నేను ఈ చదువు మానేస్తాను మామ్ అంటుంది దివ్య. ఏదైనా చిన్న జాబ్ చూసుకొని నీకు హెల్ప్ ఫుల్ గా ఉంటాను అంటుంది దివ్య. దీంతో నువ్వు కూడా అమ్మలా జీవితాన్ని వంటింటికే అంకితం చేస్తావా? ఈ అమ్మ జీవితాన్ని ఒక గుణపాఠంలా తీసుకో.. ఆదర్శంగా కాదు అంటుంది తులసి.

ఎంత కష్టపడి అయినా నిన్ను చదివిస్తాను. నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తాను అని చెప్పి దివ్యను ఓదార్చుతుంది తులసి. కట్ చేస్తే.. నందు కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్టు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే లక్కీ ఆడుకుంటూ ఉంటాడు. తనకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది.

ఈసారి లాస్ వచ్చే చాన్స్ లేదు అంటూ ఫోన్ లో అంటుంటాడు. లక్కీ అరుస్తుండటంతో లోపలికి వెళ్లి ఆడుకో.. వెళ్లు అంటాడు నందు. దీంతో అది చెప్పడానికి మీరెవరు.. నేను వెళ్లను.. ఇక్కడే ఆడుకుంటా అంటాడు. దీంతో కోపంతో లేచి లక్కీ అని అరుస్తాడు. దీంతో భయపడి.. నీ దోస్త్ కటీఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు లక్కీ.

ఇంతలో సీరియస్ గా అక్కడికి వస్తుంది లాస్య. ఏమన్నావు వాడిని అంటుంది లాస్య. దీంతో కంపెనీకి పెట్టుబడి పెట్టేవాళ్లు దొరక్క చాలా ఇరిటేషన్ గా ఉన్నాను. నువ్వు కూడా నన్ను సతాయించకు లాస్య అంటాడు నందు. దీంతో నీకు పెట్టుబడి దొరికే మార్గం నేను చెబుతాను అంటుంది.

Intinti Gruhalakshmi 25 May Today Episode : తులసి టైర్ పంక్చర్ వేయించడానికి వెళ్లిన ప్రేమ్

దీంతో ఏం చేయాలి అంటాడు నందు. దీంతో అభిని దారిలోకి తెచ్చుకో అంటుంది. కొద్దిరోజుల్లో అభి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారబోతున్నాడు. కోట్లకు అధిపతి కాబోతున్నాడు అని అసలు విషయం చెప్పేస్తుంది లాస్య. దీంతో నందు షాక్ అవుతాడు.

ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఆస్తి వచ్చేది అభికి కాదు.. అంకితకు అంటాడు నందు. అంకితకు వస్తే అభికి వచ్చినట్టే కదా అంటుంది లాస్య. అభి.. ప్రేమ్ లా కాదు.. వాడికి నేనంటే చాలా ప్రేమ. ఇప్పుడే వెళ్లి మాట్లాడి వస్తాను అంటాడు నందు.

దీంతో అభి.. మునుపటి అభి కాదు. మనవైపు అభిని తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. అని చెప్పి నందుకు ఏదో చెబుతుంది లాస్య. దీంతో నందు సరే అంటాడు. మరోవైపు తన ఇంట్లో ఇద్దరు పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది తులసి.

కట్ చేస్తే.. తులసి బండి టైర్ పంక్చర్ అవుతుంది. తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్న ప్రేమ్ తులసిని చూస్తాడు. తన కోసమే ఆగిందా అని అనుకొని అక్కడికి వెళ్తాడు ప్రేమ్. అమ్మ అని పిలిచినా.. తను పలకదు. ఎవరు నువ్వు అంటుంది. టైర్ పంక్చర్ అవ్వడం చూసి.. నీ కొడుకుగా కాదు.. ఒక అపరిచితుడుగా నీకు హెల్ప్ చేస్తా మేడమ్ అంటాడు ప్రేమ్.

నీకేం పని లేదా అంటుంది. దీంతో నిజంగానే ఏం పని లేదు మేడమ్. ఖాళీగానే ఉన్నాను అంటాడు ప్రేమ్. తర్వాత బండిని తీసుకొని వెళ్తుంటాడు ప్రేమ్. అతడిని చూసి ఏడుస్తుంది తులసి. ఇంతలో అంకిత కారులో వెళ్తూ తులసిని చూస్తుంది.

ఆంటి అంటుంది. మీరేంటి ఇక్కడ నిలబడ్డారు అంటుంది. సడెన్ గా బండి టైర్ పంక్చర్ అయింది అంటుంది. ప్రేమ్ కనిపించి.. బండి టైర్ పంక్చర్ చేయించడానికి వెళ్లాడు అంటుంది. సరే.. మీరు రండి.. ఒకసారి మా ఇంటికి వెళ్దాం అంటుంది. ఒకసారి అయినా మా ఇంటికి రండి ఆంటి.. మీ అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు అంటుంది అంకిత.

దీంతో సరే పదా అంటుంది తులసి. తన కారు ఎక్కుతుంది. మరోవైపు అభితో గాయత్రి, తన భర్త మాట్లాడుతూ ఉంటారు. మీ వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటాడు అభి. కానీ.. నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నానని గర్వం తలకెక్కించుకోకు.. అని తన మామ అంటాడు. ఇంతలోనే తులసి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

1 minute ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

1 hour ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

2 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

3 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

4 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

5 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

6 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

7 hours ago