Home » Entertainment » Intinti Gruhalakshmi 26 Januaray 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 26 Jan Today Episode : తులసి ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసిన గాయత్రి.. లాస్యే పూజ చేయాలని పట్టు.. పూజలో కూర్చోగానే లాస్యకు భారీ షాక్ ఇచ్చిన నందు

Authored By
Varun G
The Telugu News | Published on: January 26, 2022, 10:07 am
Advertisement

Intinti Gruhalakshmi 26 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 539 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు.. కస్టమర్ల కోసం చూస్తుంటాడు కానీ.. ఒక్క కస్టమర్ కూడా రాడు. దీంతో ఏం చేయాలో నందుకు అర్థం కాదు. చాలా సేపటి నుంచి చూస్తున్నా ఒక్క కస్టమర్ కూడా రాలేదేంటని అనుకుంటున్న సమయంలోనే ఓ జంట వస్తుంది. ఆ తర్వాత లైనుగా కస్టమర్లు వస్తూనే ఉంటారు. దీంతో నందు చాలా ఖుషీ అవుతాడు. కేఫ్ మొత్తం కస్టమర్లతో నిండిపోతుంది. అందరూ కాఫీ ఆర్డర్ చేసి తాగుతుంటారు. ఇంతలో ప్రకాశ్ వచ్చి కంగ్రాచ్యులేషన్స్ నందు.. నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్ గా వర్కవుట్ అయింది. నీలాగా ఐడియాలు ఇచ్చేవాళ్లు ముందు నుంచి నాతో ఉండి ఉంటే నేను ఇప్పటికే 10 బ్రాంచ్ లు ఓపెన్ చేసేవాడిని అని అంటాడు ప్రకాశ్. ఓకే కీపిటప్ అని చెప్పి ప్రకాశ్ వెళ్లిపోతాడు. దీంతో థ్యాంక్స్ చెబుతాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 26 januaray 2022 full episode

మరోవైపు ఎలాగైనా ఈసారి పూజలో తానే కూర్చోవాలని అనుకుంటుంది లాస్య. దాని కోసం ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో తనకు గాయత్రి గుర్తొస్తుంది. వెంటనే తనకు ఫోన్ చేస్తుంది. ఏంటి లాస్య.. కొత్త కోడలుగా ఇంట్లో పండుగ చేస్తూ నన్ను పిలవడానికి ఫోన్ చేశావా అంటుంది గాయత్రి. దీంతో పుండు మీద కారం చల్లుతున్నావా అంటుంది లాస్య. ఏమైంది అని అడుగుతుంది గాయత్రి. దీంతో స్టోరీ మొత్తం చెబుతుంది. చివరకు నీ కూతురును కూడా తులసి మార్చేసింది. చివరకు నీ కూతురు అంకితను పనిమనిషిగా మార్చేసింది తులసి అంటుంది. దీంతో నువ్వు రేపు ఇక్కడికి వచ్చి ఒక పని చేసి పెడితే.. ఆ తర్వాత నేను నీ కూతురు అంకితకు అత్తగా ఉంటాను. తనకు అండగా ఉంటాను అంటూ చెబుతుంది. దీంతో సరే నేను వచ్చి చూసుకుంటాను అంటుంది లాస్య.

Advertisement

పండుగ రోజు గాయత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లాస్య. ఈ ధాన్యలక్ష్మి పూజ ఇప్పటిది కాదు. మా అత్తగారు కంటే ముందు నుంచి వచ్చేది అని చెబుతుంది అనసూయ. ఈ ధాన్యలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు అని అడుగుతుంది దివ్య. దీంతో రైతుల శ్రమ వాళ్ల కోసమే కాదు. మన అందరి కోసం. రైతులతో పాటు అందరూ ధనధాన్యాలతో సంతోషంగా ఉండాలని ఈ పూజ చేస్తాం అంటుంది తులసి.

ఇంతలో లాస్య వస్తుంది. మళ్లీ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. మీరే నన్ను బాధపెడుతున్నారు. దాని కోసం మీకు ఏదో ఒక వంక కావాలి కదా అంటుంది లాస్య. ఈరోజు పండుగ ఎందుకు గొడవ అంటుంది తులసి. కావాలంటే నువ్వు కూడా మాతో పాటు వచ్చి పూజలో కూర్చో అంటుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 26 Jan Today Episode : తులసిపై విరుచుకుపడ్డ గాయత్రి

దీంతో పూజ నువ్వు కాదు.. ఈరోజు నేను చేస్తున్నా.. అని లోపల అనుకుంటూ ఉంటుంది లాస్య. కొత్త చీరల్లో మెరిసిపోతున్నారు. పూజ చేయడానికి రెడీ అయ్యారా. అంతేలే.. పూజ ఎవరు చేయాలని ఉంటే వాళ్లే చేస్తారు.. అంటుంది లాస్య.

ఇంతలో గాయత్రి వస్తుంది. నేనొచ్చేశా అంటుంది. డైరెక్ట్ గా వెళ్లి లాస్యను పలకరిస్తుంది. మామ్ అంటూ అంకిత హత్తుకుంటుంది. రావడం రావడమే ఇక గాయత్రి స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఇంకో కోడలు వచ్చాక కూడా మాజీ కోడలు ఇంకా ఇక్కడే ఉందేంటి అంటుంది గాయత్రి.

అవసరానికి తగ్గట్టు బంధాలు మారిపోతుంటాయి.. మనుషులను బట్టి మర్యాదలు మారిపోతుంటాయి. ఇష్టం ఉంటే ఒకలా.. ఇష్టం లేకపోతే ఒకలా.. వాళ్ల బంధం సరే.. నీ బంధం ఏంటి లాస్య.. కొత్త కోడలు కోరికలు తీరుస్తున్నారా లేదా అంటుంది గాయత్రి.

శృతి, అంకితతో పూజ చేయిస్తున్నారని లాస్య చెప్పడంతో అనసూయపై సీరియస్ అవుతుంది గాయత్రి. అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయమే.. అడిగి తీరాల్సిందే అంటుంది గాయత్రి. న్యాయం మాట్లాడాలి.. లాస్యతో పోలిస్తే అంకిత, శృతి పాత కోడళ్లు. లాస్య ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పూజ ఇది అంటుంది గాయత్రి.

Advertisement

పాపం ఒంటరిది. తన తరుపున అడిగే వాళ్లు ఎవరూ లేరని ఇలా చేస్తారా అంటుంది గాయత్రి. ఎలాగోలా లాస్య.. పూజ చేసేలా అందరినీ ఒప్పిస్తుంది గాయత్రి. అత్తయ్య, మామయ్య ఆశీర్వాదం తీసుకొని పూజ మొదలు పెడతా అంటుంది లాస్య. దీంతో ముందు వాళ్లకు అక్షింతలు ఇచ్చి కాళ్లకు దండం పెట్టాలి అంటుంది తులసి.

అత్తగారే వంశపారపర్యంగా జరిగే పూజ కోడలుకు నేర్పించాలి అంటుంది గాయత్రి. దీంతో లాస్య పూజలో కూర్చుంటుంది. ఇంతలో నందు ఫోన్ చేసి లాస్య అర్జెంట్ గా కేఫ్ కు రా అంటాడు నందు. దీంతో నేను పూజలో కూర్చున్నా అని చెప్పినా వినడు. దీంతో వెంటనే లాస్య బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి