Home » Entertainment » Intinti Gruhalakshmi 27 May 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 27 May Today Episode : లాస్య ప్లాన్ సక్సెస్.. నందు ఉచ్చులో చిక్కుకున్న అభి.. ఈ విషయం తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: May 27, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 27 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 643 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేనే ఫోర్స్ చేసి ఆంటిని మా ఇంటికి తీసుకెళ్లాను. కానీ.. మా మామ్.. ఆంటిని ఇన్ సల్ట్ చేసింది అంటుంది అంకిత. అప్పుడు అభి అన్నయ్య లేడా అని అడుగుతుంది దివ్య. ఉన్నాడు కానీ.. ఒక్క మాట కూడా అనలేదు అంటుంది అంకిత. నేనే రాకుండా ఉండాల్సింది. నేనే వచ్చి తనను ఇబ్బంది పెట్టాను అని అంటుంది తులసి. మీరు మీ కొడుకును సమర్ధించి ఆయన్ను గొప్పవాడిని చేయాలనుకుంటున్నారా అంటుంది అంకిత. అభి అండ చూసుకొని అతడి మౌనాన్ని చూసుకొనే కదా.. మా మామ్ మిమ్మల్ని అవమానించింది అంటుంది అంకిత.

Advertisement

intinti gruhalakshmi 27 may 2022 full episode

మీ మామ్.. తన పిల్లల సంతోషం కోసం చేస్తున్న పని అది అంటుంది తులసి. అవును.. నువ్వు మళ్లీ నా వెనుకే ఎందుకు వచ్చావు అని అంటుంది తులసి. దీంతో మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి పెద్ద తప్పు చేశాను. అనవసరంగా మీరు మాటలు పడేలా చేశాను. నన్ను క్షమించండి అని చెప్పి అంకిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రేపు ఉదయం లోగా పాట రాయాలని చెప్పేసరికి.. పాట రాయడం కోసం తంటాలు పడుతుంటాడు ప్రేమ్. మరోవైపు లంచ్ బాక్స్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీసుకు వస్తుంది శృతి. ఆఫీసులో ప్రేమ్ ను చూసి షాక్ అవుతుంది శృతి. ప్రేమ్ కంట పడకుండా ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ పాట రాస్తుండగా.. తిన్నగా లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో ప్రేమ్ కు ఫోన్ వస్తుంది. ఫోన్ రావడం చూసి వెంటనే శృతి పక్కనే ఉన్న శోభ కింద దాచుకుంటుంది.

Advertisement

ప్రేమ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ లో మాట్లాడిన తర్వాత వెళ్లి పాట రాస్తూ ఉంటాడు. దీంతో పైకి లేచి… అక్కడి నుంచి లోపలికి వెళ్లబోతుండగా ప్రేమ్ చూస్తాడు. శృతి అని పిలుస్తాడు. దీంతో షాక్ అవుతుంది శృతి. నువ్వేంటి ఇక్కడ అంటాడు.

దీంతో నీకోసమే వచ్చాను. నీకోసం బాక్స్ తీసుకొచ్చాను అంటుంది. తర్వాత బాక్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శృతి. కట్ చేస్తే నందు తన ప్లాన్ ను వర్కవుట్ చేస్తాడు. అభికి ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నీకు ఇన్ని రోజులు ఫోన్ చేద్దామనుకున్నా కానీ.. మీ అమ్మ నీడలో ఉన్నావని అనుకున్నా.

Advertisement

నువ్వు ఇప్పుడు ఆ ఇంటి గడప దాటావు కాబట్టే ఫోన్ చేస్తున్నాను. నేను ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు. కనీసం నువ్వయినా ఫోన్ చేసి అడగొచ్చు కదరా. ఈ డాడ్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని కనీసం ఫోన్ కూడా చేయాలనిపించలేదా అంటాడు.

Intinti Gruhalakshmi 27 May Today Episode : అభితో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన నందు

నిన్ను చూడాలని ఉంది. ఆప్యాయంగా మాట్లాడాలని ఉంది. మీ అమ్మ ఇగో వల్ల అందరం ఎఫెక్ట్ అయ్యాం. అందరం విడిపోయాం. చూపులకు కూడా దూరం అయ్యాం. బాధగా అనిపిస్తోందిరా అంటాడు నందు. మిమ్మల్ని తలుచుకోవడం తప్ప చూడలేను అంటాడు నందు.

నీకు గుర్తుందో లేదో.. నీ చిన్నప్పుడు నేను ఎక్కువగా టూర్స్ కు వెళ్తుండేవాడిని. నేను వచ్చేవరకు నువ్వు నా గురించి దిగులు పెట్టుకునేవాడివి. నేను కూడా నీకోసం ఎక్కువ దిగులు పెట్టుకునేవాడిని. పెద్ద కొడుకువు కదా.. నీ మీద ఎక్కువ ప్రేమ ఉండేది అంటాడు నందు.

ఆ రోజులే బాగుండేవి. ఇప్పుడు పెద్దోడివి అయిపోయావు. మీ అమ్మ నిన్ను కళ్లారా చూసుకునే అదృష్టం లేకుండా చేసింది. ఇంకా మీ అమ్మతోనే కలిసి ఉంటే నువ్వు ఎదిగే అవకాశమే ఉండేది కాదు. కారణం ఏదైనా.. నువ్వు గడప దాటడం మంచి నిర్ణయం. ఆల్ ది బెస్ట్ రా అంటాడు నందు.

Advertisement

ఇక వెనక్కి చూడకు. నేను తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదుగు. మీ నాన్న గర్వపడేలా చేయి అంటాడు నందు. అలాగే డాడ్.. కాల్ చేస్తూ ఉండండి.. అంటాడు. దీంతో నువ్వు చెప్పాలా.. అలాగే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నందు. దీంతో అభి కూడా ఎమోషనల్ అవుతాడు.

కానీ.. నందు కూడా నిజంగానే ఎమోషనల్ అయ్యాడు. నందు.. సూపర్ గా యాక్ట్ చేశావు. అభి.. నీ యాక్టింగ్ కు పడిపోయాడు అంటుంది. దీంతో నా ఎమోషన్ డ్రామా కాదు.. నిజం. నేను పెదాలతో మాట్లాడలేదు. నా గుండెలో ఉన్న ఫీల్ తో మాట్లాడాను అంటాడు నందు.

నీ ఎమోషన్ మన ప్లాన్ కు అడ్డు రాకూడదు గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు అభి, ప్రేమ్ ఫోటోను చూస్తూ ఎమోషన్ అవుతుంది తులసి. మిమ్మల్ని దూరం చేసుకొని మన మధ్య ఒక గీత గీశాను. నన్ను క్షమించండి అని అంటుంది తులసి.

ఈ అమ్మే నిన్ను దూరం పెట్టి ఏడిపిస్తోంది సారీ అని ప్రేమ్ తో చెబుతుంది తులసి. నా కన్నీళ్లు తుడుస్తూ నువ్వు నీ జీవితాన్ని నష్టపోవడం నాకు ఇష్టం లేదు అంటుంది తులసి. మరోవైపు భాగ్య.. లాస్యను చూడటానికి వెళ్తుంది. అతి త్వరలో లాస్య.. కోటీశ్వరురాలు అయిపోతుందన్నమాట అంటుంది.

Advertisement

కోటీశ్వరురాలు అయ్యేది నేను కాదు.. అభి అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి