Home » Entertainment » Intinti Gruhalakshmi 28 May 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 28 May Today Episode : భాగ్య చెప్పిన ప్లాన్ ను అమలు చేసిన లాస్య.. నందు ట్రాప్ లో పడి అతడికి భరోసా ఇచ్చిన అభి.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By
Varun G
The Telugu News | Updated on: May 28, 2022, 9:32 am
Advertisement

Intinti Gruhalakshmi 28 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 మే 2022, శనివారం ఎపిసోడ్ 644 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్యను కలిసిన భాగ్య.. అభిని కాకా పడితే.. అభి డబ్బులు నీకే అంటుంది భాగ్య. నువ్వు బావ గారిని వాడుకో అంటుంది భాగ్య. ఇప్పుడు నా సమస్య అల్లా ఆ తులసి అంటుంది. ఒకవేళ తనకు తెలిసి గాలం వేస్తే మన చేతికి మిగిలేది చిప్పే అంటుంది లాస్య. తులసి గాలానికి అభి పడాలి కదా అంటుంది భాగ్య. కానీ.. అంకిత మాత్రం ఖచ్చితంగా తులసి వైపే మొగ్గు చూపుతుంది. తనతోనే అసలు సమస్య అంటే.. భాగ్య ఒక మంచి ప్లాన్ చెబుతుంది లాస్యకు. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే అభి మీ సైడ్ వస్తాడు అంటుంది భాగ్య. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ.. బాగా ఖర్చవుతుంది కదా అంటుంది లాస్య. బాగా ఆలోచించుకో.. కోట్లు వస్తున్నప్పుడు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్యేం కాదు అంటుంది భాగ్య.

Advertisement

intinti gruhalakshmi 28 may 2022 full episode

మరోవైపు తులసి పార్కులో జాగింగ్ చేస్తూ ఉంటుంది. అదే పార్కుకు వెళ్తుంది లాస్య. అక్కడ తులసిని చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. తులసి అని పిలుస్తుంది. దీంతో తులసి ఆగి ఎవరా అని చూస్తుంది. ఏంటి తులసి.. నానుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తున్నావా అంటుంది లాస్య. అలా అని అనుకొని తృప్తి పడు కానీ.. నీఅంతరాత్మను అడుగు అంటుంది తులసి. నీకు ఎన్ని అవమానాలు ఎదురైనా తెల్లారేసరికి సంతోషంగా బయటికి వెళ్తావు. నీ సంతోషం వెనుక సీక్రెట్ ఏంటి అని అడుగుతుంది. దీంతో నీకో జీవిత సత్యం చెప్పనా అంటుంది తులసి.

Advertisement

నువ్వు ఎంత తపస్సు చేసినా నువ్వు తులసి కాలేవు అంటుంది తులసి. నాకు అవసరం లేదు. లాస్య డైనమిక్.. ఏం కావాలన్నా సాధించుకుంటుంది అంటుంది లాస్య. నిన్న నీ పెద్ద కొడుకు అత్తారింటికి వెళ్లి పేడ నీళ్లు చల్లించుకొని వచ్చావు అంటుంది లాస్య.

మనసు మార్చి నీ పెద్దకొడుకును ఇంటికి తీసుకొద్దామనా అంటుంది లాస్య. దీంతో నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది తులసి. వాడిని గడప దాటనిచ్చి పెద్ద తప్పు చేశావు తులసి. వాడిని మా గడప తొక్కనిచ్చి లెక్క సరి చేసుకుంటాను అంటుంది. అభి నిన్ను ద్వేషించేలా చేసుకుంటాను అంటుంది లాస్య.

Advertisement

దీంతో అది నీవల్ల కాదు అంటుంది తులసి. అభి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఉచ్చులో పడడు. కావాలంటే రాసిస్తా అంటుంది తులసి. దీంతో నా ఉచ్చులో పడకపోవచ్చు. కానీ.. వాళ్ల నాన్న ఉచ్చులో పడొచ్చు కదా అంటుంది లాస్య. దీంతో తులసి షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi 28 May Today Episode : తులసికి సవాల్ చేసిన లాస్య

నా మొదటి టార్గెట్ అభి. ఆ తర్వాత అంకిత. తర్వాత ప్రేమ్, శృతి. నీ మేడను కుప్పకూలుస్తా అంటుంది లాస్య. దీంతో కూలిస్తే కూలిపోవడానికి అదేమీ పేకమేడ కాదు. బంధాలతో పెనవేసుకున్న మేడ అంటుంది. నేను దెబ్బకు దెబ్బ తీస్తాను. అనవసరంగా దెబ్బ తినకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు అభిని పిలుస్తాడు నందు. తన కోసం వంట వండి అన్ని సిద్ధం చేస్తారు. నువ్వు అభితో డాడీలా ఉండకు. డాడీలా నటించు అంటుంది. ఇంతలో అభి వస్తాడు. డాడ్ అంటాడు. దీంతో నందు పరిగెత్తుకెళ్తాడు. ఇద్దరూ కౌగిలించుకుంటారు.

చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉందిరా అంటాడు నందు. అభికి ఇది ఇష్టం… అది ఇష్టం.. అది చేసిపెట్టు అని ఒకటే గొడవ. మీక నా ఇష్టాలు తెలుసా డాడ్ అంటాడు అభి. ఎందుకు తెలియదు అంటాడు. తర్వాత అభికి పాయసం తెచ్చి ఇస్తుంది తులసి.

Advertisement

దాన్ని తింటాడు అభి. తర్వాత తనకు పిల్లలంటే ఎంత ఇష్టమో చెబుతాడు నందు. మీ విషయం వచ్చేసరికి అమ్మ హార్ష్ గా బిహేవ్ చేస్తుంది. పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంది అంటాడు అభి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకొని పెంచలేదా అంటాడు నందు.

ఇప్పుడు అవన్నీ ఎందుకులే నందు అంటుంది లాస్య. చిన్నప్పటి నుంచి సంసార బాధ్యతలు నేనే మోశాను. ఇంత చేసినా అమ్మానాన్నతో సహా అందరూ నన్ను ఒక శత్రువుగా చూస్తున్నారు అంటాడు నందు. డాడ్ మీకు అన్యాయం జరిగింది. నాకు తెలుసు అంటాడు అభి.

ఎవరు మీ వైపు ఉన్నా లేకున్నా నేను మీకున్నాను అంటాడు అభి. మీకు ఏ అవసరం వచ్చినా ఈ పెద్దకొడుకు ఉన్నాడని మరిచిపోకండి అంటాడు అభి. అంకితకు కూడా దగ్గర అవండి అంటాడు అభి. అంకిత బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తే తను కూడా మనకు దగ్గరవుతుంది కదా అంటుంది లాస్య.

ఇలా చేస్తే అంకిత మీ వైపు మళ్లినట్టే అంటాడు అభి. అంకితకు పార్టీ ఎలా చేస్తావు అని లాస్యను అభి వెళ్లిన తర్వాత అడుగుతాడు నందు. కోట్లు వచ్చేకాడ.. లక్షలు ఖర్చు పెడితే ఏం కాదు అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి