Intinti Gruhalakshmi 29 Jan Today Episode : దారితప్పిన అభి… మాధవి దగ్గర డబ్బులు అడిగి ఏం చేయబోతున్నాడు? ఈ విషయం తెలిసి తులసి అభిని ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi 29 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 542 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు బావిలో కప్పవు. నీకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు అని తులసిని హేళన చేస్తుంది లాస్య. నీ ప్రపంచం కన్నా నా ప్రపంచం చాలా మంచిది.. అంటుంది తులసి. మిస్టర్ నందు గారు.. మా పిల్లల ముందు ఇలా ప్రవర్తించకండి.. అని వార్నింగ్ ఇస్తుంది తులసి. దీంతో తులసి మేము చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను. నిన్న నేను ఉన్న ఆనందంలో నన్ను నేను మరిచిపోయి ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా జరగదు నాది బాద్యత సారీ అని చెబుతాడు నందు. దీంతో తులసి సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ.. లాస్యకు మాత్రం సారీ చెప్పడం అస్సలు నచ్చదు.

intinti gruhalakshmi 29 january 2022 full episode

ఏమైంది నందు నీకు. నువ్వు ఇలా తగ్గిపోతున్నావు ఎందుకు. నువ్వు సారీ చెప్పడం వల్ల నన్ను కూడా నువ్వు అవమానించినట్టే అంటుంది తులసి. దీంతో లాస్య థింక్ పాజిటివ్.. మన గురించే కదా తులసి చెప్పేది.. అది మన మంచికే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. మరోవైపు వంటింట్లో పనిచేస్తున్న అంకితను చూసి అంకిత ఇక నుంచి నువ్వు ఇంట్లో పనులు చేయకు. నువ్వు నీ చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టు అంటుంది తులసి. మా అమ్మ అన్న మాటలకు నన్ను దూరం పెడుతున్నారా ఆంటి అంటుంది అంకిత. మీ అమ్మ మాటలు నేను ఎప్పుడో మరిచిపోయాను. నీ భవిష్యత్తు కోసం.. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరం ఉన్నప్పుడు చదువుకోవడం కాదు.. అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం చేయడం కాదు.. ఆడది.. తన కాళ్ల మీద తాను నిలబడినప్పుడే విలువ ఉంటుంది అని చెబుతుంది తులసి.

నేను నిన్ను డాక్టర్ గా చూడాలి. వెళ్లి జూనియర్ డాక్టర్ గా ప్రయత్నించు.. అంటుంది తులసి. దీంతో సరే అంటుంది అంకిత. వెళ్లేముందు ఆంటి అంటూ తనను గట్టిగా హత్తుకుంటుంది అంకిత. నేను మీ కడుపున పుడితే బాగుండేది ఆంటి. వచ్చే జన్మలో అయినా దేవుడు నా కోరిక తీరిస్తే బాగుండు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత.

మరోవైపు ప్రేమ్ ఎక్కడికో వెళ్లేందుకు రెడీ అవుతుంటాడు. కాఫీ తాగు అంటుంది శృతి. అక్కర్లేదు అంటాడు. కాఫీ మానేస్తే నా మీద కోపం తగ్గిపోతుందా అంటుంది శృతి. నువ్వు ఇలా ఉంటే నేను ఉండలేను ప్రేమ్ అంటుంది. ఇంతలో వాళ్ల మాటలను అంకిత వింటూ ఉంటుంది.

అనాల్సిన వన్నీ అనేసి ఇప్పుడు మరిచిపో అంటే ఏంటి అర్థం. చేతగానివాడివి కాదు అని నిరూపించుకో అంటే దాని అర్థం నేను చేతగానివాడిని అనే కదా.. నేను డబ్బులు సంపాదించాలి.. నీ పరువు నిలబెట్టాలి అంతే కదా. నీ భర్తగా లూజర్ అని అనిపించుకోకుండా ఉండటం కోసం డబ్బు సంపాదిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.

ఇంతలో అంకిత అక్కడికి వచ్చి ప్రేమ్ కోపంగా బయటికి వెళ్లడం నేను చూశాను అంటుంది అంకిత. నేను మీ మాటలు విన్నాను శృతి. ఏంటో ఈ మగాళ్లంతా ఇంతేనేమో శృతి. తమ ప్రేమతో పెళ్లాన్ని ఆకాశానికి ఎత్తుతారు. భార్య నోరు తెరిచి అలా కాదు.. ఇలా అంటే చాలు.. తట్టుకోలేరు అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi 29 Jan Today Episode : అభి గురించి బాగా టెన్షన్ పడ్డ తులసి

భార్యభర్తలు అన్నాక ఇలాంటి మనస్పర్థలు తప్పవేమో అంకిత. ఎప్పుడూ భార్యలే తగ్గాలా అంటుంది. ఎవరు తగ్గాలి అనేది కాదు.. భార్యాభర్తల బంధం అనేది ముఖ్యం అంటుంది శృతి. ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేసుకొని ఉంటున్నారు. మనమే తేరగా తిని కూర్చుంటున్నాం అంటుంది అనసూయ.. పరందామయ్యతో.

ఇంతలో తులసి వచ్చి.. అభి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది మామయ్య అంటుంది తులసి. అవును అమ్మా.. నిన్నే ఎదిరించే స్థాయికి వాడు ఎదిగాడు అంటుంది. దీంతో మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది తులసి. దీంతో ఒకసారి పిల్లలను పిలిచి మాట్లాడుదాం అని అనుకుంటున్నా అంటుంది తులసి.

దీంతో సరే అంటాడు పరందామయ్య. అందరిని పిలుస్తుంది. ఇక నుంచి మీ జీతాలు ఇస్తేనే మీ బాధ్యత మాది ఉంటుంది అంటుంది. మీ జీతాలను ఇక నుంచి నాకు ఇవ్వండి అంటుంది తులసి. దీంతో మేము ఏమన్నా చిన్నపిల్లలమా డబ్బును వృథాగా ఖర్చు పెట్టడానికి అంటాడు అభి.

ఒక్కమాట చెబుతున్నాను వినండి. జీతం మీరు నాకు ఇస్తే మీ బాధ్యత నాది. లేదంటే ఎవరి బతుకులు వాళ్లవి అంటుంది. దీంతో నేను ఈ ఇంటి బానిసనా.. అంటుంది. ప్రేమ్ మాత్రం సరే ఇస్తా అంటాడు. ఇంతలో నందు, లాస్య వచ్చి.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా.. అంటుంది లాస్య.

ఇంతలో అనసూయ కలుగజేసుకొని.. నువ్వు స్వేచ్ఛ, బాధ్యత గురించి మాట్లాడుతున్నావా అని లాస్యపై వేసుకుంటుంది అనసూయ. మీ భార్యకు మీరు అర్థం అయ్యేలా చెప్పండి. మా పిల్లల విషయంలో కలుగజేసుకోవద్దని అని నందుతో అంటుంది తులసి.

అభి.. చెప్పురా నీ నిర్ణయం చెప్పు అని అనసూయ అంటుంది. ఈ స్టేజ్ లో అమ్మ మాటను కాదని రిస్క్ తీసుకోవడం మంచిది కాదేమో. ఈ స్టేజ్ లో అమ్మ మాట వినాల్సిందే అని అనుకుంటాడు అభి. దీంతో సరే అమ్మ.. నేను జీతం రాగానే ఇచ్చేస్తాను అంటాడు.

అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతారు. తర్వాత అభిని మీరే కంట్రోల్ చేయాలి ఆంటి అంటుంది తులసి. సరే.. నేను చూసుకుంటాను అమ్మ అంటుంది తులసి. మరోవైపు అభి.. కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. పిరికి వాడిగా బతికితే పిరికివాడిగానే మిగిలిపోతాం.

ఇప్పుడు ఎలాగైనా డబ్బు కావాలి. కానీ.. అంత డబ్బు ఎవరిస్తారు అని ఆలోచిస్తుంటాడు అభి. ఇంతలో తనకు మాధవి గుర్తొస్తుంది. వెంటనే తన ఇంటికి వెళ్తాడు అభి. ఎంత కాలానికి వచ్చావురా. కనీసం మీ నాన్న కన్నా మీకన్నా నేను గుర్తున్నాను అంటుంది మాధవి.

నా సంపాదన ఎటూ సరిపోవడం లేదు.. అంటాడు అభి. నా జాబ్ ను నమ్ముకుంటే జీవితంలో ఎటూ ఏం సాధించలేను. అందుకే బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. దాని కోసం ఒక లక్ష రూపాయలు తక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసేవాళ్లు ఎవరూ లేరు అత్తయ్య అంటాడు అభి.

నీకు హెల్ప్ చేయడం అంటే ఇన్ డైరెక్ట్ గా మా వదినకు హెల్ప్ చేయడమే. ఇప్పుడే ఉండు డబ్బు తీసుకొస్తా అని చెప్పి వెళ్లిపోతుంది మాధవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

4 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

5 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

6 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

7 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

8 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

9 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

10 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

11 hours ago