Home » Entertainment » Intinti Gruhalakshmi 29 June 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 29 June Today Episode : తులసికి అంకిత సాయం.. ఈ విషయం తెలిసి లాస్య షాక్.. తులసిని నిలదీసిన గాయత్రి.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: June 29, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 29 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 671 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ తులసికి తన డబ్బును కాజేసింది నువ్వే అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు అని లాస్యతో అంటుంది భాగ్య. దీంతో అసలు తులసికి ఈ విషయం ఎలా తెలుస్తుంది. నేను అయితే చెప్పను.. ఆ రంజిత్ గాడు కూడా చెప్పడు. ఇక చెబితే నువ్వే చెప్పాలి అంటుంది లాస్య. దీంతో భాగ్య టెన్షన్ పడుతుంది. నన్ను వదిలేయ్ అమ్మ. నేను ఎందుకు చెబుతాను అంటుంది భాగ్య. దీంతో ఆ తులసికి మరో షాక్ ఇస్తాను చూడు అని బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేస్తుంది లాస్య. ఈ మధ్య లోన్ తీసుకున్న తులసి అనే ఆవిడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నట్టు తెలిసింది. మిమ్మల్ని అలర్ట్ చేయాలని చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. లాస్య తెలివి చూసి షాక్ అవుతుంది భాగ్య.

Advertisement

intinti gruhalakshmi 29 june 2022 full episode

కట్ చేస్తే బ్యాంక్ అధికారులు తులసి ఇంటికి వస్తారు. దివ్య అక్కడే ఉంటుంది. తులసి గారి ఇల్లు ఇదేనా అని అడుగుతారు. దీంతో మామ్ ఇంట్లో లేదు అంటారు. దీంతో మేము బ్యాంక్ నుంచి వచ్చాం అంటారు. దీంతో లోపలికి తీసుకొస్తారు. మీరు వచ్చిన పని ఏంటి అని అడుగుతారు. ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడానికి వచ్చాం అంటారు. ఆమె చీట్ చేసి బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి లోన్ తీసుకుంటే దాన్ని క్రైమ్ అంటారు బ్యాంక్ అధికారులు. దీంతో మా ఆంటిని ఒక్క మాట అనడానికి కూడా వీలు లేదు. ఆ 20 లక్షలకు నేను షూరిటీ ఇస్తాను అంటుంది అంకిత. దీంతో ఇక్కడ సైన్ చేయండి అని అంటారు బ్యాంక్ అధికారులు. దీంతో వాళ్లు చెప్పిన చోట సైన్ కడుతుంది. ఇక.. చాలా అని అంటుంది. దీంతో సైన్ చేయగానే సరిపోదు.. రెండు రోజుల్లో మాకు మ్యూజిక్ స్కూల్ చూపించాలి. లేదంటే మా 20 లక్షలు మాకు తిరిగి కట్టాలి. షూరిటీ ఇచ్చినందుకు ఆవిడ కట్టకపోతే మీరే ఆ డబ్బు కట్టాలి అని చెప్పి అక్కడి నుంచి బ్యాంక్ అధికారులు వెళ్లిపోతారు.

Advertisement

బ్యాంక్ అధికారులు కారులో వెళ్లడం అప్పుడే ఇంటికి వస్తున్న తులసి చూస్తుంది. ఎవరు వచ్చారు అని అంకితను అడుగుతుంది. దీంతో బ్యాంక్ అధికారులు వచ్చారు. మనం పెట్టింది ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసింది అంటుంది అంకిత. రెండు రోజుల్లో మ్యూజిక్ స్కూల్ చూపించాలని చెప్పారు అంటుంది అంకిత. మీరైతే ఫ్రెష్ అయి రండి.. తర్వాత ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి తులసిని ఇంట్లోకి పంపిస్తుంది. నేను షూరిటీగా సంతకం పెట్టినట్టు తులసి ఆంటికి ఏమాత్రం తెలియకూడదు అని అందరికీ చెబుతుంది అంకిత.

Intinti Gruhalakshmi 29 June Today Episode : అంకిత షూరిటీ గురించి తెలుసుకున్న లాస్య

కట్ చేస్తే 20 లక్షలు డబ్బు తీసుకెళ్లి తన ఫ్రెండ్ కు ఇచ్చేస్తారు నందు, లాస్య. ఆఫీసు కోసం అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. అగ్రిమెంట్ చేయిద్దామా అంటే.. ఇవాళ వద్దు.. ఎల్లుండి బాగుందంట. ఆరోజు చేయిద్దాం అంటాడు తన ఫ్రెండ్ దీంతో అక్కడి నుంచి వెళ్తారు నందు, లాస్య.

Advertisement

ఇంతలో లాస్యకు రంజిత్ ఫోన్ చేసి అంకిత.. షూరిటీ పెట్టిన విషయం గురించి చెబుతాడు. దీంతో లాస్య వెంటనే ఈ విషయం గాయత్రికి చెప్పాలి అని అనుకుంటుంది. మరోవైపు తులసి.. ఎంతో దీనంగా కూర్చొని ఉంటుంది. ఒకవేళ ఆ 20 లక్షలు డబ్బును అప్పుగా తీసుకుందాం అంటుంది అంకిత.

దీంతో ఎవరు వాళ్లు చెప్పు అంటుంది తులసి. దీంతో వాళ్లు ఎవరు చెప్పు అంటుంది తులసి. వాళ్లు ఎవరో కాదు.. నేనే అంటుంది అంకిత. దీంతో ఆ టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది తులసి. ఎందుకు మీరు నేను చెప్పేది వినిపించుకోరు అంటుంది అంకిత. దీంతో నీ భర్త సంపాదించిన డబ్బు అయితే అది నీది అవుతుంది కానీ.. ఇది కాదు అంటుంది తులసి.

నాకు ఆ డబ్బు వద్దు. ఆ డబ్బు నేను తీసుకోలేను అని అంకితతో చెబుతుంది తులసి. నా పరిష్కారం నేను వెతుక్కుంటాను అంటుంది తులసి. దీంతో అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో గాయత్రి ఇంటికి వచ్చి.. తులసిని నిలదీస్తుంది. నీ బ్యాంక్ లోన్ కోసం నా కూతురు షూరిటీని ఎందుకు తీసుకున్నావు అని ప్రశ్నిస్తుంది. దీంతో నా బిడ్డ మీద ప్రమాణం చేస్తా అనబోతుండగా ఆంటి నేను షూరిటీ ఇచ్చాను అంటుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి