Intinti Gruhalakshmi 3 Jan Episode Highlights : తులసి ఆరోగ్యం బాగోలేకున్నా.. నందు, లాస్య హనీమూన్ కు.. లాస్య వల్ల తులసికి మరో ముప్పు

Intinti Gruhalakshmi 3 Jan Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం 3 జనవరి 2022న ప్రసారం అవుతుంది. సోమవారం ప్రసారం కాబోయే 519 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి ప్రాణముప్పు తప్పిందని డాక్టర్ చెప్పడంతో నందు, ప్రేమ్ ఖుషీ అవుతారు. తెల్లారే తనను డిశ్చార్జ్ చేస్తారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు. ఇంటికి వచ్చేస్తుంది తులసి. కానీ.. నేను దీపక్ దగ్గరికి వెళ్లిపోతాను. కొత్త జంటను ఇక్కడుండి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుంది తులసి. కానీ.. ఎవ్వరూ దానికి ఒప్పుకోరు. ముఖ్యంగా పరందామయ్య, అనసూయ.. నువ్వు లేకుంటే మేము ఉండం. ఇంట్లో నుంచి వెళ్లిపోతాం అంటారు. కుటుంబ సభ్యులు కూడా మేము ఇంట్లో ఉండం అని పరందామయ్య, అనసూయతో వెళ్లిపోయేందుకు రెడీ అవుతారు.

intinti gruhalakshmi 3 january 2022 episode

దీంతో ఆగండి.. నేను ఇంట్లోనే ఉంటాను. మీతోనే ఉంటాను.. అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. తులసి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుందేమో అని లాస్య సంతోషించిన లోపే తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఉండటంతో లాస్యకు కోపం వస్తుంది. మరోవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నందు ఉంటాడు. ఇంతలో తులసికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చేందుకు హారతి తీసుకొస్తుంది అనసూయ. తనకు హారతి ఇవ్వడం చూసి భాగ్య మధ్యలో చిచ్చు పెడుతుంది. నీ మాజీ కోడలుకు మాత్రం హారతి పట్టి ఇచ్చావు. కానీ… ఈ కొత్త జంటకు మాత్రం హారతి ఇవ్వడానికి నీకు వచ్చిన సమస్య ఏంటి.. ఇదేనా నీ పెద్దరికం అని ప్రశ్నిస్తుంది భాగ్య.

Intinti Gruhalakshmi 3 Jan Episode Highlights : నందు, లాస్యకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించిన శృతి

దీంతో తప్పని పరిస్థితుల్లో తులసి.. శృతిని హారతి ఇచ్చి కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించు అని చెబుతుంది. దీంతో శృతి వెంటనే ఇంట్లోకి వెళ్లి హారతి తీసుకొని వచ్చి నందు, లాస్యకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

నందు, లాస్య.. ఇంట్లోకి వెళ్లే సమయంలోనే గోడకు ఉన్న పూసల దండ కింద పడుతుంది. అయ్యో.. అపశకునం.. అశుభం అని అనసూయ అంటుంది. లాస్య ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో అశుభం అని చెబుతుంది అనసూయ. అయినప్పటికీ.. ఇద్దరూ ఇంట్లో అడుగుపెడతారు.

మరోవైపు తులసి ఆరోగ్యం కుదుటపడుతుంటుంది. తను నెమ్మదిగా లేచి నడుస్తుంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ హ్యాపీ మూడ్ లో ఉంటారు. నందును మాత్రం ఫ్యామిలీకి దూరంగా ఉంచేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది లాస్య.

కట్ చేస్తే.. నందును ఎక్కడికైనా దూరంగా కొన్ని రోజులు తీసుకెళ్తే.. వీళ్లతో ఉన్న అనుబంధం తగ్గుతుందని భావించిన లాస్య.. హనీమూన్ కు ప్లాన్ చేస్తుంది. తులసి నువ్వు త్వరగా కోలుకోవాలి. అప్పుడే కదా మాకు సెండాఫ్ ఇవ్వగలిగేది అంటుంది లాస్య. సెండాఫ్ ఇవ్వడం ఏంటి.. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు నందు. దీంతో మనం హనీమూన్ కు వెళ్తున్నాం అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

46 minutes ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

2 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

2 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

6 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

7 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

8 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

9 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

10 hours ago