intinti gruhalakshmi 3 january 2022 full episode
Intinti Gruhalakshmi 3 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 జనవరి 2022, సోమవారం 519 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన తల్లి తులసి కోసం అని దివ్య పాయసం చేస్తుంది. అది తిని అందరూ షాక్ అవుతారు. పాయసం చాలా బాగుంది అంటారు. తనను మెచ్చుకుంటారు. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. దీంతో డాడీ నేను పాయసం చేశాను. తినండి అంటుంది. తిని బాగుందమ్మా. నా బంగారు తల్లి వంటలు కూడా నేర్చుకుంటుందా? అంటూ మెచ్చుకుంటాడు నందు. డాడీ మీకో విషయం చెప్పాలి అని దివ్య.. నందుకు ఏదో చెప్పబోతుంది. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. దీంతో దివ్య చెప్పకుండా ఆగిపోతుంది. దివ్య.. మీ లాస్య ఆంటికి కూడా ఒక కప్పు పాయసం ఇవ్వు అంటాడు పరందామయ్య. దీంతో వద్దు దివ్య అంటుంది.
intinti gruhalakshmi 3 january 2022 full episode
తులసి.. నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి అంటుంది లాస్య. నువ్వు త్వరగా కోలుకుంటేనే కదా మాకు సెండాఫ్ ఇచ్చేది అంటుంది లాస్య. దీంతో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటాడు నందు. మన హనీమూన్ కు అంటుంది లాస్య. నీకు అసలు సిగ్గు ఉందా. పిల్లల ముందు ఈ మాటలు మాట్లాడుతావా అంటుంది అనసూయ. నేను ఏం చేయను అత్తయ్య. ఎప్పుడు చూసినా నందు మీతోనే ఉంటున్నాదు కదా. తులసి దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. ఇంతకీ మమ్మల్ని హనీమూన్ కు ఎక్కడికి వెళ్లమంటారు అని అడుగుతుంది లాస్య. మీరు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తాం. సాక్ష్యం ఉండాలి కదా. పెళ్లి ముందు పారిపోయిన వాడు.. ఫస్ట్ నైట్ ముందు పారిపోయిన వాడు.. హనీమూన్ కు పారిపోడని నమ్మకం ఏంటి.. అందుకే మీరు ఉంటే అప్పుడు సాక్ష్యం ఉంటుంది అంటూ పిచ్చి వాగుడు వాగుతుంది లాస్య. దీంతో మీ భార్యకు చెప్పండి.. ఇక్కడ పనికిమాలిన మాటలు మాట్లాడొద్దని అని నందుతో చెబుతుంది తులసి.
దీంతో లాస్య.. ఇక చాలు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. అది కాదు నందు అంటుంది లాస్య. నాకు ఇంకేం చెప్పకు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు. దీంతో చిరాకుతో అక్కడి నుంచి లాస్య వెళ్లిపోతుంది. లాస్య వెళ్లిపోయాక.. నందు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
నందు.. లాస్య దగ్గరికి వెళ్లాక.. నందు నువ్వు అందరి ముందు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు. అవమానిస్తున్నావు. పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు.. అంటుంది లాస్య. ఎందుకు మారాలి.. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. అలాగే ఉంటా అంటుంది లాస్య.
నువ్వు ఈ ఇంటి కోడలువు. కోడలుగా ప్రవర్తించాలి. కోడలుగా నడుచుకోవాలి. కోడలుగా అనిపించుకోవాలి. ముందు మా అమ్మ నాన్నలను మంచిగా చేసుకో. వాళ్ల గురించి ఆలోచించు. నువ్వు భర్తనే పట్టించుకోవు. ఇక.. వాళ్లను ఏం పట్టించుకుంటావు అంటూ సీరియస్ అవుతాడు నందు.
నా గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు నా భార్యవు. ఇప్పుడు కడా అంతేనా. నీకు ఎదుటివాళ్ల గురించి అస్సలు పట్టదు. 10 మంది ముందు మనం హనీమూన్ గురించి మాట్లాడుకునే వయసులో లేము. ఇంకోసారి ఆ పంచాయితీ పెట్టి నాకు తలనొప్పి తీసుకురాకు. నా సహనాన్ని పరీక్షించకు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
తర్వాత లాస్యకు తులసి అడ్డుపడుతుంది. పూజకు వెళ్లబోతుంటే ఆపుతుంది లాస్య. నేను నందును పెళ్లి చేసుకుంది నాలుగు గోడల మధ్య కూర్చొని కాపురం చేసుకోవడం కోసం కాదు. కోడలుగా నా బాధ్యతను నిర్వర్తించడానికి అంటుంది. నువ్వు పూజ చేయడానికి వీలు లేదు.. అంటుంది లాస్య.
ఇప్పుడు నేను ఈ ఇంటి కోడలును. నా హక్కులకు అడ్డురాకు. పూజలు నేనే చేయాలి. కోడలుగా నేను చేసే పనులకు నాకు అడ్డు రాకు.. అంటుంది లాస్య. వెళ్లిపో అనగానే తులసి వెళ్లిపోబోతుంటే.. ఏంటి ఆంటి.. వెళ్లిపో అనగానే వెళ్లిపోతారా అంటూ అంకిత, శృతి అంటారు.
అంకిత.. వద్దు గొడవ పెట్టుకోకండి. నేను గొడవ పెట్టుకోలేక కాదు. వద్దని నేను వదిలేశాను. బయట తులసి కోటకు నేను పూజ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. తర్వాత తులసికి శృతి.. జెడ వేస్తూ సరదాగా కాసేపు ముచ్చట్లు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.