intinti gruhalakshmi 3 june 2022 full episode
Intinti Gruhalakshmi 3 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 649 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు కోట్ల ఆస్తి కలిసి వచ్చింది అనే విషయం.. అస్సలు తులసికి తెలియకూడదు అని అభితో అంటుంది గాయత్రి. ఆ విషయాన్ని తులసి వింటుంది. అక్కడే ఉన్న లాస్య, నందు.. ఏమీ తెలియనట్టు ఆస్తి కలిసిరావడం ఏంటి అని అడుగుతుంది. తర్వాత.. ఆస్తి విషయం గురించి మనం ఎవరం తులసికి చెప్పం కానీ.. అంకిత చెబితే ఎలా అని అంటుంది లాస్య. అంకితను పిచ్చిదాన్ని చేసి తులసి డబ్బు నొక్కేస్తుంది. అసలే అవసరాల్లో ఉంది అని అంటుంది గాయత్రి. దీంతో తులసి ఈ మాటలు విని బాధపడుతుంది.
intinti gruhalakshmi 3 june 2022 full episode
గాయత్రి, లాస్య అన్ని మాటలు అంటుంటే.. నా కొడుకు చూస్తూ నిలబడ్డాడు అని బాధపడుతుంది తులసి. ఇంతలో అంకిత వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు ఆంటి అని అడుగుతుంది అంకిత. దీంతో ఇక్కడే ఉన్నా అంటుంది. ఇక మేము బయలుదేరుతాం అని అంటుంది తులసి. దీంతో అదేంటి.. అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందే అంటుంది అంకిత. ఫంక్షన్ లో జరిగిన దాని గురించి బాధపడుతున్నారా అని అడుగుతుంది అంకిత. నేను అలా అనుకునేదాన్నే అయితే నేను వచ్చేదాన్నే కాదు అంటుంది తులసి. ఇంతలో అభి వచ్చి ఏమైంది అంటాడు. తులసి ఆంటి భోం చేయకుండా వెళ్తాం అంటన్నారు అంటుంది అంకిత. దీంతో భోజనం చేసి వెళ్లొచ్చు కదా మామ్ అంటాడు అభి. నువ్వు అంతగా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించకు. దాని వల్ల ఎక్కువగా లాభం లేదు అని అంటుంది.
ఈ అమ్మ తన బిడ్డలను నిస్వార్థంగా పెంచింది. ఇప్పటికే కాదు.. మీ అమ్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను కోరుకునేది ఒకటే.. నా బిడ్డల సంతోషం.. వాళ్లు ఎదగడం. నీ పుట్టిన రోజు సందర్భంగా నాకు ఒక బహుమతి కావాలి అంకిత.. ఇస్తావా అని అడుగుతుంది తులసి.
ఈ క్షణం నుంచి నువ్వు మా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు అని అంకితకు చెబుతుంది తులసి. నేనంటే నీకు ఎంతో గౌరవం. నా మాటకు విలువ ఇస్తావని తెలుసు అని అంటుంది అంకిత. అదేంటి అని ప్రశ్నిస్తుంది అనసూయ. దీంతో తులసి ఏం మాట్లాడదు. అంకిత ఏడుస్తుంది.
నేనేం తప్పు చేశాను ఆంటి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది అంకిత. తప్పు చేశావని కాదు.. అందరికీ మంచి జరగాలని.. జరుగుతుందని ఆశపడి ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది తులసి. ఎవరి మంచి అని అడుగుతుంది అంకిత. దీంతో అందరికీ అంటుంది అంకిత.
మరోవైపు గాయత్రి అక్కడికి వచ్చి.. ఎందుకే ఏడుపు… పీడ విరగడ అయిందని సంతోష పడక అంటుంది గాయత్రి. పుట్టిన రోజు నాడు ఏడిపిస్తావా.. ఇదేనా నీ పెద్దరికం అని లాస్య అంటుంది. దీంతో నువ్వు ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెబుతుంది తులసి.
ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. కట్ చేస్తే అందరూ అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంటికి వెళ్తారు. తెల్లారాక.. ఎందుకు తులసి అలా ప్రవర్తిస్తుందో అడుగుతారు పరందామయ్య, అనసూయ. కానీ.. తులసి తీసుకున్న నిర్ణయం వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అంటాడు పరందామయ్య.
దీంతో అభి గురించి చెబుతుంది. వాళ్లు నా మీద నిందలు వేస్తుంటే.. అభి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటుంది తులసి. అంకిత వాళ్లకు ఏదో కోట్ల ఆస్తి కలిసివస్తోందట. అది నాకు తెలిస్తే లేని ప్రేమ చూపించి.. ఆ ఆస్తి నొక్కేస్తానట అని చెబుతుంది తులసి.
ఆస్తి వచ్చే విషయం మీ అమ్మకు తెలియనీయొద్దు అని అంటే నా కొడుకు గంగిరెద్దులా తలూపాడు కానీ.. మా అమ్మది పరాయిసొత్తు తీసుకునే మనస్తత్వం లేదు అని నా కొడుకు చెప్పలేకపోయాడు అని అంటుంది తులసి. వాడు జైలు పాలు అవుతుంటే నువ్వే కదా కాపాడింది. ఆమాత్రం ఆలోచించాలి కదా అంటాడు పరందామయ్య.
మరోవైపు తులసికి ఫోన్ చేస్తుంది అంకిత. కానీ.. ఫోన్ కట్ చేస్తుంది తులసి. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తుంది. నేను నీతో మాట్లాడాల్సిందే. ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా కాల్ చేస్తాను అని అనుకుంటుంది అంకిత. మీరు ఎన్నిసార్లు కట్ చేస్తారో చూస్తా అని అనుకుంటుంది.
ఇంతలో అక్కడికి దివ్య వస్తుంది. తన ఫోన్ లాక్కొని కాల్ ఎత్తి స్పీకర్ పెట్టి అక్కడ పెడుతుంది. వదిన.. మామ్ ఇక్కడే ఉంది. నీతో మాట్లాడటం లేదు కానీ.. నువ్వు చెప్పే విషయాలు అన్నీ వింటుంది అంటుంది. దీంతో ఎందుకు నన్ను మీ ఇంటి గడప తొక్కొద్దన్నారు అని అడుగుతుంది అంకిత. అయినా కూడా తులసి ఏం మాట్లాడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.