Home » Entertainment » Intinti Gruhalakshmi 31 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 31 Dec Today Episode : తులసి సేఫ్.. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక తనకు షాక్.. ఇంతలో లాస్య భారీ ప్లాన్.. తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 31, 2021, 12:24 pm
Advertisement

Intinti Gruhalakshmi 31 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 డిసెంబర్ 2021 శుక్రవారం ఎపిసోడ్ 517 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి స్పృహ వస్తుంది. గెలిచానురా అని ప్రేమ్ తో అంటుంది తులసి. మీ సర్జరీ సక్సెస్ అయింద కానీ.. మీరు పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్ చెబుతాడు. నా కుటుంబం కోసం నా కోసం నేను ఖచ్చితంగా కోలుకుంటాను అని చెబుతుంది తులసి. ప్రాబ్లమ్ ఏం లేదు నందు అని డాక్టర్ చెబుతాడు. బిల్లు ఎంతైందో చెబితే నేను కట్టేస్తాను అని అంటాడు నందు. తులసి ప్రస్తుతం పరిస్థితుల్లో బిల్ కట్టడం తన వల్ల కాదు కదా. అందుకే నేను పే చేస్తాను అంటాడు నందు. కానీ.. తులసికి, నాకు డీల్ కుదిరింది. తను ఇన్ స్టాల్ మెంట్స్ ద్వారా పే చేస్తానని చెప్పింది అంటాడు కృష్ణ.

Advertisement

intinti gruhalakshmi 31 december 2021 full episode

తులసికి మీరు ఇప్పటికీ హెల్ప్ చేయాలనుకుంటున్నారు అది గ్రేట్. మీ సహాయం పక్కన పెడితే.. తన పిల్లల సాయం కూడా తీసుకోదు అంటాడు కృష్ణ. తను ఇండిపెండెంట్ గా బతకాలని అనుకుంటోంది అంటాడు కృష్ణ. తులసి సేఫ్ అని తెలియడంతో అందరూ ఖుషీ అవుతారు. అందరూ సంతోషంగా గడుపుతారు. చూశావా.. వీళ్లంతా ఎంత సంతోషంగా ఉన్నారో.. వీళ్లు నిన్ను ఎక్కడ పట్టించుకుంటారు. వీళ్లంతా తులసికి వత్తాసు పలికేవాళ్లు. ఇక నీ వాల్యూ ఎక్కడ ఉంది.. అంటూ లాస్యతో చెబుతుంది భాగ్య. అందరూ తులసికి ఏం కావాలో అని డిసైడ్ చేసుకుంటారు. తులసి డిశ్చార్జ్ అయి రాగానే తనకు ఏం చేయాలా అని అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభిస్తారు.

Advertisement

ఇవన్నీ విన్న లాస్యకు అస్సలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. కానీ.. తన దగ్గరికి వెళ్లకుండా తన తండ్రి అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్తాడు నందు. దీంతో లాస్యకు మరింత కోపం వస్తుంది. బావ గారు కూడా నీ గాలి తీసేశాడు.. అంటుంది భాగ్య.

ఒక ఆడపిల్ల అన్ని వదులుకొని నీకోసమని నీ దగ్గరికి వచ్చింది. నీతో పెళ్లి కోసం లోకానికి శత్రువుగా మారింది. లాస్యను ఇబ్బంది పెట్టకు. నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు. ఆలోచించుకో అంటాడు పరందామయ్య. దీంతో మీరు చెప్పింది నిజమే కానీ.. లాస్య చేసింది ముమ్మాటికీ తప్పు. మీతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. తన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలాగే ఉంటా అంటాడు నందు.

Advertisement

మరోవైపు తులసి డిశ్చార్జ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెబుతాడు డాక్టర్ అద్వైత కృష్ణ. మనల్ని మనం నమ్ముకుంటే ఏదైనా సాధించగలం అన్న మీ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. బతకాలి అనే కోరికను పెంచింది.. అని డాక్టర్ తో తులసి అంటుంది. కానీ.. మీరే నా గురువు. మీ నుంచే నేను చాలా నేర్చుకున్నాను అంటాడు డాక్టర్.

Intinti Gruhalakshmi 31 Dec Today Episode : డిశ్చార్జ్ కాగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన తులసి

డిశ్చార్జ్ అయ్యాక తులసి తిరిగి ఇంటికి వస్తుంది. మీరందరూ ఇచ్చిన ధైర్యమే నేను చావుతో పోరాడి బతికేలా చేసింది అంటుంది తులసి. ఇంతలో తులసి గారంటే మీరేనా అని ఒక వ్యక్తి వస్తాడు. మిమ్మల్ని తీసుకురమ్మని దీపక్ గారు క్యాబ్ పంపించారు అంటాడు. దీంతో ప్రేమ్.. నా సూట్ కేస్ తీసుకొచ్చి కారులో పెట్టించు అంటుంది తులసి.

దీంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకమ్మా.. అంటాడు. దేవుడు పెడుతున్న కొత్త పరీక్షలో నేను నెగ్గగలనో లేదో తెలుసుకోవడానికి అంటుంది. నిజానికి ఆయనకు విడాకులు ఇవ్వగానే నాకు ఈ ఇంటితో రుణం తీరింది. కానీ.. మీకోసం నేను ఇక్కడ ఉన్నాను.

ఇప్పుడు లాస్య ఈ ఇంటి కోడలు. తను ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి రాణి. రాజ్యంతో పాటు ఈ రాజ్యంలో ఉండే హక్కు కూడా నేను కోల్పోయాను. నేను ఇబ్బంది పడుతూ.. తనను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నన్ను తీసుకెళ్లమని దీపక్ కు చెప్పాను అంటుంది తులసి.

Advertisement

కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. వెళ్లడానికి అస్సలు వీలు లేదు అంటారు. నువ్వు వెళ్తా అంటే మేము కూడా ఉండము అని అనసూయ, పరందామయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోబోతారు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి