Intinti Gruhalakshmi 31 Oct Today Episode : నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తా.. అంటూ తులసికి లాస్య వార్నింగ్.. లాస్య బెదిరింపులకు తులసి లొంగుతుందా?

Intinti Gruhalakshmi 31 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ సోమవారం రోజున తిరిగి ప్రసారం అవుతుంది. ఈరోజు ఆదివారం ప్రసారం కాదు. 1 నవంబర్, 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో ఏం ప్రసారం అయితే తెలుసు కదా. ఆఫీసుకు నందు, తులసి, లాస్య వెళ్లగానే ఉద్యోగులు ఎవ్వరూ రారు. దీంతో తులసి షాక్ అవుతుంది. కానీ.. కొంత సేపటి తర్వాత అందరు ఉద్యోగులు వస్తారు. దీంతో తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉద్యోగులు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇంతలో లంచ్ టైమ్ అవుతుంది. ఇంట్లో శృతి ఇచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తులసి తింటూ ఉంటుంది. లాస్య మాత్రం పిజ్జా బుక్ చేస్తుంది. కానీ.. ఆ పిజ్జా చెండాలంగా ఉంటుంది. దాన్ని తినలేకపోతాడు నందు.

intinti gruhalakshmi 31 october 2021 episode highlights

వెంటనే కిందికి వెళ్తాడు. అక్కడ ఉద్యోగులు మాట్లాడుకోవడం వింటాడు. మన బాస్ కు ఏ పనీ చేతకాదురా. కానీ… ఇద్దరు పెళ్లాలను మాత్రం మెయిన్ టెన్ చేస్తున్నాడు. ఆ విషయంలో మాత్రం గ్రేట్ అని అనుకుంటారు. కానీ.. తులసి మేడమ్ మాత్రం అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉంటుంది అని మాట్లాడుకుంటుండగా విన్న నందుకు తీవ్రంగా కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియక కోపంతో తన క్యాబిన్ కు వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లి తులసి మీద సీరియస్ అవుతాడు. అసలు.. నేను దేనికీ పనికిరానట. ఇంట్లో వాళ్ల ముందే కాదు.. ఆఫీసులో ఉద్యోగుల ముందు కూడా నా పరువు తీసింది తులసి అని ఇంట్లోని అందరినీ పిలిచి తులసిపై సీరియస్ అవుతాడు నందు. ఈనెల నుంచి నేనే జీతాలు ఇస్తాను. ఇక నుంచి నేనే మీకు బాస్ ను అన్నట్టుగా వ్యవహరిస్తోంది తులసి. ఇక నుంచి నేనే బాస్ ను అని ఉద్యోగుల ముందు నా పరువు తీసింది అని చెబుతాడు నందు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు.

Intinti Gruhalakshmi 31 Oct Today Episode : నాకు ప్రాజెక్టుతో సంబంధం లేదన్న నందు

ఇక నుంచి ఆ ప్రాజెక్టుతో కానీ.. ఆ కంపెనీతో కానీ.. నాకు ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ నువ్వే చూసుకోవాలి. నేను ఇక నుంచి ఇన్వాల్వ్ అవ్వను. నువ్వు ప్రాజెక్ట్ చేస్తావా? చేయవా? అనేది నాకు సంబంధం లేదు. ఫైన్ కట్టలేకపోతే జైలుకు వెళ్తాను అని చెబుతాడు నందు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు.

intinti gruhalakshmi 31 october 2021 episode highlights

మరోవైపు లాస్య.. తులసికి వార్నింగ్ ఇస్తుంది. కిలకిలా నవ్వుతున్న నీ వాళ్లు త్వరలోనే తలోదిక్కుకు వెళ్లిపోతారు అని అంటుంది లాస్య. ఇంకాసేపట్లో నందు తన రెండు కోట్ల పెనాల్టీని తనే కట్టబోతున్నాడు అంటుంది లాస్య. తనేంటో నిరూపించుకోబోతున్నాడు. అప్పుడు ఇంట్లో అందరూ నందుకే జైకొడతారు అని అంటుంది లాస్య. గొప్పలు చెప్పిన నిన్ను బయటికి పంపిస్తారు అంటుంది లాస్య. బయటికి నెట్టేది నన్ను కాదు.. నిన్ను అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

Drinking Beer Whiskey : విస్కీ, బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే… ఇక అంతే సంగతులు… మీ ప్రాణానికే ముప్పు, జాగ్రత్త…?

Drinking Beer, Whiskey : మద్యం తాగే ప్రతి ఒక్కరికి తాగేటప్పుడు స్టఫింగ్ వారికి మజా. మద్యం తాగుతూ, దానిలోనికి…

2 hours ago

Chayote For Cancer : చూడడానికి అచ్చం జామకాయలాగే ఉన్నా…. దీని పోషకాలు అమోఘం… ప్రమాదకర వ్యాధులు పరార్…?

Chayote For Cancer : ఇది చూసి అచ్చం జామ పండులా ఉంది అనుకునేరు...ఇది జామ పండు అస్సలు కాదు.…

3 hours ago

Carrots : ప్రతిరోజు రెండు క్యారెట్లను ఇలా తిని చూడండి… శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్ పడుతుంది…?

Carrots : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా రెండు క్యారెట్లను తింటూ ఉండాలి. రోజుకు కనీసం రెండు…

4 hours ago

Dairy Farm Business : డైరీ ఫామ్ బిజినెస్.. లాభం ల‌క్ష‌ల‌లో.. వారి ఆలోచ‌న‌కి అవార్డులు..!

Dairy Farm Business : రైత‌న్న ఆలోచ‌న‌లు మారాయి. స‌రికొత్త‌గా బిజినెస్ అభివృద్ది చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. తాజాగా డైరీ…

5 hours ago

Health Benefits of Coffee : మీరు దీనిని ప్రతిరోజు తాగుతారు.. కానీ దీని ప్రయోజనాలు… తెలుసుకోండి…?

Health Benefits of Coffee : మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తమ అభిరుచులను అలవర్చుకుంటూ ఉన్నారు.…

6 hours ago

Jyotishyam : మే మాసం చివరి నుంచి శుక్రుడు అనుగ్రహంతో… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…?

Jyotisyam : శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు వాటి గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులలోకి…

7 hours ago

Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్… నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..!

Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు షాక్ ఇచ్చింది.…

16 hours ago

Actor Wife : చాలా అమ్మా.. భ‌ర్త‌తో విడాకులు.. నెల‌కి రూ. 40 ల‌క్ష‌లు భ‌ర‌ణం కావాల‌ట‌..!

Actor Wife : ప్రముఖ తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తిల విడాకుల కేసు గ‌త కొద్ది…

17 hours ago