intinti gruhalakshmi 4 december 2021 full episode
Intinti Gruhalakshmi 4 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 డిసెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 494 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిపోర్ట్స్ తీసుకొని ప్రేమ్.. తులసి దగ్గరికి వస్తాడు. రిపోర్ట్స్ తనకు చూపిస్తాడు. అందులో అన్నీ ఫన్నీ ఎమోజీలు ఉంటాయి. ఏంటిది అంటుంది తులసి. ఒరేయ్.. ఏంట్రా ఒక పక్క టెన్షన్ గా ఉంటే ఏంట్రా తమాషాలు. రిపోర్ట్ లో ఏముందో చెబుతావా లేదా? అంటుంది తులసి. నిజం చెబుతున్నానమ్మ నీకు ఏ ప్రాబ్లమ్ లేదు అంటాడు ప్రేమ్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ.. ప్రేమ్ చెప్పేది అబద్ధం అనేది ఒక్క నందుకు మాత్రమే తెలుసు. తులసికి గర్భాశయ క్యాన్సర్ వచ్చిందని కేవలం నందు, ప్రేమ్ కు మాత్రమే తెలుసు.
intinti gruhalakshmi 4 december 2021 full episode
ఇంతలో తులసికి కడుపులో నొప్పి వస్తుంది. భరించలేనంత నొప్పి వస్తుంది. ఏమైంది అని అంటారు. ప్రేమ్ ఆటపట్టించినట్టే.. తులసి కూడా ఆటపట్టిస్తుంది. ఊరికే.. అలా నటించానని చెబుతుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. నాకేం ప్రాబ్లమ్ లేదు. నవ్వుతూ ఉంటే చాలు అని డాక్టర్ చెప్పారని అన్నావు కదా. మరెందుకురా ఇంత కంగారు పడుతున్నావు. నువ్వు నిజం చెబుతున్నావా లేక అబద్ధం చెబుతున్నావా అని అడుగుతుంది తులసి. చెప్పరా.. నాకేం ఇబ్బంది లేదు కదా అంటుంది తులసి. దీంతో నీకు అబద్ధం చెప్పే ధైర్యం నాకెక్కడుందమ్మా అంటాడు ప్రేమ్. నా చుట్టూ నా వాళ్లంతా ఉన్నంత కాలం నాకెలాంటి సమస్య ఉండదు అంటుంది తులసి. ఎందుకురా ఆ కన్నీళ్లు కడుపులో నొప్పి అన్నాననా అంటుంది. ఇంకెప్పుడూ సరదాకు కూడా అలా చెప్పను. ఎవ్వరినీ బాధపెట్టను సరేనా అంటుంది తులసి.
దీంతో ప్రేమ్ తట్టుకోలేకపోతాడు. తనను హత్తుకుంటాడు. అమ్మ అంటూ గుక్కపెట్టి ఏడుస్తాడు. తర్వాత కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా, సరదాగా కాసేపు గడుపుతారు. కానీ.. ఒక్క నందు మాత్రం బాధతో ఉంటాడు. ప్రేమ్ కూడా లోపల బాధపడుతూ బయటికి నవ్వుతున్నట్టు కనిపిస్తాడు.
ఈరోజు వరకు నీకు నేను బాధను మాత్రమే ఇచ్చాను. ఇక నుంచి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను. ఏది ఏమైనా సరే.. దాని కోసం ఏదైనా చేస్తాను. నువ్వు బాగుండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు బతకాలి తులసి అని తనలో తాను అనుకుంటాడు నందు.
కట్ చేస్తే.. తులసి ఫోన్ లో ఫ్యాక్టరీ విషయాల గురించి మాట్లాడుతుంటుంది. ఎక్స్ పోర్ట్ లో, కుట్టే బట్టల్లో ఎటువంటి సమస్యలు రాకూడదు అంటుంది తులసి. ఎవరికమ్మా క్లాస్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు ప్రేమ్. నా భయం నాకు ఉంటుంది కదరా.. అంటుంది తులసి.
సరే.. కానీ.. నిన్ను ఇప్పుడు ఒకరి ఇంటికి తీసుకెళ్తున్నాం. నువ్వంటే ఇష్టమైన వాళ్లు కానీ.. నువ్వు వాళ్లను తరుచూ కలుసుకోవు.. అంటాడు ప్రేమ్. ముందు నువ్వు కళ్లు మూసుకొని కళ్లు తెరవమనే దాకా తెరవద్దు. అక్కడికి వెళ్లాక నేను కళ్లు తెరవమన్నప్పుడు తెరవాలి అంటాడు ప్రేమ్. సరే.. పదా అంటుంది తులసి.
తులసిని నడిపించుకుంటూ ఒక ఇంటికి తీసుకెళ్తాడు. ఎవరి ఇల్లు అది అంటుంది తులసి. ఇది మా అమ్మ ఇల్లు. నీకు ఇష్టమైన వ్యక్తివి నువ్వే అమ్మ. కానీ.. నీ గురించి నువ్వు ఎప్పుడూ పట్టించుకోవు. నీకు నువ్వు ఎప్పుడూ అపరిచితురాలివే అంటాడు ప్రేమ్.
కనీసం ఈ ఇంట్లో అయినా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి పట్టించుకో అంటాడు ప్రేమ్. నేను చిన్నతనం నుంచి చూస్తున్నా.. నువ్వు ఎప్పుడూ బానిసలా బతుకుతున్నవు. అది నాకు ఇష్టం లేదు. మా అమ్మకంటూ ఒక సొంతమైన ఇల్లును నిర్మించాలనుకున్నా.. కనీసం ఈ కాటేజ్ ను కొన్ని రోజులు అయినా నీ ఇంటిగా అనుకొని ప్రశాంతంగా ఉండు అంటాడు ప్రేమ్.
తర్వాత అందరూ కలిసి ఆ ఇంట్లో సరదాగా గడుపుతారు. అందరూ ఆడిపాడుతారు. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా మొదటిసారి గడుపుతారు. అందరూ కలిసిపోతారు. తర్వాత నందుతో కలిసి తులసి సరదాగా గడుపుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.