Intinti Gruhalakshmi 4 July Today Episode : లాస్య కాపురం ఆగం.. తులసిని మోసం చేసిందని లాస్యకు నందు విడాకులు.. చీటర్ అంటూ ఇంట్లో నుంచి గెంటివేత

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 4 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 675 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి చెప్పిన అడ్రస్ కు పరిగెత్తుకుంటూ వస్తారు లాస్య, భాగ్య. తులసి చెప్పిన అడ్రస్ ఇదేనా అని భాగ్యను అడుగుతుంది. దీంతో ఇదే అంటుంది. కానీ.. చూడటానికి ఇది బూతు బంగ్లాలా ఉంది అని అంటుంది లాస్య. ఒకవేళ ఎవరికీ కనిపించకూడదని రంజిత్ దాక్కున్నాడేమో అంటుంది భాగ్య. కానీ.. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అంటుంది లాస్య. ప్రాబ్లమ్ వచ్చింది కదా.. అందుకే.. ఎవరికీ కనిపించకూడదు అని రంజిత్ ఇక్కడ దాక్కొని ఉంటాడు అంటుంది భాగ్య. దీంతో పాయింటే అని అనుకొని బంగ్లా లోపలికి ఇద్దరూ వెళ్తారు. భయపడుతూనే ఆ బంగ్లా లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇంతలో తులసి, అంకిత, దివ్య.. ముగ్గురూ ముందే ఆ బంగ్లా లోపలికి వెళ్లి దాక్కుంటారు. లాస్య, భాగ్య కోసం ఎదురు చూస్తుంటారు.

Advertisement

intinti gruhalakshmi 4 july 2022 full episode

ఇందులో దెయ్యాలు ఉంటాయేమోనని భయపడుతుండటంతో వీళ్లను మనం మరింత భయపెడదాం అని తులసి చెబుతుంది. దీంతో వాళ్ల చాటుగా వెళ్లి వింతగా అరుస్తారు దివ్య, అంకిత. దీంతో లాస్య, భాగ్యకు చాలా భయం వేస్తుంది. లాస్య ఒక పని చేయి.. గట్టిగా రంజిత్ అని పిలువు.. అప్పుడు ఇక్కడే ఉంటే పలుకుతాడు కదా అంటుంది భాగ్య. నీ మొహం.. ఎవరో అనుకొని ఇక్కడి నుంచి పారిపోతాడు వద్దు అంటుంది లాస్య. ఇంతలో తులసి వాళ్ల అరుపులు ఎక్కువవడంతో వెనక్కి వెళ్లిపోదాం లాస్య అంటుంది భాగ్య. సరే భాగ్య.. నువ్వే భయపడుతున్నావు కాబట్టి వెళ్లిపోదాం అంటుంది లాస్య. పదా అంటూ వెళ్లిపోతుండగా డోర్ లాక్ అవుతుంది. ఇంతలో వాళ్లకు తులసి, అంకిత, దివ్య ముగ్గురు కనిపిస్తారు. దూరం నుంచి వాళ్లు సరిగ్గా కనిపించరు. తర్వాత వాళ్ల ముందుకు వస్తారు తులసి వాళ్లు.

Advertisement

తులసి, దివ్య, అంకితను చూసి లాస్య, భాగ్య షాక్ అవుతారు. హమ్మయ్య దెయ్యాలు కాదు అంటుంది భాగ్య. దీంతో అంతకంటే ఎక్కువ అంటుంది లాస్య. ఈ ఇల్లు అమ్మకానికి వస్తే చూడటానికి వచ్చాము అంటుంది భాగ్య. మీరు అందుకే వచ్చారా అంటుంది భాగ్య.

దీంతో కాదు.. మీరు ఏం చేస్తున్నారో చూద్దామని మీ వెనుకే ఎప్పటి నుంచో వస్తున్నాం అంటుంది తులసి. ఇంతకీ కనిపించాడా అంటుంది తులసి. దీంతో ఎవరు ఈ ఇంటి ఓనరా అని అడుగుతుంది భాగ్య. కాదు.. మీ చెంచా గాడు రంజిత్ అంటుంది తులసి. దీంతో రంజిత్ ఎవరు అక్కడ పేరు ఎప్పుడూ వినలేదే అంటుంది భాగ్య.

Intinti Gruhalakshmi 4 July Today Episode : నందుకు ఈ విషయం చెబుతా అంటూ లాస్యను బెదిరించిన తులసి

దీంతో మీ లాస్య ఫోన్ లో చూడు.. వాడి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అంటుంది తులసి. అవునా అంటుంది భాగ్య. వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడి సంబంధం లేని విషయంలో మనల్ని ఇరికించాలని చూస్తున్నారు. పదా వెళ్దాం అని అంటుంది లాస్య. దీంతో ఆగండి అంటుంది తులసి.

మీరు ఇక్కడికి రాకముందే.. రంజిత్ ను నావాళ్లు తీసుకొచ్చేశారు. ఇప్పుడు వాడు నా దగ్గరే ఉన్నాడు. మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. నా డబ్బును మోసం చేసి తీసుకొని నందుతో బిజినెస్ పెట్టించావు. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో ఎదిగిపోయావు అవునా అంటుంది తులసి.

ఇప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్లి మీరు బిజినెస్ లో పెట్టిన డబ్బు నాది అంటూ నిజం చెప్పేస్తే.. మీ భార్యాభర్తల బంధానికి సమాధి కడతారు అంటుంది తులసి. భాగ్యను బెదిరించి నోరు మూయించడం కాదు.. నా నోరు మూయించలేవు నువ్వు. వజ్రాయుధం నా చేతుల్లో ఉంది అంటుంది తులసి.

మీ నందు ముందు ఈ తులసి నోరు విప్పకుండా ఉండాలంటే 24 గంటల్లోపు నా అకౌంట్ లో 20 లక్షలు ఉండాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇది మన డీల్. నావి ఉత్తుత్తి బెదిరింపులు అని అనుకుంటే మాత్రం నీకే నష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

కట్ చేస్తే శృతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తుంటుంది. దీనంగా ప్రేమ్ ఇంటికి వస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది శృతి. దీంతో ఎందుకు సరుకులు అయిపోయాయా.. తీసుకురావాలా అంటాడు. దీంతో నీకో గుడ్ న్యూస్ అంటుంది.

వెంటనే ఆ పాంప్లెట్ ను ప్రేమ్ కు చూపిస్తుంది. కానీ.. ప్రేమ్ మాత్రం ఏం మాట్లాడుకుండా అక్కడి నుంచి లేస్తాడు. దీంతో ఏమైంది అని అడుగుతుంది. వెంటనే కాంపిటీషన్ కోసం పేరు రిజిస్టర్ చేసుకోవాలి అని అడుగుతుంది. దీంతో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు ప్రేమ్.

కాళ్లు లేని వాడిని ఎంత ఎంకరేజ్ చేసినా పైకి ఎగరలేడు అంటాడు ప్రేమ్. నువ్వు కాంపిటిషన్ లో స్క్రీన్ టెస్ట్ లో సెలెక్ట్ కావేమోనని భయపడుతున్నావా. నువ్వు విన్నర్ అవుతావు.. నాకు నమ్మకం ఉంది అంటుంది శృతి. దీంతో నమ్మకం ఉండాల్సింది నీకు కాదు.. నాకు అంటాడు ప్రేమ్.

దీంతో కాంపిటిషన్ లో ఎంట్రీ దొరుకుతుందో లేదో.. అని టెన్షన్ పడకు. నీ పేరును ఎంట్రీ లిస్ట్ లో ఇన్ క్లూడ్ చేస్తా అన్నారు పక్కా అంటుంది శృతి. దీంతో నాకు సంబంధించిన విషయాల్లో నన్ను అడగకుండా నువ్వే ఇన్వాల్వ్ అవుతున్నావా అని అంటాడు ప్రేమ్.

దీంతో ఎందుకు నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అని అంటుంది శృతి. కట్ చేస్తే భాగ్య, లాస్య ఇద్దరూ ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు నందు. దీంతో చిరాకుగా ఉంది తర్వాత మాట్లాడుతా అంటుంది లాస్య. దీంతో అదేంటి లాస్య అలా మాట్లాడుతున్నావు. రేపటి నుంచి బిజినెస్ లో బిజీ అయిపోతాను. ఈరోజు సరదాగా బయటికి వెళ్దాం అన్నా కదా అంటాడు నందు.

ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు అంటాడు నందు. దీంతో చూడు నందు.. అంటూ అసలు విషయం మొత్తం నందుకు చెప్పేస్తుంది. తులసిని మోసం చేసి నేను డబ్బును నీ బిజినెస్ కోసం ఇచ్చాను అంటుంది. మరోవైపు లాస్యకు ఫోన్ చేస్తుంది తులసి. నా అకౌంట్ లో 20 లక్షలు పడ్డాయి అని చెప్పడానికి పోన్ చేశా అంటుంది తులసి.

నేను వేయలేదు అని షాక్ అవుతుంది లాస్య. ఆ డబ్బులు వేసింది నేనే అంటాడు నందు. నువ్వు చీటర్ వి అంటాడు. ఇక నుంచి నీతో కలిసి కాపురం చేసేది లేదు అంటాడు నందు. నీ బతుకు నీది.. నా బతుకు నాది అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

13 hours ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

2 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

2 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

2 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

2 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

3 days ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

3 days ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

3 days ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

3 days ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

3 days ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

3 days ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

3 days ago