Home » Entertainment » Intinti Gruhalakshmi 4 June 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 4 June Today Episode : లాస్యకు తులసి సీరియస్ వార్నింగ్.. అభికి దగ్గరవడానికి ప్రయత్నించిన తులసి.. కానీ.. అభి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: June 4, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 4 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 650 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు వెళ్లమని బలవంతం చేస్తేనే నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను అని అంకిత.. తులసితో ఫోన్ లో చెబుతుంది. నేను మీ మాట విన్నందుకు మీరు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా ఆంటి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తులసి. మరోవైపు దివ్య కూడా తులసికి సలహా ఇస్తుంది. వదినను ఏడిపించొద్దు. వదిన మంచిది మామ్.. చాలా మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. నన్ను క్షమించు అంకిత. నీ జీవితం నా జీవితంలా కాకూడదని నువ్వు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఈ గడప తొక్కడం నాకు కాదు.. మీ వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదని నువ్వు ఈ ఇంటికి వస్తే నీ భర్తతో నీ కాపురం చెడిపోయే అవకాశం ఉంది. అందుకే నా వైపు నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాను అని మనసులో అనుకుంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 4 june 2022 full episode

కట్ చేస్తే తులసికి రోడ్డు మీద తారసపడుతుంది లాస్య. తనను వెళ్లకుండా ఆపుతుంది లాస్య. నిన్న ఫంక్షన్ అయిన తర్వాత అయినా అర్థం అయిందా తులసి. నేను ఏదంటే అది సాధిస్తానని అంటుంది లాస్య. దీంతో మీరు నన్ను ఫంక్షన్ కు రావద్దనుకున్నారు కానీ.. అంకితే నన్ను పిలిచింది. నేను తెచ్చిన చీరే కట్టుకుంది. కేక్ కూడా ముందు నాకే పెట్టింది. ఇది చాలదా నేను ఏం సాధించానో తెలియడానికి.. అని లాస్యతో తులసి అంటుంది. దీంతో సాధించావు కానీ.. శాశ్వతంగా నువ్వు నా ఇంటి గడప తొక్కొద్దు అని అంకితకు వార్నింగ్ ఇచ్చావు కదా. ఇక.. నీ కోడలు, కొడుకు ఇద్దరూ నీకు శాశ్వతంగా దూరం అయినట్టే ఇక అంటుంది లాస్య. నేను తలుచుకుంటే ఈ క్షణమే నా కొడుకు, కోడలును నా ఇంటికి రప్పించుకోగలను.. అర్థం అయిందా. మీ వంకర బుద్ధులను కాస్త తగ్గించుకోండి అని లాస్యకు వార్నింగ్ ఇస్తుంది తులసి.

Advertisement

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తిన్నాక ఎప్పుడూ వాళ్ల మూతి కూడా కడగలేదు మీ శ్రీవారు. నిన్న ఫంక్షన్ లో మాత్రం మీ ఆయన అభిని తెగ రాసుకు పూసుకు తిరిగాడు అంటుంది అంకిత. నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావు తులసి అంటుంది లాస్య.

దీంతో అంకితకు ఇంత ఆస్తి కలిసి వస్తుందని నేను ఊహించుకున్నానా అంటుంది తులసి. నీ కళ్ల ముందే నేను తాళి కట్టించుకున్నాను. నువ్వేం చేశావు.. నీ వాళ్లందరూ ఒక్కొక్కరూ నీకు దూరం అవుతారు. నీ సామ్రాజ్యం కూలిపోతుంది. ఒంటరి పక్షిలా మిగిలిపోతావు. జరిగింది తలుచుకొని ఒంటరి పక్షిలా మిగిలిపోవడం తప్ప ఏం చేయలేవు అని అంటుంది లాస్య.

Advertisement

Intinti Gruhalakshmi 4 June Today Episode : ప్రేమ్ ను మోటివేట్ చేసిన శృతి

ఈ సారి ఆ తప్పు జరగదు. నా భర్తను నాకు దురం చేసినప్పుడు ఆ బాధను మౌనంగా భరించాను. ఎందుకంటే ఆ మోసంలో నా భర్త పాత్ర కూడా ఉంది కాబట్టి. నష్టపోయింది భార్యగా నేను ఒక్కదాన్నే కాబట్టి. ఈ సారి అలా కాదు. తన పిల్లలకు ఏమైనా జరిగితే తల్లి ఊరుకోదు. తల్లిని తక్కువ అంచనా వేయకు లాస్య అంటుంది తులసి.

మరోవైపు ప్రేమ్.. పార్టీలో నందు చేసిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. శృతి కూరగాయలు కోస్తూ ఉంటుంది. ప్రేమ్ అలా దీనంగా ఉండటం చూసి ఏమైందో అని అనుకుంటుంది. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు.. అని అడుగుతుంది.

దీంతో చుట్టూ నావాళ్లు ఉన్నారు కానీ.. ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. ఎవ్వరూ నాతో మనస్పూర్తిగా మాట్లాడలేదు అంటాడు ప్రేమ్. నాతో మాట్లాడటానికి కూడా మా అమ్మ ఇష్ట పడటం లేదు. అంత పాపం చేశానా అంటాడు ప్రేమ్. దీంతో ప్రేమ్ దగ్గరికి వచ్చిన శృతి.. బాధపడకు ప్రేమ్.. ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి అనురాగ దేవత కడుపులో పుట్టావు అంటుంది శృతి.

ప్రేమ్ బాధపడకుండా ఉండేందుకు తనను మోటివేట్ చేస్తుంది శృతి. ఏం చేయాలన్నా చేతుల్లో డబ్బు ఉండాలి కదా. సొంతంగా ఒక ఆల్బమ్ చేస్తే అప్పుడు అవకాశాలు వస్తాయి అంటాడు ప్రేమ్. కాకపోతే.. ఆ ఆల్బమ్ చేయాలంటే 5 లక్షలు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి. అంత పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తాం అంటాడు ప్రేమ్.

Advertisement

మరోవైపు అభిని కలవడానికి రమ్మంటుంది తులసి. కొడుకును చూడటం.. కొడుకుతో మాట్లాడటం కంటే సంతోషం అమ్మకు ఇంకేం ఉండదురా అంటుంది తులసి. రాత్రి పార్టీలో జరిగిన విషయాల గురించి నేను ఏం అడగను సరేనా అంటుంది తులసి.

మామ్ తో ఆచి తూచి మాట్లాడాలి అని అనుకుంటాడు అభి. తర్వాత బాక్స్ తీసుకొచ్చి అందులో ఉన్న లడ్డులను తినమంటుంది తులసి. దీంతో అభి వాటిని తింటాడు. తింటుండగా తనకు పొర పోతుంది. దీంతో వాటర్ ఇచ్చి తాగమంటుంది.

తర్వాత మీ అత్త గారు తలుచుకున్నారేమో… అంటుంది. ఇంతలో అభికి ఫోన్ చేస్తుంది గాయత్రి. మాట్లాడు పర్లేదు.. అంటుంది తులసి. నీకు ఆస్తి కలిసి వస్తోంది సంతోషం అంటుంది తులసి. దీంతో ఈ విషయం మామ్ కు ఎలా తెలిసింది అంకిత చెప్పిందా అని అనుకుంటాడు అభి.

దీంతో ఈ విషయం నాకు అంకిత చెప్పలేదు అంటుంది తులసి. నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. అది దగ్గరయిన బంధాలను దూరం చేస్తుంది. దూరం చేసిన బంధాలను దగ్గర చేస్తుంది అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి