intinti gruhalakshmi 6 january 2022 full episode
Intinti Gruhalakshmi 6 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ హైలైట్ప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటి మీద హక్కు పూర్తిగా నీదే అని నాన్న గారు చెప్పడంతో నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది.. అని తులసితో నందు అంటాడు. ఆ తర్వాత తులసి చాలా విషయాలు పట్టించుకోవడం మానేస్తుంది. నందు, లాస్య.. ఇద్దరూ ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతారు. కానీ.. తనకు ఇంటర్వ్యూ తొందరగా ఉండటంతో లాస్య కారు తీసుకొని త్వరగా వెళ్లిపోతుంది. దీంతో నందుకు ఎలా వెళ్లారో అర్థం కాదు. మరోవైపు ఫ్యాక్టరీకి బయలుదేరుతుంది తులసి. లంచ్ బాక్స్ తీసుకొని తన స్కూటీ మీద వెళ్లబోతుంది. క్యాబ్ బుక్ చేస్తుంటే అది బుక్ కాదు. దీంతో తులసిని వెళ్లి అడుగు.. అని చెబుతారు అనసూయ, పరందామయ్య. దీంతో వెళ్లి తులసిని లిఫ్ట్ అడిగేందుకు మొహమాట పడతాడు నందు. దీంతో ఏమైంది.. లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది తులసి. లాస్య మిమ్మల్ని వదిలేసిందా.. అని అడుగుతుంది. అంటే.. కారులో తీసుకెళ్లకుండా వెళ్లిందా.. అని అంటుంది.
intinti gruhalakshmi 6 january 2022 full episode
నేను నడపనా అంటాడు నందు. నా జీవితాన్ని, నా బండిని ఇంకొకరి చేతుల్లో పెట్టే ఉద్దేశం నాకు లేదు. రండి.. కూర్చొండి అని నందును తీసుకెళ్తుంది తులసి. తన ఆఫీసు దగ్గర ఆపుతుంది. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యారా అని అడుగుతుంది తులసి. పాతికేళ్ల అనుభవం.. ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. మరోవైపు అంకిత.. అంకిత అంటూ వస్తాడు అభి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి అంటాడు. నాకు అర్జెంట్ గా 50 వేలు కావాలి.. అంటాడు. ఒక ఫ్రెండ్ దగ్గర లోన్ తీసుకున్నాను. ఈరోజే తిరిగి ఇవ్వాలి. వాడు చాలా ప్రెజర్ పెడుతున్నాడు.. అని అంటుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు. ముందు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు. నీ దగ్గర ఉన్న గోల్డ్ ఇస్తావా.. ప్రస్తుతానికి ఈ గండం నుంచి గట్టెక్కుతాం.. అంటాడు. దీంతో తన నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టుకో అని చెబుతుంది అంకిత. కాకపోతే పండక్కి ముందే తెచ్చి ఇవ్వాలి అని చెబుతుంది అంకిత. మరోవైపు నందు ఇంటర్వ్యూకు అటెండ్ అవుతాడు.
తన ఫైల్ చూస్తాడు. మిస్టర్ నందు. మీ ఫైల్ కాసేపు పక్కన పెడదాం. నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు కావాల్సింది యువ రక్తం. యంగ్ స్టర్స్ కొత్త ఐడియాలతో కంపెనీని అభివృద్ధి చేయాలని అనుకుంటారు.. మీరు వెళ్లిపోవచ్చు అని చెబుతాడు.
దీంతో.. ఆవేశం మాత్రమే పనికిరాదు. దానికి అనుభవం కూడా తోడుండాలి.. 46 ఏళ్ల ఒక మహిళ నాకు తెలుసు. తను పెద్దగా చదువుకోలేదు. తన జీవితం మొత్తం 4 గోడల మధ్యే గడిపేసింది. ఇప్పుడు తను ఒక ఫ్యాక్టరీని ఎండీ. ఎంతో నేర్చుకొని ఇప్పుడు గొప్పగా బిజినెస్ రన్ చేస్తుంది అంటాడు నందు. అయినప్పటికీ.. ఇంటర్వ్యూయర్ ఒప్పుకోడు.
దీంతో నందు ఆఫీసు నుంచి బయటికి వచ్చేస్తాడు. లాస్యకు ఫోన్ చేస్తాడు కానీ.. లిఫ్ట్ చేయదు. తనకు అస్సలు బాధ్యత లేదు అంటూ అనుకొని వెనుదిరుగుతాడు నందు. మరోవైపు తులసి ఇంటికి వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చేసి.. అత్తయ్య మీకు టీ తెస్తాను అంటుంది. నందు కూడా అప్పుడే వస్తాడు.
నందు తనకు ఎదురు పడతాడు. కానీ.. ఏం మాట్లాడుకోరు. ఇంతలో లాస్య కూడా వస్తుంది. తలనొప్పి లేస్తుంది టీ తీసుకురా అని అడుగుతాడు నందు. ఏంటి.. ఈ లాస్య నీకు టీ తీసుకొని రావాలా? నేను తులసిలా వెట్టి చాకిరీ చేస్తూ కూర్చోవాలా? అది ఎప్పటికీ జరగదు అని లాస్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.