Home » Entertainment » Intinti Gruhalakshmi 7 July 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 7 July Today Episode : అభి, అంకిత విడిపోనున్నారా? ప్రేమ్ పాటలో పోటీల్లో పాల్గొంటాడా? తనను తాను నిరుపించుకుంటాడా? తులసికి మరో షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: July 7, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 7 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జులై 2022, గురువారం ఎపిసోడ్ 678 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బావ గారు నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఎలా ఉండేదో అని భాగ్య.. లాస్యతో అంటుంది. వామ్మో తులసి మైండే మైండ్. ఎంత తెలివి అంటుంది. ఇక తులసిని పొగడటం ఆపుతావా అంటుంది లాస్య. నీకంటే ఎక్కువ నాకే తులసి మీద చాలా కోపంగా ఉంది. ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని చూస్తున్నా అంటుంది భాగ్య. ఏది ఏమైనా తులసితో జాగ్రత్తగా ఉండాలి. మాజీ మొగుడిని కొంగున కట్టుకున్నా కట్టుకుంటుంది అని లాస్యకు జాగ్రత్త చెబుతుంది భాగ్య. మరోవైపు మళ్లీ ఇది వరకు జాబ్ లోనే జాయిన్ అయ్యాను. ఈరోజు నుంచి రమ్మన్నారు అని తులసికి చెబుతుంది అంకిత. దీంతో సరే మంచి నిర్ణయం తీసుకున్నావు మరి.. అభికి చెప్పావా అని అడుగుతుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 7 july 2022 full episode

దీంతో ఏం మాట్లాడదు అంకిత. అభి నీ శత్రువేమీ కాదు కదా అంటుంది తులసి. అభి మనస్తత్వం నీకు తెలుసు. తనకు లాభం ఉంటుందన్నవైపే వాడు ఉంటాడు. అలా అని వాడు చెడ్డవాడు కాదు. స్వార్థపరుడు అంటుంది తులసి. ఎంత కాదనుకున్నా సంసారాన్ని నిలబెట్టుకునే బాధ్యత భార్యదే అంటుంది తులసి. కలిసి ఉండాలన్న ఆలోచన అభికి కూడా ఉండాలి కదా అంటుంది అంకిత. ఎందుకు లేదు అనుకుంటున్నావు అని అంటుంది తులసి. వాడు నీకోసమే ఎదురు చూస్తున్నాడేమో. మొదటి అడుగు నువ్వే వేయొచ్చు కదా అంటుంది తులసి. తప్పు కాదు అవసరం అంటుంది తులసి. ఈరోజే అభిని కలుస్తాను అని చెబుతుంది అంకిత. దీంతో సరే మంచిది వెళ్లిరా అని చెబుతుంది అంకిత.

Advertisement

మరోవైపు తులసికి ఒక కోరియర్ వస్తుంది. కోరియర్ చూసి షాక్ అవుతుంది. అది అనసూయ పేరు మీద ఉంటుంది. అత్తయ్య మీకు ఏదో కోరియర్ వచ్చింది చూడండి అని అంటుంది. అందులో ఏముందో అని తీసి చూస్తుంది దివ్య. నా జీవితంలో మొదటి సారి నా పేరు మీద కొరియర్ వచ్చింది. అందులో ఏముందో చూడమ్మా.. ఆరాటం ఆపుకోలేకపోతున్నాను అంటుంది అనసూయ.

నానమ్మ ఇందులో ఏదో ఉంది నానమ్మ అంటుంది. నానమ్మ నీకు ఏదో షీల్డ్ గిఫ్ట్ గా వచ్చింది అంటుంది. అమ్మో.. షీల్డే. నాకు షీల్డ్ వచ్చింది.. అంటూ ఎగిరి గంతేస్తుంది అనసూయ. అందులో ఏదో లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ ను చదవడం స్టార్ట్ చేస్తుంది దివ్య.

Advertisement

నానమ్మ గారు నమస్తే.. నా పేరు సతీశ్. నెట్ లో నానమ్మాస్ కిచెన్ లో మీరు పెట్టిన వంటకాలు చూసి ఈ షీల్డ్ పంపకుండా ఆగలేకపోయాను అని అందులో రాస్తాడు. వాడెవడికో నచ్చి షీల్డ్ పంపించడం ఏంటి.. వింతగా ఉంది ఏంటి అని అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 7 July Today Episode : అంకితను అర్థం చేసుకోని అభి

కట్ చేస్తే హాస్పిటల్ కు వెళ్తుంది అంకిత. అక్కడ అభి తన కోసం వెయిట్ చేస్తుంటాడు. మళ్లీ ఎందుకు ఈ చిన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యావు మీ అత్తయ్య గారు చెప్పారా అని అడుగుతాడు అభి. ఎవరో చెబితే నేను చేయను. నాకు నచ్చింది నేను చేస్తాను అంటుంది అంకిత.

అది సరే కానీ నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించావు అని అడుగుతాడు. నువ్వు ఒంటరిగా బతకడం ఇష్టం లేకే.. ఇంటికి రమ్మని.. నచ్చజెప్పమని ఆంటినే చెప్పింది అని అంటుంది అంకిత. దీంతో ఇదంతా ఆమె డైరెక్షనా.. ఆమె కడుపులో పుట్టి ఏం పాపం చేశానో అని అంటాడు.

ఆమె కడుపులో పుట్టడం నీ అదృష్టం అంటుంది అంకిత. నేను ఇష్టపడే వాళ్లు అక్కడ ఎవ్వరూ లేరు. సో… అక్కడ నా వాళ్లు ఎవరూ లేరు అంటాడు అభి. ఆంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు సాయం చేసే స్టేజ్ లో ఉండి కూడా నువ్వు చేయలేదు అని అంటుంది అంకిత.

Advertisement

నువ్వు తెలుసుకొని మారేవరకు మళ్లీ నిన్ను కలవను. నీతో మాట్లాడను. నీ అంతట నువ్వే రావాలి.. ఇక నువ్వు వెళ్లొచ్చు అని అంటుంది అంకిత. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. మరోవైపు ప్రేమ్ పాటల పోటీల కోసం పాట రాస్తూ ఉంటాడు కానీ.. పాట సరిగ్గా రాదు.

ఇంతలో అక్కడికి వచ్చిన శృతి.. ఏంటి పాట రాయడం రావడం లేదా.. ఇలా అయితే కష్టం. ఎప్పుడు ఎదుగుతావు అని అంటుంది. దీంతో నేను ఎదగను. నా వల్ల కావడం లేదు. కాంపిటిషన్ కు వెళ్లనని ఎంత చెప్పినా కూడా ఫోర్స్ చేసి ఒప్పించావు. పాట రాద్దామని ఉదయం నుంచి చూస్తున్నాను కానీ.. 4 లైన్లు కూడా రాయలేకపోయాను అంటాడు ప్రేమ్.

దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్ అంటాడు ప్రేమ్. దీంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది శృతి. ఇంతలో తులసి ఫోన్ చేస్తుంది. శృతిని అడుగుతుంది. ప్రేమ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. బయటికి వచ్చి కూర్చొన్నాను అంటుంది. కానీ.. తన మాటలో ఏదో తేడా ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతుంది తులసి.

ప్రేమ్ మళ్లీ మొదటికొచ్చాడా అని అడుగుతుంది. ప్రేమ్ కాంపిటిషన్ లో పార్టిసిపేట్ చేస్తాడని నాకు నమ్మకం లేదు ఆంటి అని అంటుంది శృతి. పాట రాయడానికి ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు కానీ.. తన వల్ల కావట్లేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రేమ్ ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అంటుంది శృతి.

Advertisement

కట్ చేస్తే.. నందు, లాస్య బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. బిజినెస్ చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయింది అంటాడు నందు. తన ఫ్రెండ్ తిట్టినట్టు చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి