Home » Entertainment » Intinti Gruhalakshmi 8 January 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 8 Jan Today Episode : నందు ఇంట్లో కొత్త పనిమనిషి.. తన కండిషన్లు విని అందరూ షాక్.. లాస్య విషయంలో నందు షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: January 8, 2022, 9:40 am
Advertisement

Intinti Gruhalakshmi 8 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 524 తాజాగా విడుదలైంది. కొత్త పనిమనిషి వస్తే ఇక నందుకు కనీసం ఆ చెత్త తినే అవకాశం ఉండదు కదా అంటుంది తులసి. అవును అని అంటుంది అనసూయ. మరోవైపు అభి తన ఫ్రెండ్ ను కలుస్తాడు. మనోజ్ మంచి పొజిషన్ లో ఉండటం వల్ల ఏం చేయాలో అర్థం కాదు అభికి. తను షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. తను కూడా షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తాడు. మరోవైపు నందు తన ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో ఉద్యోగం వస్తుందా రాదా అని తెగ టెన్షన్ పడుతుంటాడు. తులసిని నేను కాదనుకున్నాను. తులసి కూడా నన్ను కాదనుకుంది. అయినా ఎందుకు ఇంకా తులసి నా మనసులో నుంచి వెళ్లిపోవడం లేదో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 8 january 2022 full episode

ఇంటర్వ్యూలో తులసి గురించి ఉక్రోశంతో తెచ్చానా.. కోరి సమస్యలు తెచ్చుకుంటున్నానా అని నందు అనుకుంటున్న సమయానికి తులసి చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. టీ తేవడంలో నా మనసులో వేరే ఏ ఉద్దేశం లేదు అంటుంది తులసి. ఈ ఇంటి మనిషిగా అర్థం చేసుకొని టీ తెచ్చాను. తీసుకోండి అంటుంది తులసి. ఏమనుకోకపోతే ఒక విషయం చెబుతాను. ఏ విధంగా చూసినా నేను, లాస్య ఒకే ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు. కానీ.. నా చుట్టూ ఉన్న బంధాలు నన్ను ఇక్కడ బంధించాయి. అడుగడుగునా నేను మిమ్మల్ని తప్పించుకొని ఉండలేను. దయచేసి లాస్యను, నన్ను ఏ విషయంలోనూ పోల్చకండి. నేను నచ్చకే కదా.. తనను పెళ్లి చేసుకున్నారు. దీని వల్ల మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. ఏదైనా సమస్య ఉంటే.. మీరు, లాస్య తేల్చుకోండి అంటుంది తులసి.

Advertisement

ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన చికాకుతో అలా మాట్లాడాను తప్పే. కానీ… లాస్య అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా అంటాడు నందు. మీకు ఇంకో విషయం తెలుసా. లాస్య తులసి కాదు.. తులసి లాస్య కాదు. లాస్య తులసిలా మారాలని కోరుకోండి అంటుంది తులసి.

ఉద్యోగం విషయంలో ఏం దిగులు పడకండి. మంచి రోజులు ఎలా శాశ్వతం కావో.. చెడ్డ రోజులు కూడా శాశ్వతం కావు. ధైర్యంగా ఉండాలి. ఒడ్డున కూర్చున్న నాలాంటి వాళ్లు చాలా సలహాలు ఇస్తారు కానీ.. ఈదేవాడికే ఆ బాధ తెలుస్తుంది. నేను ఈ సమాజంతో పోరాడి గెలుస్తున్నప్పుడు మీరెందుకు గెలవకూడదు. మీరు గెలుస్తారు.. గెలవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 8 Jan Today Episode : మళ్లీ ఉద్యోగం పొందేలా నందును మోటివేట్ చేసిన తులసి

నేను ఓడిపోను.. నమ్మకం పోగొట్టుకోను.. అని అనుకుంటాడు నందు. మరోవైపు అభికి ఏం చేయాలో అర్థం కాదు. అభి డిస్టర్బ్ గా ఉండటం చూసిన అంకిత.. ఏమైంది అని అడుగుతుంది. ఎందుకు అలా ఉన్నావు అంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా అంటుంది. దీంతో మన బతుకులు ఇంతేనా.. అవసరం ముందు ఎవడి ముందో చేయి చాచడం.. ఆ అప్పు తీర్చడం కోసం ఎన్నో కష్టాలు పడటం ఏంటి అంటూ అంకితకు చెబుతాడు.

బావిలో కప్పలా ఇన్నాళ్లు ఉన్నానని ఇప్పుడు అర్థం అవుతుంది. నా కాలేజీ ఫ్రెండ్ లైఫ్ లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు. నేను మాత్రం జూనియర్ డాక్టర్ గా చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నాను అంటాడు. కాలంతో పరిగెత్తడం కాదు.. కాలం కంటే స్పీడ్ గా పరిగెత్తడం అని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

కట్ చేస్తే.. ఉదయమే అందరూ టిఫిన్ తింటూ ఉంటారు. ఇంతలో లాస్య వచ్చి నందుకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తుంది. అది కూడా సలాడ్. కుటుంబ సభ్యులు మాత్రం మంచిగా వడ, దోశ తింటూ ఉంటారు. నాకు ఈ పనికిమాలిన టిఫిన్ ఏంటి అంటాడు నందు. దీంతో నాకు ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ చేయడం రాదు అంటుంది లాస్య.

ఇంతలో నేను చేస్తాను అంటూ వస్తుంది వారెవ్వా వసంత. తనే లాస్య ఏర్పాటు చేసిన పనిమనిషి. కాకపోతే తను కొన్ని కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్లు విని అందరూ షాక్ అవుతారు. వసంత నువ్వు పని చేయాల్సింది మా ఇద్దరికే. మిగితా వాళ్లకు పనిచేయాల్సిన అవసరం లేదు.. అంటుంది లాస్య.

Advertisement

సరే అయితే.. నేను వంటింట్లో పడుకోను. నాకు సపరేట్ గా రూమ్ కావాలి. నేను సద్దన్నం తినను. అంటూ తన రూల్స్ విని అందరూ షాక్ అవుతారు. వామ్మో.. ఇదేం పనిమనిషిరా బాబోయ్ అని అందరూ షాక్ అవుతారు. పని కన్నా ఎక్కువ కండిషన్లే ఉన్నాయి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి