Intinti Gruhalakshmi 9 Feb Today Episode : తులసి, అంకిత కలిసిపోవడంతో తన ఫోకస్ ను అభి మీదకు మార్చిన లాస్య.. అభిని ట్రాప్ చేయడం కోసం మరో ప్లాన్

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 9 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 551 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. ఇలా అంకితను మాయ చేస్తుంటూ చూస్తూ ఊరుకుందామా అని ప్రేమ్.. శృతితో అంటాడు. అలా కాదు ప్రేమ్.. మనం అంకిత నుంచి కాదు.. లాస్య ఆంటి నుంచి నరుక్కుంటూ రావాలి. అప్పుడే అంకితకు లాస్య ఎటువంటిదో తెలుస్తుంది అని చెబుతుంది శృతి. మరోవైపు తులసి కాఫీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అంకిత అక్కడికి వస్తుంది. నీకోసమో కాఫీ కలుపుతున్నానమ్మా.. నువ్వు వెళ్లి కూర్చో. ఒక్క నిమిషంలో నేను తీసుకొస్తాను అంటుంది తులసి. కాఫీ కలిపి తీసుకొచ్చి ఇస్తుంది. కానీ.. అంకితకు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.

Advertisement

intinti gruhalakshmi 9 february 2022 full episode

ఏమైంది అమ్మా అని అడుగుతుంది తులసి. నేను లేచేలోపే అన్ని పనులు చేసేశారు. మళ్లీ నేను చేయలేదు అని అంటారు అంటుంది అంకిత. నా బంగారు తల్లి ఎంత మంచిదో. ఆఫీసు పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మళ్లీ ఇంట్లో పనులు కూడా చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. కానీ.. నేను చెడ్డ దాన్ని అవుతున్నాను. నా వల్ల నేను చెడ్డ దాన్ని అవుతున్నాను. నేను ఉండగా నా బంగారు తల్లి చాలా బాధపడుతుంది.. అంటుంది తులసి. నీకు కూడా నా మీద అరిచే హక్కు ఉంది.. అలిగే హక్కు ఉంది. కానీ.. నీ మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా చెప్పొచ్చు. నీలో నువ్వే బాధపడటం ఎందుకు. నిన్ను అర్థం చేసుకునే ఆంటి నీ కళ్లముందే ఉందమ్మా. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నీకు ఇక మీదట కోపం వస్తే నాతో వచ్చి దెబ్బలాడు.. అంతే కానీ నీలో నువ్వే బాధపడకు అంటుంది తులసి.

Advertisement

ఎంత గొడవ జరిగినా.. నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ తగ్గదు. నిన్న రాత్రి కూడా మీ అంకుల్ అయినా నేను అయినా నీ మీద కోప్పడింది.. రావడం లేట్ అయితే ఒక్క మాట చెప్పాల్సింది కదా.. అని అంటుంది. నువ్వు లాస్యతో కలిసి తిరిగినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ.. నువ్వు నువ్వులా ఉండు. కాఫీ తాగు చల్లారిపోతుంది.. అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కాఫీ తాగాక తన రూమ్ కు వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది అంకిత. ఇంతలో లాస్య.. అంకిత దగ్గరికి వస్తుంది. ఏంటి పొద్దున్నే తులసి నీ దగ్గరికి వచ్చి నీ మూడ్ పాడు చేసిందా అని అంటుంది లాస్య. లాస్య మాట్లాడే మాటలకు అంకితకు చాలా చిరాకు వేస్తుంది. నీ చుట్టూ తిరుగుతూ ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది అంటుంది లాస్య.

ఇంతలో అంకిత.. లాస్య మీద చిరాకు పడుతుంది. అసలు.. మీరు ఏం మాట్లాడుతున్నారు. నేను ఏమీ నీ మాయలో పడలేదు. నువ్వు ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా తులసి ఆంటి గురించి మంచిగా మాట్లాడలేదు.

కానీ.. తులసి ఆంటి మాత్రం మీ గురించి ఒక్కటంటే ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేదు. మీరు ఇక మాట్లాడింది చాలు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది అంకిత. మరోవైపు ప్రేమ్ వచ్చి అంకితతో మాట్లాడుతాడు. నీ కొలిగ్స్ తో కంపేర్ చేస్తే నీ పర్ ఫార్మెన్స్ బాగుందని నీ సీనియర్ డాక్టర్ పొగిడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi 9 Feb Today Episode : తులసికి సారీ చెప్పి దగ్గరయిన అంకిత

అంటే.. నిన్ను, నీ కొలిగ్స్ తో పోల్చారు కదా. మరి.. చపాతీల విషయంలో నానమ్మ.. నిన్ను, అమ్మతో పోల్చినప్పుడు మాత్రం నీకు ఎందుకు కోపం వచ్చింది. ఏదో చెప్పాలి అనిపించింది చెప్పాను.. సరే వస్తాను వదిన అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కట్ చేస్తే తులసి.. ఇంటికి హడావుడిగా వస్తుంది. సాయంత్రం కాస్త లేట్ అవుతుంది. పరందామయ్య, అనసూయ అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ల దగ్గరికి వెళ్లి లేట్ అయింది. సారీ అత్తయ్య. వెంటనే ఫ్రెష్ అయి నేను వంట చేస్తా అని చెబుతుంది. దీంతో ఇద్దరూ నవ్వేస్తారు.

ముందు నువ్వు వెళ్లి డైనింగ్ టేబుల్ ను చూడు అంటారు. దీంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ గులాబీ రెక్కలతో సారీ అని రాసి ఉంటుంది. చూస్తే అక్కడ అన్నం, కూరలు అన్నీ వండి ఉంటాయి. వాటిని చూసి తులసి షాక్ అవుతుంది.

ఎవరు వండారు అని అనుకుంటుంది. ఇంతలో అంకిత వచ్చి తనను కౌగిలించుకుంటుంది. సారీ ఆంటి అంటుంది. ఏమ్మా.. కోప్పడు భరిస్తాను. కానీ.. ధ్వేషాన్ని తట్టుకోలేనమ్మా అంటుంది తులసి. దీంతో నాకు కోపం వస్తుంది కానీ.. ధ్వేషించడం నా వల్ల కాదు ఆంటి అంటుంది అంకిత.

సారీ ఆంటి అంటుంది. వర్క్ టెన్షన్ లో నీతోనూ, అమ్మమ్మతోనూ అలా రెస్పాండ్ అయ్యాను అంటుంది. ఇటువంటివి జరుగుతాయి అమ్మా. కామన్ ఇవన్నీ.. అని సర్దిచెబుతుంది తులసి. ఇంతలో అనసూయ కూడా వస్తుంది. సారీ అమ్మమ్మ అంటుంది. నేను కూడా ఇంకోసారి ఇలా చేయను అంటుంది అంకిత.

అప్పుడే లాస్య, నందు వస్తారు. మన తప్పు మనం తెలుసుకోవడం మంచి లక్షణం. చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మంచి లక్షణం.. అంటుంది. చూశావా లాస్య దేవుడు నీకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడో. నువ్వు కూడా ప్రేమతో ఈ కుటుంబానికి దగ్గరవ్వు. తులసికి దక్కిన ప్రేమ నీకు కూడా దక్కుతుంది అంటాడు నందు.

కానీ.. లాస్యకు కోపం వస్తుంది. అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. తన రూమ్ లో ఉన్న ఫ్లవర్ గ్లాస్ పగలగొడుతుంది. అంతలోనే భాగ్య వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. అంకిత పోతే ఏంటి.. అభి ఉన్నాడు కదా. వాళ్ల అమ్మ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. వాడికి ఎర వేయి అంటుంది భాగ్య.

ప్రతి గొడవలోనూ నువ్వు అభి పక్కనే నిలబడు. సపోర్ట్ చేయి. కొద్ది రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. అలా జరగబోతే నన్ను అడుగు అంటుంది భాగ్య. దీంతో లాస్య కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు తులసికి డాక్టర్ ఫోన్ చేస్తుంది. హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది.

ప్రస్తుతానికి బాగానే ఉందండి అంటుంది. కర్తవ్వాన్ని మరిచిపోయి అనుబంధాల దారిలో పడిపోయానని డాక్టర్ సునీత గారు ఫోన్ చేసి ఉంటారు. ఇక నుంచి నా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాను అనుకుంటుంది తులసి. వెంటనే అందరినీ పిలుస్తుంది. ప్రేమ్, అభి.. ఇద్దరినీ జీతం డబ్బులు అడుగుతుంది.

ప్రేమ్ తన డబ్బులు ఇచ్చేస్తాడు. అభి మాత్రం నా డబ్బులు మొత్తం ఖర్చయ్యాయి అంటాడు. దీంతో మొత్తం డబ్బులు ఖర్చు పెడితే నేను కుటుంబాన్ని ఎలా పోషించాలి అంటుంది తులసి. అప్పుడే లాస్య వచ్చి బాగుంది తులసి.. ఇలా అందరి ముందు అభిని అవమానిస్తావా అంటూ అభికి సపోర్ట్ చేస్తుంది.

అభి చిన్నపిల్లాడు కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అంటుంది లాస్య. దీంతో నన్ను.. నా కొడుకును మాట్లాడుకోనివ్వు అంటుంది తులసి. దీంతో అభి నాకు కూడా వరుసకు కొడుకే అవుతాడు అంటుంది లాస్య.. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

1 hour ago

Ambedkar Gurukul Schools : ఈ స్కూల్ లో విద్య వసతి అన్ని ఫ్రీ.. వెంటనే అప్లై చేసుకోండి

Ambedkar Gurukul Schools  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకమైన 'ఏపీ అంబేద్కర్…

2 hours ago

Samantha : రెండో పెళ్లి తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..ఇకపై అందరిలాగానే తాను కూడా ..

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…

3 hours ago

Chicken And Mutton : వామ్మో.. మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Chicken and Mutton  : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara  2026  పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…

4 hours ago

Om Shanti Shanti Shantihi Movie Review : ఓం శాంతి శాంతి శాంతి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…

5 hours ago

Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !

Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…

6 hours ago