Categories: NewsTelangana

Chicken And Mutton : వామ్మో.. మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Advertisement
Advertisement

Chicken and Mutton  : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara  2026  పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే, అక్కడ భక్తితో పాటు ‘బాదుడు’ కూడా భారీగానే ఉంది. జాతరకు వెళ్లిన సామాన్య భక్తుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. నిత్యావసరాలు, మాంసం ధరలు, చివరకు సేద తీరడానికి చెట్టు నీడ కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండటం గమనార్హం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మాంసాహార విందులు, పసందైన వంటకాలు. అమ్మవార్లకు కోళ్లు, మేకలను బలి ఇవ్వడం, అక్కడే వండుకుని తినడం ఆనవాయితీ. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్కడి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. బయట మార్కెట్లో కిలో మటన్ ధర రూ.900 నుండి రూ.1000 వరకు ఉండగా, జాతర పరిసరాల్లో మాత్రం ఏకంగా రూ.1500 వసూలు చేస్తున్నారు. ఇక చికెన్ విషయానికి వస్తే, బయట లైవ్ బర్డ్ కిలో రూ.170 ఉండగా, ఇక్కడ మాత్రం రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఇంతలా మండిపోతున్నా, మొక్కులు తీర్చుకోవాలనే తపనతో భక్తులు తప్పక కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Chicken and Mutton : వామ్మో.. మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Chicken and Mutton : మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Advertisement

Chicken and Mutton  : చెట్టు నీడకు కూడా అద్దె కట్టాల్సిందే

సాధారణంగా జాతరల్లో medaram Jatara 2026  రూమ్స్ కిరాయిలు ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా చెట్టు నీడను కూడా వ్యాపారం చేసేస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులు వంటలు చేసుకోవడానికి, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి దగ్గరలోని తోటల్లోకి వెళ్తున్నారు. అలా తోటల్లోని చెట్ల కింద కూర్చున్నందుకు ఆ తోట యజమానులు ఒక్కో చెట్టుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. నీడ కోసం కూడా ఇంత భారీగా చెల్లించాల్సి రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

Chicken and Mutton : మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Chicken and Mutton: మద్యంపై రూ.100 బాదుడు

ఇక మందు బాబుల పరిస్థితి మరీ దారుణం. జాతరలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే అదనుగా బెల్ట్ షాపుల నిర్వాహకులు, వ్యాపారులు ఎమ్మార్పీ (MRP) కంటే ఒక్కో బాటిల్ పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అడిగితే స్టాక్ లేదు, తెప్పించడానికి ఖర్చవుతుందంటూ సాకులు చెబుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏది?

లక్షల మంది వచ్చే జాతరలో ఇలాంటి నిలువు దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ధరల నియంత్రణ లేకపోవడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. అమ్మవార్ల దర్శనం ఎంతో సంతోషాన్నిచ్చినా, అక్కడ జరుగుతున్న ఈ వ్యాపార దందా మాత్రం భక్తుల మనసు కష్టపెడుతోంది.

Advertisement

Recent Posts

Samantha : రెండో పెళ్లి తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..ఇకపై అందరిలాగానే తాను కూడా ..

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…

37 minutes ago

Om Shanti Shanti Shantihi Movie Review : ఓం శాంతి శాంతి శాంతి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…

2 hours ago

Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !

Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…

3 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…

4 hours ago

Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!

Samsung Galaxy S26  : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…

5 hours ago

Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!

Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…

6 hours ago

Zodiac Signs : 30 జనవరి 2026 శుక్రవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వాళ్ల‌ జీవితంలో అనుకోని మలుపు..!

Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…

7 hours ago