
intinti gruhalakshmi Kasthuri shares her real life facts
intinti gruhalakshmi Kasthuri : సెలబ్రిటీలు చాలా మంది జీవితాలు పైకి చాలా హుందాగా కనిపిస్తాయి. కాని వారి జీవితాలలో చాలా కష్టాలు ఉంటాయి. పలు సందర్బాలలో వాటి గురించి చెబుతూ ఉంటారు. బుల్లితెర ప్రేక్షకులకు కస్తూరీ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గృహలక్ష్మీ సీరియల్ తులసిగా ఫ్యామిలీ ఆడియన్స్కు సుపరిచితురాలు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఎప్పటికప్పుడు తనదైన శైలీలో స్పందిస్తుంటుంది కస్తూరీ శంకర్. స్వతహాగా లాయర్ అయిన కస్తూరీ సామాన్య ప్రజల నుంచి పొలిటికల్, సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటుంది.
ఆ మధ్య తన పిల్లల ఆరోగ్యం, ఆస్పత్రిలో ఉన్న క్షణాల గురించి కస్తూరీ చెప్పి అందరినీ ఏడిపించేసింది. ఇక తాజాగా తన తండ్రి గురించి చెబుతూ అందరినీ కదిలించింది. ఇస్మార్ట్ జోడి షోలో వచ్చిన కస్తూరీ తన తండ్రి చివరి క్షణాలను తలుచుకుంది. మా నాన్న గుర్తుకు వచ్చారండి.. చివరి క్షణాల్లో ఆయన ఒకటే అడిగారు. ఆకలి వేస్తుందిరా అని అన్నాడు. ఆయనకు పార్కిన్ సన్ అనే వ్యాధి వచ్చింది. మెదడు చెప్పే పనులను చేతులు, కాళ్లు ఇలా వినవు. ఆయనకు ఆకలి వేసినా కూడా తినడానికి చేతులు రావు, గొంతు కూడా కదలదు. ఆయన ఆకలిని చివరి వరకు కూడా తీర్చలేకపోయాం.. ఆయన వెళ్లిపోయారు అంటూ కస్తూరీ కంటతడి పెట్టేసింది.
intinti gruhalakshmi Kasthuri shares her real life facts
కస్తూరీ శంకర్ ఈ మధ్య పరంపర అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అందులో కాస్త బోల్డ్ పాత్రను పోషించింది. ఇక సీజన్ 2లోనూ కస్తూరీ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. కాగా, సినీ రాజకీయ క్రీడా విభాగాలపై ఎక్కువ పట్టు ఉన్న కస్తూరీ ప్రతీ అంశం మీద సుధీర్ఘంగా విశ్లేషణ ఇస్తుంటుంది. అనాలిసిస్ చేయడంలో కస్తూరికి ఎక్స్ పీరియన్స్ఉంది. ఆమె స్వతాహాగా న్యాయవాది. అలా సమాజంలోని సమస్యలపైనా స్పందిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలపై కూడా పలుమార్లు ఆమె సెటైర్స్ వేసింది. ఏది ఏమైన ఆమె చెప్పిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.