Home » Entertainment » Intresting News About Lavanya Tripathi
Entertainment

Lavanya Tripathi : అప్పుడే తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన లావణ్య త్రిపాఠి ..!

Authored By
aruna
The Telugu News | Published on: November 8, 2023, 5:00 pm
Advertisement

Lavanya Tripathi : తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు అయ్యాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. కానీ వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఎక్కడా కూడా బయటికి రాలేదు. అంతలా తమ బంధాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక వీరి వివాహం ఇటలీలో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇక తాజాగా నవంబర్ 5 న హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కి చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Advertisement

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు వీరిద్దరికి వెడ్డింగ్ విషెస్ తెలియజేశారు. చూడ చక్కనైన జంట అంటూ, మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏ ఛానల్ లో చూసిన వరుణ్, లావణ్యల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి అయి వారం కూడా కాలేదు లావణ్య త్రిపాఠి తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిందని ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం లావణ్య, వరుణ్ తేజ్ ఇంట్లోనే ఉన్నారు.

అయితే లావణ్యకు తన తల్లిదండ్రులను చూడాలని, అందుకోసం వరుణ్ తేజ్ ను తమ ఇంటికి తీసుకెళ్లమని అడిగారట. అందుకు వరుణ్ తల్లి లావణ్య త్రిపాఠి వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు నిరాకరించారట. దీంతో బాధపడిపోయిన లావణ్య వరుణ్ తో తన బాధను చెప్పుకుందట. ఇక వరుణ్ తన తల్లితో కొంచెం గొడవ పెట్టుకున్నాడట. లావణ్య వాళ్ళ పుట్టింటికి తీసుకొని వెళతానని గట్టిగా చెప్పాడట. దీంతో వరుణ్ తల్లి తన కొడుకు తన మాట వినటం లేదని బాధపడ్డారట. దీంతో తండ్రి కొడుకుల మధ్య లావణ్య త్రిపాఠి అప్పుడే చిచ్చు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి