Home » Entertainment » Intresting News About Naga Chaitanya
Entertainment

Naga Chaitanya – Samantha : నాగ చైతన్య గురించి వెరీ బిగ్ న్యూస్ – సమంత తో డైవర్స్ తరవాత ఇప్పుడు మరొక సంచలనం !

Authored By
aruna
The Telugu News | Published on: July 16, 2023, 7:00 pm
Advertisement

Naga Chaitanya – Samantha : అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వ్యక్తిగతంగా ఆయన తన జీవితంలో ఫెయిల్ అయ్యారు. మనకు తెలిసిందే ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో నాగచైతన్య, సమంత ప్రేమించుకొని కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్నారు. కలిసి నాలుగు సంవత్సరాలు జీవించారో లేదో వెంటనే విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక అప్పటినుంచి సమంతా, నాగచైతన్యల విడాకుల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే వస్తుంది.

Advertisement

ఈ మధ్యకాలంలో నాగచైతన్య వరుస ఫ్లాప్ సినిమాలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఎలాంటి కాంట్రవర్షియల్ కంటెంట్ అయిన టచ్ చేయడానికి సిద్ధపడుతున్నారట. ఈ క్రమంలోనే వేరే కాంట్రవర్షియల్ కంటెంట్ తీసుకోవడం ఎందుకు అని ఆయన లైఫ్లో జరిగిన విడాకులు అంశం తెరపై చూపించాలని డిసైడ్ అయిపోయారట. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఎక్కువమంది సమంతది తప్పు అంటే మరి కొంతమంది నాగచైతన్య ది తప్పు అంటూ బ్లేమ్ చేశారు.

Intresting news about Naga Chaitanya

Advertisement

అయితే వీటన్నిటికి బ్రేక్ పడాలంటే కచ్చితంగా వాళ్ల విడాకుల విషయంలో తప్పు ఎవరిది అన్నది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో నాగచైతన్య తమ విడాకులు సంబంధించిన కంటెంట్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే నాగచైతన్య సినిమాలో మరోసారి విడాకులు తీసుకున్న భర్తగా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదు తెలియాలంటే నాగచైతన్యం తన నెక్స్ట్ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇవ్వాల్సిందే. ఇకపోతే నాగచైతన్య ఇటీవల ‘ కస్టడీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి. దీంతో నాగచైతన్య తదుపరి సినిమాపై మరింతగా ఆసక్తి పెట్టినట్లు తెలుస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి