is it better for rajinikanth to stop acting
Rajinikanth : సూపర్ స్టార్ ఇక సినిమాలు మానుకుంటేనే మంచిదా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే నెటిజన్స్‌లో ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం రజినీ మళ్ళీ కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉండటమే. ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా నంబర్ 1 స్థానాన్ని చేరుకునే వరకు వస్తారని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. కె.బాలచందర్ లాంటి అగ్ర దర్శకుల చేతిలో పడిన రజినీ ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియ స్టార్ ప్రభాస్‌కు చైనా, జపాన్‌లలో లక్షల్లో అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి గానీ, వాస్తవంగా చెప్పాలంటే ఈ క్రేజ్ మన సూపర్ స్టార్ ఎప్పుడో సాధించారు.సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి అంటే అది రజినీకే.
కానీ, ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అని అందరూ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక కమల్ హాసన్ సరి సమానంగా విభిన్న కథా చిత్రాలు చేసిన చేస్తున్న హీరో అంటే తమిళంలో రజినీనే. ఇంకా చెపాలంటే..గడిచిన ఈ 5 ఏళ్ళలో చూసుకుంటే కమల్ కంటే ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఆయనే. ఈ ఏజ్‌లో కూడా రజినీ సినిమా మొదలుపెట్టారంటే అనుకోని కారణాల వల్ల షూటింగ్ పూర్తవడానికి సమయం పడుతుంది తప్ప..అన్నీ అనుకూలిస్తే సూపర్ స్టార్ సూపర్ ఫాస్ట్‌గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు.అయితే, గత 5 ఏళ్ళ నుంచి సూపర్ స్టార్ చేస్తున్న ప్రతీ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతోంది. కంప్లీట్‌గా యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలిస్తూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న ఆయనకు సాలీడ్ హిట్ దక్కడం లేదు. కబాలి, కాలా, పేటా, దర్భార్, గత చిత్రం అణ్ణాత్త వరుసబెట్టి పరాజయాలను మూటగట్టుకున్నాయి.
is it better for rajinikanth to stop acting
దాంతో ఇక రజినీ సినిమాలకు గుడ్‌బై చెప్పడం మంచిదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే ఆయనతో సినిమా చేసేందుకు రెడి అవుతున్నాయి. అణ్ణాత్త తర్వాత ఇక రజినీ సినిమాలు ఒప్పుకోరేమొ అనుకున్నారు. కానీ, ధనుష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెల్సన్ దర్శకత్వంలో చేసే సినిమాను సన్ పిక్చర్ నిర్మిస్తుండగా మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలతో రజినీ ఇంకా సినిమాలు చేస్తూ కష్టపడటం అవసరమా అనే కామెంట్స్‌తో పాటు పెద్దాయన పక్కన ప్రపంచ సుందరి అంటూ వార్తలు రాసుకొస్తున్నారు. మరి రజినీ ఓ సాలీడ్ హిట్ కొట్టి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది తెలియడం లేదు.
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
This website uses cookies.