Puri jagannath : టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఓ రేంజ్ అండ్ ఇమేజ్ ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తన సత్తా మరో దర్శకుడికి లేదనే చెప్పాలి. బద్రి సినిమాతో డైరెక్టర్ అయిన పూరి తన మొదటి సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. మొదటివారం ఈ సినిమా ఫ్లాప్ అనే టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ భారీ హిట్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఇండస్ట్రీలో పూరికి ముందు పరిచయమయిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఇద్దరు కలిసి రాం గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్స్ గా చేశారు. ఆ సమయంలో నీతో నేను సినిమా చేస్తానని పూరి చెప్పేవాడు.
ఆ మాటలని రవితేజ లైట్ తీసుకునేవాడట. ఇతను డైరెక్టర్ ఎప్పుడవ్వాలి..నన్ను హీరోగా పెట్టి సినిమా ఎప్పుడు చేయాలి అని. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో తీసి స్టార్ డైరెక్టర్ అయ్యాక అప్పుడు రవితేజ ఆలోచన మారింది. బద్రి తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాను పూరి, రవితేజతో చేశాడు. అయితే ఈ కథ చెప్పడానికి రవితేజకి కాల్ చేసిన పూరితో నువ్వు కళ్యాణ్ తో సినిమా చేశాక నాతో చేయవనుకున్నాను..అని అన్నాడట. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఒక తమిళ అమ్మాయి
సినిమాలు వరుసగా వచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాయి. ఇలా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి హిట్ అవడం పెద్ద సంచలనం అయింది.
దాంతో పూరి జగన్నాథ్ – రవితేజ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో మళ్ళీ రవితేజతో ఇడియట్ 2 చేయాలనుకున్నాడు. కానీ కథ కుదరకపోవడంతో దాని బదులు దేవుడు చేసిన మనుషులు సినిమా చేశాడు. పూరి జగన్నాథ్ కెరీర్ లో బద్రి, పోకిరి, బిజినెస్ మేన్, కెమరా మాన్ గంగతో రాంబాబు, శివమణి, దేశ ముదురు, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే రవితేజకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన పూరి, దేవుడు చేసిన మనుషులు సినిమాకి అనుకున్న కథను సరిగ్గా చెప్పలేకపోయానని.. తన లైఫ్ లో తీసిన చెత్త సినిమా
ఇదేనని పూరీ జగన్నాథ్ ఒక సందర్భంలో చెప్పారు. అలాగే పూరి – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే కథ అద్భుతంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలోని లోపాలను సరిగా చూపించడానికి పూరి వెనక్కి తగ్గడంతో అనుకున్న హిట్ దక్కలేదు.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.