Jabardast Getup Srinu: ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఏళ్ల నుండి కోట్ల మంది మనసు గెలుచుకున్న ఈ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఇన్నేళ్ళ నుంచి ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికి హైయెస్ట్ రేటింగ్ తో టాప్ ప్లేస్ లోఉంది. ఇక ఈ షోలో పాల్గొనే కమెడియన్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో, తమ పర్ఫామెన్స్ లతో అదరగొడుతున్నారు. ఇలా పాపులర్ అవుతున్న వారికి వెండితెరపై కూడా పలు సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
ఇక ఈ షోలో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. ఆయన ఏ గెటప్ వేసినా తనకంటే బాగా ఇంకెవరూ చేయలేరని ప్రూవ్ చేస్తున్నాడు.
బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా నిలిచాడు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కొత్త తరహా గెటప్ తో వచ్చి ఎంటర్‌టైన్ చేస్తూ గెటప్ శ్రీను గా పాపులారిటీ
తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో వెండితెరపై కూడా తన సత్తాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల జబర్దస్త్ లో నానా రచ్చ చేస్తూ కనిపించాడు గెటప్ శ్రీను.
ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ కొత్త సిరీస్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ఓ కొత్త ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగే కమెడియన్స్ తమ పెర్ఫార్మెన్స్ లతో బాగా ఆకట్టుకున్నారు. ఎంట్రీ తోనే సుడిగాలి సుధీర్ పంచుల మీద పంచులు ఎదుర్కొన్నాడు. అలాగే బుల్లెట్ భాస్కర్ తన స్కిట్ తో తెగ నవ్వించాడు. ఇక గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చి, పక్కనే గొడుగులు అమ్ముతున్న ఆటో రాంప్రసాద్ దగ్గరికెళ్లి రివర్స్ పంచ్ వేయించుకున్నాడు.
సుధీర్ మీ ఊర్లో ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. దాంతో ప్లే స్కూల్ అని సమాధానం ఇవ్వడంతో, అది చేపలు తిరిగే ప్లే స్కూల్ అని తెలిపాడు. అప్పుడే శ్రీనుకు ఓ ఫోన్
వస్తుంది. అందులో ఎవరు.. అని ప్రశ్నించడంతో.. అయ్య బాబోయ్ పిల్లాడు పుట్టాడు అంటూ సుధీర్ ను, రాంప్రసాద్ ను కౌగిలించుకొని రచ్చ చేశాడు. సుధీర్ కంగ్రాట్స్ అంటూ.. ఎవరు మీ బాబా అని అడుగుతాడు. లేదు శీలావతి చేపకు మగపిల్లాడు పుట్టాడు అంటూ పంచ్ వేశాడు. దీంతో సుధీర్, రాంప్రసాద్ షాకవుతారు. మిగతా వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. అయితే ఈ ప్రోమో చూసిన కొంతమంది గెటప్ శ్రీనుకి కొడుకు పుట్టాడా.. ఇక జబర్దస్త్‌కి గుడ్ బై చెప్తున్నాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.