
is kamal haasan dating with star heroine puja kumar
Kamal Haasan : కమల్ హాసన్ తెలుసు కదా. ఆయనకు వెర్సటైల్ యాక్టర్ అనే పేరు ఉంది. దాదాపు 60 ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 1960 లోనే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి సినిమాలే జీవితంగా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఆయన వయసు 70 దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో బాక్సాఫీసును బద్దలు చేశాడు కమల్ హాసన్.
కమల్ హాసన్ సినిమాలు ఎంత వెరైటీగా ఉంటాయో.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆయన ఇప్పటికే నటి గౌతమితో సహజీవనం చేసి ఇద్దరూ విడిపోయారు. అంతకు ముందే తన మొదటి భార్యతో విడిపోయాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న కమల్ హాసన్ మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. నటి పూజా కుమార్ తో కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నాంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దానికి కారణం.. కమల్ నటించిన విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూజా కుమారే.
is kamal haasan dating with star heroine puja kumar
వరుసగా కమల్ తో పూజా కుమార్ సినిమాల్లో నటించడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం స్టార్ట్ అయింది. ఇద్దరూ కలిసి రొమాంటిక్ సీన్లలోనూ నటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఇద్దరూ లిప్ లాక్ లోనూ నటించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ప్రారంభం అయింది. అయితే.. ఈ వార్తలపై పూజా కుమార్ వెంటనే స్పందించింది. నేను దాదాపుగా ఐదేళ్ల నుంచి కమల్ హాసన్ తో సినిమాలు చేస్తూ వస్తున్నా. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా క్లోజ్. అలా అని.. మా మధ్య ఎలాంటి అఫైర్ లేదు.. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయకండి అని పూజా కుమార్ ఇటీవల మీడియా స్టేట్ మెంట్ ఇచ్చి.. వాళ్ల మధ్య వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.