
నాగ చైతన్య గత కొంత కాలంగా సినిమాలని ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. అనవసరమైన ప్రయోగాలని సాహసం చేయడం లేదు. అందుకు కారణం గతంలో నాగ చైతన్య కి తగిలిన దెబ్బలే అని చెప్పుకుంటున్నారు. ఆటో నగర్ సూర్య, దోచేయ్, దడ లాంటి సినిమాలతో నాగ చైతన్య భారీ ఫ్లాప్స్ చూడాడు. అప్పటి నుంచి కాస్త కొత్త దర్శకులకి.. ప్రయోగాలకి ఆమడ దూరం ఉంటున్నాడు. అంతేకాదు మాస్ ఎంటర్‌టైనర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అయినా కూడా మాస్ కథ చెబితే మాత్రం సింపుల్ గా నో అంటున్నాడట.
ఈ క్రమంలోనే మజిలీ అన్న సినిమా చేశాడు. సమంత హీరోయిన్ గా నటించింది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య సమంత కలిసి చేసిన మజిలీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు శివ నిర్వాణ మజిలీ సినిమాని తెరకెక్కించాడు. దాంతో ఆ తర్వాత సమంత – నాగ చైతన్య దర్శక, రచయితలకి మజిలీ వంటి కథ ఉంటే చెప్పమని అడిగారట. అంతగా ఈ కథ సాం చైతులకి కనెక్ట్ అయింది. కాగా ఆ తర్వాత నాగ చైతన్య మళ్ళీ వేరే సినిమా చేయలేదు.
ఎట్టకేలకి క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అన్న నమ్మకంతో ఉన్నాడట చైతూ. ఇక ప్రస్తుతం థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. విక్రం కుమార్ కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే పెళ్ళి చూపులు దర్శకుడి తో నాగ చైతన్య సినిమా ఉటుందని వార్తలు వచ్చినప్పటికి ఎందుకనో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే నాగ చైతన్య … తరుణ్ భాస్కర్ తో సినిమా చేయడానికి డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం తరుణ్ భాస్కర్ వరసగా సినిమాలు చేయకపోవడమే కారణం అని చెప్పుకుంటున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.