నాగ చైతన్య అందుకు ధైర్యం చేయలేకపోతున్నాడా ..?
నాగ చైతన్య గత కొంత కాలంగా సినిమాలని ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. అనవసరమైన ప్రయోగాలని సాహసం చేయడం లేదు. అందుకు కారణం గతంలో నాగ చైతన్య కి తగిలిన దెబ్బలే అని చెప్పుకుంటున్నారు. ఆటో నగర్ సూర్య, దోచేయ్, దడ లాంటి సినిమాలతో నాగ చైతన్య భారీ ఫ్లాప్స్ చూడాడు. అప్పటి నుంచి కాస్త కొత్త దర్శకులకి.. ప్రయోగాలకి ఆమడ దూరం ఉంటున్నాడు. అంతేకాదు మాస్ ఎంటర్‌టైనర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అయినా కూడా మాస్ కథ చెబితే మాత్రం సింపుల్ గా నో అంటున్నాడట.
ఈ క్రమంలోనే మజిలీ అన్న సినిమా చేశాడు. సమంత హీరోయిన్ గా నటించింది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య సమంత కలిసి చేసిన మజిలీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు శివ నిర్వాణ మజిలీ సినిమాని తెరకెక్కించాడు. దాంతో ఆ తర్వాత సమంత – నాగ చైతన్య దర్శక, రచయితలకి మజిలీ వంటి కథ ఉంటే చెప్పమని అడిగారట. అంతగా ఈ కథ సాం చైతులకి కనెక్ట్ అయింది. కాగా ఆ తర్వాత నాగ చైతన్య మళ్ళీ వేరే సినిమా చేయలేదు.
ఎట్టకేలకి క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అన్న నమ్మకంతో ఉన్నాడట చైతూ. ఇక ప్రస్తుతం థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. విక్రం కుమార్ కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే పెళ్ళి చూపులు దర్శకుడి తో నాగ చైతన్య సినిమా ఉటుందని వార్తలు వచ్చినప్పటికి ఎందుకనో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే నాగ చైతన్య … తరుణ్ భాస్కర్ తో సినిమా చేయడానికి డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం తరుణ్ భాస్కర్ వరసగా సినిమాలు చేయకపోవడమే కారణం అని చెప్పుకుంటున్నారు.