Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అనుకున్నది ఒకటీ అయిందొకటి..నయనతార రేంజ్ ఊహించుకుందే పాపం..! అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. అందుకు కారణం బాలకృష్ణ, బోయపాటి శ్రీను..వీరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా. కంచె సినిమాతో డీసెంట్ హీరోయిన్‌గా ప్రగ్యాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఆ క్రేజ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం తెలుసుకోలేకపోయింది. సాయి పల్లవి మాదిరిగా అటు డీసెంట్ రోల్స్‌కు ఫిక్సవకుండా..పూజా హెగ్డే, రష్మికల మాదిరిగా ఇటు గ్లామర్ రోల్స్‌కు డిసైడవకుండా కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకుంది.
మొదటి సినిమా తర్వాత అవకాశాలు వచ్చినా కూడా ప్రగ్యాకు ఆశించిన సక్సెస్‌లు దక్కలేదు. అమ్మడి హైట్..చేసే గ్లామర్ రోల్స్‌కు స్టార్ హీరోయిన్‌గా పోటీ పడాల్సింది. కానీ, అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆమె సరైన కథలను ఎంచుకోకపోవడమే. పెద్ద దర్శకులైన కృష్ణవంశీ, బోయపాటి శ్రీను లాంటి వారి సినిమాలలో నటించినా కూడా అమ్మడికి కలిసి రాలేదు. అదే ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే, ప్రగ్యా డేట్స్ ఇప్పుడు కష్టమయ్యేవే. చేసిన సినిమాలు ఫ్లాపవుతుండంతో చేతిలో అవకాశాలే లేకుండా పోయాయి.
ఎట్టకేలకు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ప్రగ్యా కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రను దర్శకుడు బోయపాటి సింహ సినిమాలో నయనతార రేంజ్‌లో డిజైన్ చేశాడని అఖండ రిలీజ్‌కు ముందు అనుకున్నారు. కానీ, అంత ఇంపాక్ట్ లేదని తర్వాత అర్థమైంది. ప్రగ్యా కూడా నిజంగా అదే రేంజ్ ఊహించుకుంది. కానీ, అఖండ అంత భారీ హిట్ సాధించినా కూడా క్రెడిట్ మొత్తం హీరో బాలకృష్ణకు.. దర్శకుడు బోయపాటికే దక్కింది. ఈ సినిమాతో ప్రగ్యాకు ఒరిగింది మాత్రం ఏమీ లేదనే నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఈ పాటికి కనీసం రెండు భారీ చిత్రాలలో అయినా హీరోయిన్‌గా అవకాశాలు అందుకునేదే..అంటున్నారు. చూస్తే అది నిజమే అనిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.