samantha : అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిన్న తెల్లవారు జామునుంచే సినిమా చూసిన వారంతా పుష్ప సినిమా ఎలా ఉందనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫాన్స్ అంతా థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన వెంటనే సినిమా వేరే లెవెల్లో ఉందని అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని పొగడ్తలు కురిపిస్తున్నారు. అయితే ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ డల్ అని, క్లైమాక్స్ వీక్ గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేవిశ్రీప్రసాద్ పాటలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా అందించలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా లాస్ట్ లో సమంత ఐటమ్ సాంగ్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన చిత్ర బృందానికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.ఈ స్పెషల్ సాంగ్ అనుకున్నంత హైలెట్ కాలేదనే నెగిటివ్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. సమంత చేసిన ఈ స్పెషల్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అందరూ చెప్పుకున్నారు. అయితే సినిమాలో సాంగ్ చూసిన అనంతరం ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దేవీ, సుక్కు కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన ఐటెం సాంగ్స్ అన్నింటి కంటే ఇది అనుకున్నంత హైలెట్ కాలేదని చూసినవారు అంటున్నారు.
అలా సినిమాకు ప్లస్ అవుతుందనుకున్న సమంత సాంగే ఇప్పుడు మైనస్ అయి కూర్చుంది.మరోవైపు సినిమాపై ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో..అంతే నెగిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా నిడివి చాలా ఎక్కువైందని కొంతమంది.. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి మంచి నటుల నుంచి నటనను రాబట్టుకోకుండా కేవలం బన్నీ ఎలివేషన్ పైనే సుకుమార్ దృష్టి పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా కార్ లో బన్నీ, రష్మీక మధ్య వచ్చే చేయి సీన్… సుక్కు మార్క్ సీన్ కానీ కాదంటున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమా మాత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతూ ఉండటం గమనార్హం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.