Home » Entertainment » Is Shanker Aparichitudu With Ranveer Singh
Entertainment

Ranveer singh : రణ్‌వీర్ సింగ్‌తో శంకర్ అపరిచితుడు ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: April 14, 2021, 8:31 pm
Advertisement

Ranveer singh : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో క్రేజీ స్టార్ డైరెక్టర్ శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ త్వరలో ప్రారంభించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. అయితే శంకర్ ఇప్పటికే కమల్ హాసన్‌తో ఇండియన్ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా దర్శక, నిర్మాతలకి మధ్య క్రియేట్రివ్ డిఫ్రెన్స్ రావడంతో ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది.

Advertisement

is shanker aparichitudu with ranveer-singh-

దాంతో శంకర్ టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. దాంతో మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా.. ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఆలోచిస్తున్నారు. అయితే ఇంతలోనే ఇండియన్ 2 మేకర్స్ షాకిచ్చారు.

Advertisement

Ranveer singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

శంకర్ ముందు ఇండియన్ 2 పూర్తి చేయాల్సిందేనని.. ఆ తర్వాతే మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని అధికారకంగా వెల్లడించారు. దాంతో చరణ్ – శంకర్‌ల ప్రాజెక్ట్ డిలే అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలోనే శంకర్ మరో షాకిచ్చాడు. 2005 లో వచ్చిన అన్నియన్ ఇప్పుడు హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో చేయబోతున్నట్టు అధికారక ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో జయంతిలాల్ గడ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు గాని ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి