Home » Entertainment » It Was Not Chiranjeevi Who Gave That Name To Ram Charans Daughter
Entertainment

Ram Charan Daughter : రామ్ చరణ్ కూతురుకి ఆ పేరు పెట్టింది చిరంజీవి కాదు.. ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ !

Authored By
Breaking News
The Telugu News | Updated on: July 2, 2023 8:26 pm
Advertisement

Ram Charan Daughter : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన జంటకి 11 సంవత్సరాల తర్వాత జూన్ 20వ తారీకు ఆడబిడ్డ జన్మించడం తెలిసిందే. ఎప్పటినుండో చరణ్ కి పిల్లలు పుట్టాలని మెగా కుటుంబానికి చెందిన వాళ్లు మరియు అభిమానులు కోరుకుంటున్నారు. 2012లో చరణ్ మరియు ఉపాసన పెళ్లి జరిగింది. ప్రేమించి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగా.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించడంతో మెగా కుటుంబంలో ఎంతో సంతోషమైన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే పుట్టిన పాపకు “క్లీం కార” అనే పేరు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

చాలా వైవిధ్యంగా ఈ పేరు ఉండటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బారసాల కార్యక్రమం అనంతరం తన మనవరాలు పేరును మెగాస్టార్ చిరంజీవిని అధికారికంగా ప్రకటించారు. ఇది సాక్షాత్తు అమ్మ వారి పేరును ప్రతి పంపించేదని పండితులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పేరును ఉపాసన తల్లి శోభన కామినేని సూచన మేరకు పెట్టడం జరిగిందని కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం. అంతేకాదు ఉపాసన తల్లి శోభన కామినేని రీసెంట్ గా చేసిన పోస్ట్ లో “నువ్వు పుట్టినప్పుడు నీకు ఈ పేరును పెట్టాలనుకున్నాను. కానీ ఆ సందర్భం రాలేదు.

It was not Chiranjeevi who gave that name to Ram Charan’s daughter

Advertisement

ఇప్పుడు అదే పేరు నువ్వు నీ కూతురికి పెట్టుకున్నావు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి పేరు. ఈ పాప మన జీవితాలలో ఎన్నో వెలుగును తీసుకొస్తుంది.. నువ్వు పాప చరణ్ ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ పెట్టి చరణ్ కూతురికి ఉపాసన తల్లి మదిలో పుట్టిన పేరు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొదట మనవరాలు పేరు సోషల్ మీడియాలో చిరంజీవి ప్రకటించడంతో ఆయనే పెట్టారని అందరూ భావించారు. కానీ చరణ్ అత్తగారు పెట్టిన పోస్ట్ బట్టి ఆమె మదిలో ఆలోచనలలో పుట్టినదే ఈ పేరు అని అర్థమవుతుంది

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి