
Jabardast rocking Rakesh KCR movie
Rocking Rakesh : బుల్లితెర మోస్ట్ పాపులారిటీ షో అయిన జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను బెస్ట్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ లో చేసిన చాలామంది కమెడియన్ లు ఇప్పుడు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు జబర్దస్త్ కమెడియన్లు వెండి తెరపై సెటిల్ అయ్యారు కూడా. ఈ క్రమంలోనే రాకేష్ కూడా ఓ సినిమా రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు. తనే హీరోగా నిర్మిస్తూ కేసీఆర్ పేరు మీద సినిమా తీస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా లాంచ్ గ్రాండ్గా జరిగింది.
తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై స్పందించిన రాకింగ్ రాకేష్ తాను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. హీరో హీరోయిన్ల కి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ కి ఎందుకు ఫ్యాన్స్ ఉండకూడదు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నా అని రాకింగ్ రాకేష్ చెప్పాడు. తాను బినామీ డబ్బులతో ఈ సినిమా నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన, నేను కట్టించిన ఇల్లు తాకట్టు పెట్టా. నా కారు కూడా అమ్ముకున్నా. ఇంటికి సంబంధించిన పేపర్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు.
అంతకుముందు కేసీఆర్ సినిమా చేస్తామని కొందరు వ్యక్తులు మాట ఇచ్చి సడన్గా హ్యాండ్ ఇచ్చారు అని రాకింగ్ రాకేష్ తెలిపాడు. ఈ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చింది అని చెప్పాడు. ఓ ప్రముఖ రచయిత మోసం చేయడం వల్లే సినిమా మొదలవ్వడానికి ముందే కారు అమ్ముకున్నాను. ఈ విషయంలో మా అమ్మతోపాటు నా భార్య సుజాత కూడా నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తున్నారు. సుజాత లాంటి భార్య దొరకటం నా అదృష్టం అంటూ రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. ఏది ఏమైనా జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ కి మంచి లైఫ్ దొరికింది అని చెప్పాలి. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ వెండితెరపై సెటిల్ అయ్యారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.