Jabardasth Comedian Bobby Father Proposes Rashmi Gautam In Sridevi Drama Company
Rashmi Gautam : శ్రీదేవీ డ్రామా కంపెనీ షో చాలా కొత్త దారిలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లతో స్కిట్లు వేయిస్తుంటుంది. ఇక స్పెషల్ డేస్ అంటూ కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తోంది. ఆదివారం నాటి ఫాదర్స్ డే సందర్భంగా కమెడియనర్ల ఫాదర్లను పిలిపించారు. వారితో స్కిట్లు వేయించారు. అలా మొత్తానికి నూకరాజు తండ్రి, బుల్లెట్ భాస్కర్ నాన్న, బాబీ తండ్రి, సుజాత ఫాదర్ ఇలా అందరూ స్టేజ్ మీదకు ఎక్కారు. తమ తమ స్టైల్లో దండి పడేశారు. ఇక శాంతి కుమార్ కూతురు, నవీన్ కొడుకు కూడా బాగానే నవ్వించారు. ఇందులో జబర్దస్త్ బాబీ తండ్రి మాత్రం రష్మీ మీద కన్నేసినట్టు కనిపించింది.
ఎందుకొచ్చావ్ అని అంటే.. రష్మీ ఉంది కదా? అని అనేశాడు. రష్మీతో మాట్లాడొచ్చు అని వచ్చానని అంటాడు. ఇక రష్మీ ఫోన్ నంబర్ ఇస్తుందేమో అని ఆశపడ్డాడట. అందుకే తన నంబర్‌ను రెండు చీటిల్లో రాసుకొచ్చాడట. రెండు చీటిల్లో ఎందుకు రాసుకొచ్చావ్ అని అడిగితే.. పూర్ణ కూడా ఉంది కదా? ఆమెకి కూడా ఇద్దామని అంటాడు. ఇక ఇలానే ఉంటే ఇంకా రెచ్చిపోతాడు అని తన తండ్రిని స్టేజ్ మీద నుంచి తీసుకెళ్దామని బాబీ అనుకుంటాడు. కానీ అతను మాత్రం వచ్చేందుకు ఒప్పుకోడు. ఇంకో పని ఉంది ఆగు అని రష్మీ వద్దకు వెళ్తాడు. నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ..
Jabardasth Comedian Bobby Father Proposes Rashmi Gautam In Sridevi Drama Company
నువ్ ఏడిస్తే మాత్రం నేను బాధపడతాను అంటూ రష్మీ ముందు మోకాళ్ల మీద నిల్చుని చెప్పేశాడు బాబీ తండ్రి. మొత్తానికి అలా ప్రపోజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. రష్మీ సుధీర్ ప్రపోజల్, ఆ డైలాగ్స్ అంతగా ఫేమస్ అయ్యాయన్నమాట. మొత్తానికి ఇలా తండ్రులు వేసిన స్కిట్ మాత్రం అదిరిపోయింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా పర్ఫామెన్స్ ఇచ్చారు. శాంతి కుమార్ అయితే మొదటి సారిగా తన కూతురిని తీసుకొచ్చాడు. నవీన్ తన కొడకుని పట్టుకొచ్చాడు. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రుల పరువుతీసేశారు. సెటైర్లతో ఆడేసుకున్నారు. అలా స్కిట్ మొత్తం నవ్వుల వర్షం, పంచ్‌ల ప్రవాహం జరిగింది. ఇక వచ్చే వారం ఏ కాన్సెప్ట్‌తో వస్తారో చూడాలి.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.