Jabardasth Comedian : పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే విడిపోయిన జబర్దస్త్ కమెడియన్.. అసలు విషయం ఏంటంటే!
Jabardasth Comedian : బుల్లితెరపై పటాస్ కార్యక్రమంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ తో పలువురు కమెడియన్స్ కి మంచి గుర్తింపు లభించింది. వారిలో యాదమ్మ రాజు కూడా ఒకరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య జీ తెలుగులో ఒక కార్యక్రమంలో కనిపించిన యాదమ రాజు, ఆ తర్వాత స్టార్ మా లో కొన్ని కార్యక్రమాల్లో కనిపించాడు. చుట్టూ తిరిగి అక్కడికే వచ్చినట్లు తాజాగా మల్లెమాల కే వచ్చి జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేస్తున్నాడు.
Jabardasth comedian who lives away from his wife
జబర్దస్త్ లో సహ టీం లీడర్ గా వ్యవహరిస్తున్న యాదమ రాజు ఇటీవలే తన ప్రియురాలు స్టెల్లా ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహానికి మెగా బ్రదర్ నాగబాబు తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రేమ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టి పెళ్లి బంధానికి నాంది పలికారు. వీరి వివాహ బంధం గురించి ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. పెళ్లి అయ్యి కొన్ని వారాలు కూడా కాకుండానే యాదమ్మ రాజు మరియు అతని భార్య విడిపోయారు.
Jabardasth comedian who lives away from his wife
విడిపోయారు అంటే గొడవలు పడి అని కాదు, ఉన్నత చదువుల నిమిత్తం యాదమ రాజు భార్య విదేశాలకు వెళ్ళింది. అక్కడ ప్రస్తుతం ఆమె ఉన్నత చదువులు చదువుతున్నట్లుగా తెలుస్తుంది. ఏడాదిలోగా మళ్లీ ఇండియాకు తను తిరిగి రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి పెళ్లయిన వెంటనే ఇలా భార్యకు దూరం ఉండడం కష్టమే.. కానీ యాదమ్మ రాజు భవిష్యత్తు గురించి ఆలోచించి భార్యను ఉన్నత చదువుల నిమిత్తం పంపించడం మంచిదే అంటూ ఆయన సన్నిహితులు మరియు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు.
