Home » Entertainment » Jabardasth Comedian Will Be There Or Not
Entertainment

Jabardasth : ఈయన అయినా జబర్దస్త్ షో లో ఉంటాడా లేదా… ఏంటి ఈ సస్పెన్స్?

Authored By
aruna
The Telugu News | Published on: August 1, 2022, 1:20 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ గతం లో ఎప్పుడూ లేనంతగా కష్టాలను ఎదుర్కొంటోంది. వరుసగా రికార్డు స్థాయి రేట్లను దక్కించుకున్న జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితి ని ఎదుర్కుంటుంది. మల్లెమాల మరియు ఈటీవీ ని టాప్ పొజిషన్లో నిలిపిన జబర్దస్త్ కామెడీ షో అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సమయంలో కమెడియన్స్.. జడ్జ్‌ లు.. యాంకర్‌ లు ఇలా ప్రతి ఒక్కరు కూడా వెళుతున్నారు. దాంతో జబర్దస్త్ కొన్ని రోజుల్లో ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ సమయంలో జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో కూడా వెళ్ళిపోతాడు అనే ప్రచారం జరుగుతోంది. రోజా ఉన్న సమయంలో ఆయన వరుసగా అన్ని ఎపిసోడ్ లు కనిపించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన గెస్ట్‌ అప్పియరెన్స్ ఇస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే జబర్దస్త్ లో గెస్ట్ గా కనిపిస్తున్న ఆయన ముందు ముందు జబర్దస్త్ పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు మనో వెళ్లి పోయాడు అని కూడా ప్రచారం చేశారు. కానీ ఇటీవల ఒక ఎపిసోడ్కు ఆయన జడ్జి గా వ్యవహరించి మళ్లీ ఈ టీవీ మల్లెమాల తో తనకు సంబంధం కొనసాగుతుంది అంటూ చెప్పకనే చెప్పారు.

Jabardasth Comedian Will be there or not

Advertisement

కానీ వచ్చేవారం రాబోతున్న ఎపిసోడ్ లో మాత్రం కనిపించడం లేదు. దాంతో మళ్లీ ఆయన ఉన్నాడా లేదా అనే అనుమానాలకు తెర తీసినట్లు గా అయింది. వరుసగా అన్ని ఎపిసోడ్ ల్లో కనిపిస్తే పర్వాలేదు కానీ ఇలా కనిపించి కనిపించకుండా వెళితే కష్టం అంటూ మల్లెమాల వారు కూడా సింగర్ మనో పై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మనో రాని సమయంలో జడ్జీలను తీసుకు రావడం కోసం మల్లెమాల ప్రొడక్షన్ టీం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన రెగ్యులర్ గా వస్తే బాగానే ఉంటుందని, ఆయన రాకుంటే మాత్రం ముందు ముందు మల్లెమాల వారు తొలగించాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి